వరంగల్ నగరంలో ప్రజాపథం


వరంగల్‌: మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ప్రజల త్రాగునీటి సమస్య నివారించటానికి గాను నిధులు వెచ్చించి యుద్దప్రదికన తగు చర్యలు చేపడుతున్నట్లు నగర మేయర్‌ ఎర్రబెల్లి స్వర్ణ తెలిపారు. ప్రజాపథంలో భాగంగా సోమవారం రోజున 50 వ డివిజన్‌ ప్రాంతమయిన కాకతీయ కాలనీలో విస్త్రతంగా పర్యటించి ప్రజల ద్వారా స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. సిక్‌ వాడలోని ప్రజలు నల్లా కొరకు ధరఖాస్తు చేసుకొని రుసుము చెల్లించినట్లయితే వెంటనే కనెక్షన్లు ఇప్పిస్తామని, పని చేయకుండా వున్న బోర్‌ వెల్‌ స్థానంలో మరొక బోర్‌ వెల్‌ వేయిస్తామన్నారు.

గతంలో కాకతీయ కాలనీలో అంతర్గత సిసి రోడ్లు, డ్రైనేజి నిర్మాణం చేపట్టడం జరిగిందని ఇంకా అవసరమయిన చోట ప్రజలు స్పందించి తమ కాంట్రిబూషన్‌ అందిస్తే కార్పొరేషన్‌ ద్వారా సి.సి. రోడ్లు వేస్తామన్నారు. రహదారికి అసౌకర్యంగా వున్న విద్యుత్‌ స్థంబాలను తోలగించవల్సినదిగా విద్యుత్‌ అధికారులను మేయర్‌ ఆదేశించారు. త్రాగునీటి సౌకర్యం నిమిత్తం షిప్ట్‌ వారీగా వాటర్‌ ట్యాంక్‌ పంపిస్తున్నామని ప్రజలు కూడా నీటిని పొదుపుగా వాడి కార్పొరేషన్‌ కు సహకరించాలని కోరారు. నగరంలో సుమారు 178 కోట్లతో అండర్‌ పైప్‌ లైన్‌ నిర్మాతానికి రూపకల్పన చేశామని తద్వారా లీకేజిని అరికట్టవచ్చునని పేర్కొన్నారు.

కాకతీయ కాలనీ నుండి ములుగు రోడ్డు వెళ్లే దారిలో గల బ్రిడ్జీ ఎత్తును పెంచడానికి గాను చర్యలు తీసుకుంటామన్నారు. అలంకార్‌ఒ థియెటర్‌ దాటిన తర్వాత వరంగల్‌ ప్రధాన రహదారిపై గల బ్రిడ్జి వెడల్పు చేయించుటకు 6 కోట్ల రూపాయలు మంజూరీ చేయించామన్నారు. స్మశాన వాటిక కాంపౌండ్‌ వాల్‌ మంజూరీ జరిగిందన్నారు. రూ. 11 కోట్ల 80 లక్షల బి.ఆర్‌.జి.ఎఫ్‌ నిధులతో కార్పొరేషన్‌ ద్వారా వివిధ అభివృద్థి పనులను చేపట్టనున్నట్లు మేయర్‌ శ్రీమతి స్వర్ణ తెలిపారు.

ఈ కార్యక్రమంలో కుడా వైస్‌ ఛైర్మన్‌ శంకరయ్య , కొండపల్లి దయాసాగర్‌ రావు స్థానిక కార్పొరేటర్‌ చీకటి శారద ఆనంద్‌, రావుల సదానందం, ఎస్‌.ఇ. మున్సిపల్‌ కార్పొరేషన్‌ కలీమ్‌, డి.ఇ. పబ్లిక్‌ హెల్త్‌ ప్రభాకర్‌ , విద్యుత్‌ శాఖ డి.ఇ. లక్ష్మారెడ్డి, మైనార్టి ప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.