సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత


గుంటూరు: జిల్లాలో జరుగుతున్న ప్రజాపథం కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ తమ సమస్యలను విన్నవించుకుని పరిష్కరించుకోవాలని జిల్లా కలెక్టర్‌ బి.రామాంజనేయులు అన్నారు. శుక్రవారం పొన్నూరు నియోజకవర్గం పెదకాకాని మండలం వెంకటక్రిష్ణాపురం గ్రామంలో జరిగిన ప్రజాపథం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలలో ప్రతి పేదవానికి న్యాయం జరుగుతుందన్నారు. నిరుపేద కూలీలకు పనులు కల్పించడం ద్వారా వారి ఆర్ధిక స్థితిగతులను మెరుగు పరచే పథకం జాతీయ గ్రామీణ ఉపాథి హామీ పథకమని అన్నారు. ఈ పథకం కింద గ్రామాలలో ఆస్తులను పెంచుకునే అవకాశం ఉందన్నారు. పొలాలకు, శ్మశానాలకు వెళ్ళే రోడ్లు, కాలనీలలో అంతర్గత రోడ్లు తదితర కార్యక్రమాలు చేపట్టడం ద్వారా కూలీలకు ఉపాథి కల్పించే అవకాశం ఉంటుందన్నారు.

ప్రతి ఒక్కరు సంవత్సరానికి 100 రోజులు పనులు చేసుకునే అవకాశం ఈ పథకంలో రూపొందించబడిందన్నారు. పొలం పనులకు వెళ్ళే కూలీలు ఇతర సమయాలలో కూడా ఈ పథకం కింద పనులు చేసుకుని ఆదాయం పెంచుకోవచ్చని కలెక్టర్‌ సూచించారు. ఆరోగ్యశ్రీ, 104, 108 సేవల గురించి కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి కుటుంబంలోని వారి ఆరోగ్య సమస్యల పట్ల, వైద్య అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని అన్నారు.

ఆరోగ్యశ్రీ పథకం ద్వారా శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారి ఆరోగ్యం పట్ల ఏ.ఎన్‌.ఎం లు ప్రత్యేక శ్రద్ద వహించి ఎప్పటికప్పుడు వారి స్థితి గతులను పరిశీలించాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. అలాగే గర్భిణీ స్త్రీల విషయంలో కూడా ఆశా కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని అన్నారు. ఇటీవల జరిగిన రేషన్‌ కార్డుల పరిశీలన కార్యక్రమంలో అర్హత కలిగిన వారి రేషన్‌ కార్డులను కూడా తొలగిస్తున్నారనే అపోహ ప్రజలలో ఉందని, కానీ అటువంటి రేషన్‌ కార్డులను తొలగించడం అనేది ఉండదని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

పొన్నూరు శాసన సభ్యులు దూళిపాళ్ళ నరేంద్ర కుమార్‌ మాట్లాడుతూ ప్రజాపథం కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. వారి సమస్యలను పరిష్కరించుకుని అభివృద్ది వైపు అడుగులు వేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవ ర్గ అభివృద్ది అధికారి యం.రాథాక్రిష్ణ, ప్రత్యేక అధికారి సులేమాన్‌ భాష, తాహశీల్దార్‌ వెంకటాచారి, యం.డి.ఓ జోసఫ్‌ కుమార్‌, సర్పంచ్‌ సుజాత, వివిధ శాఖలకు చెందిన అధికారులు, ప్రజా ప్రతినిథులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisements

దేశ భవిష్యత్తుకు జనాభా గణనే మూలం


కడప: దేశ భవిష్యత్తుకు యోగ్యమైన ప్రణాళిక రూపకల్పనకు ఉపయోగపడే జనగణన కార్యక్రమానికి ప్రజలు పూర్తిగా సహకరించాలని నగర మేయర్‌ పి.రవీంద్రనాదరెడ్ఖి పిలుపునిచ్చారు. శుక్రవారం మేయర్‌ స్వగృహంలో జనాభాగణన వివరాలను నమొదు చేశారు. సూపర్‌ వైజర్‌ శివారెడ్డి, . ఎన్యూమరేటర్ స్వర్ణలతకు మేయర్‌ తన కుటుంబ వివరాలను తెలపగా వారు సంబంధిత పత్రాల్లో నమోదు చేసుకున్నారు.

ఈ సందర్బంగా మేయర్‌ మాట్లాడుతూ ప్రతి పదేళ్ల కోసారి జనాభాగణన ప్రక్రియ జరుగుతుందన్నారు. 2001 తర్వాత 2010లో మళ్లీ జనాభాగణన జరుగుతోందన్నారు. వార్షిక ప్రణాళికల రూపకల్పనకు, తద్వారా సమర్థవంతమైన పరిపాలనకు ఈ జనాభా గణన వివరాలు ఎంతగానో తోడ్పడతాయన్నారు. దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే జనాభా వివరాలు ఎంతో ము ఖ్యమని, ప్రజలందరూ ఈ ప్రక్రీయ సజావుగా జరిగేలా స హకరించాలన్నారు. జిల్లాలో జనగణన కార్యక్రమం సకాలంలో పూర్తి చేసేందుకు వీలుగా ఎన్యూమరేటర్లు అడిగిన సమాచారాన్ని అందించి ప్రజలు స హకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ నబీర సూల్‌, మున్సపిల్‌ కమిషనరు జాన్‌ శ్యాంసన్‌, మున్సిపల్‌ ఇంజనీర్‌ఒ శివరాంరెడ్డి, హెల్త్‌ అదికారి వినోద్‌ కుమార్‌ఒ, టిపిఒ శివనారాయణ, మెప్మా పిడి లక్మి, టిపివో సరోజ, త హశీల్దార్‌ మునిరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

బడుగుల సంక్షేమానికి చర్యలు: గల్లా


చిత్తూరు: మహిళలు రైతులు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషిచేస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామాత్యులు శ్రీమతి గల్లా అరుణకుమారి పేర్కోన్నారు. శుక్రవారం ఉదయం గుడిపాల మండలంలో చిత్తపార, సి.బండపల్లి, పాపసముద్రం పంచాయితిలలో ఐదోవిడత ప్రజాపథంలో బాగంగా జరిగిన గ్రామసభలలో మంత్రి ముఖ్య అతిధిగా పాల్గోని ప్రసంగించారు.

ఆయా సర్పంచ్‌ల అధ్యక్షతన జరిగిన ప్రజాపథం సభలో మంత్రి మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టి అమలుచేస్తున్నామని తెలిపారు. అర్హులైన పేదలందరికి సంక్షేమ అభివృద్ది ఫలాలు అందించాలన్నదే తమ ప్రభుత్వ ఆశయమన్నారు. దివంగత ముఖ్య మంత్రి డా.వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి చేపట్టిన పథకాలన్నింటిని సమర్దవంతంగా అమలుచేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజల వద్దకే అధికారులు ప్రజా ప్రతినిధులు వెళ్లి ప్రజల సమస్యలను చర్చించి పరిష్కరించే అత్యుత్తమ వేదిక ప్రజాపథం సభలని మంత్రి తెలిపారు.

సభలో పాల్గొన్న శాసనసభ్యులు సి.కె.బాబు మాట్లాడుతూ దివంగత ముఖ్య మంత్రి డా.వై.ఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశ##పెట్టిన పథకాల ద్వారా పేదలందరు లబ్దిపొందారని ఇందిరా క్రాంతిపథం మహిళలు శక్తిగా ఎదగడానికి తోడ్పడిందని తెలిపారు. సభలలో త్రాగునీరు, ఏడుగంటల విద్యుత్‌ సరఫరా, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ, 104,108 వైద్య సంచార వాహనాలు అందిస్తున్న సేవలు తదితర అంశాలపైన మండల స్దాయి అధికారులతో శాసనసభ్యులు సమీక్షించారు. సి.బండపల్లి పంచాయితీలో మొత్తం జనభా 985 కాగా అందులో 121 మంది వృద్దాప్య పెన్షన్లు పొందుచున్నారని, 92 కుటుంబాలకు మంజూరైయ్యాయని, ఉపాధి హామీ పథకంలో 236 జాబ్‌ కార్డులు పొందారని ఇంతవరకు 12.34 లక్షల రూపాయలు కూలీక్రింద చెల్లింపులు జరిగాయని అధికారులు వివరించారు.

ఇందిరా క్రాంతి పథంలో 22 సంఘాలు వుండగా 153 లక్షల రూపాయలు మహిళా సంఘాలకు అందించడం జరిగిందని డి.ఆర్‌.డి.ఎ. ఎ.పి.యం సభలో వివరించారు. చిత్తపార పంచాయితీలో 127 మందికి ఇందిరమ్మ గృహాలు, 298 మందికి పెన్షన్లు పొందుచున్నారని, ఉపాధిహామీలో 404 మంది జాబ్‌ కార్డులు పొందారని 9.10 లక్షలు ఉపాధి హామీలో ఖర్చుచేయడం జరిగిందని, రాజీవ్‌ ఆరోగ్యశ్రీలో 15 మందిలబ్దిదారులు వివద వైద్యచికిత్సల నిమిత్తం 6.65 లక్షలు ఖర్చుచేయడం జరిగిందని సంబందిత అధికారులు వివరించారు.

మండల స్పెషల్‌ ఆపీసరు, డి.ఎఫ్‌.ఓ పార్ధసారది, మండల స్దాయి అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో గ్రామసభలకు హాజరైయ్యారు. పాపసముద్రం గ్రామంలో 3.5 లక్షలతో బి.ఆర్‌.జిఎఫ్‌ నిధులతో నిర్మించిన అంగన్‌ వాడి భవనాన్ని మంత్రి గల్లా అరుణకుమారి ప్రారంబించారు.

సొరేన్‌ను కొనసాగించేందుకు భాజపా సంసిద్ధత


రాంచీ: జార్ఖండ్‌ రాజకీయాలు సస్పెన్స్‌ సినిమాను మించాయి. పూటకో మలుపు తిరుగుతూ ప్రజలు ఔరా అనుకునేలా చేస్తున్నాయి. మొన్నటివరకు భాజపా మద్దతు తీసుకున్న ముఖ్యమంత్రి శిబూసొరేన్‌ పార్లమెంటులో కోత తీర్మానాల అనంతరం రూటు మార్చారు. కాంగ్రెస్‌ మద్దతుతో ప్రభుత్వం నడిపేందుకు సిద్ధమయ్యారు. దీంతో భాజపా సొరేన్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాలని నిర్ణయించింది. అనంతరం సొరేన్‌ కుమారుడు హేమంత్‌ పొరేన్‌ భాజపాకు మద్దతు ప్రకటించారు. దీంతో ఉత్కంఠ నెలకొంది. తీరా ఈరోజు మళ్లీ సీను మారింది. భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశమై ప్రస్తుతానికి శిబూసొరేన్‌ ప్రభుత్వాన్నే సమర్థించాలని నిర్ణయించింది. కాంగ్రెస్‌ను సమర్థించినందుకు క్షమాపణ కోరుతూ శిబూసొరేన్‌, భాజపా ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ హెమంత్‌ సొరేన్‌ రాసిన లేఖలపై చర్చించారు. జార్ఖండ్‌లో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం ఉందా ఉంటే భాజపా తరపున సీఎంగా ఎవరిని నియమించాలనే విషయంలో కూడా బోర్డు సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. గిరిజనుల తరపున మాజీ సీఎం అర్జున్‌ముండాను కొనసాగించాలని కొందరు, ఎంపీ, మాజీ విదేశాంగ మంత్రి యశ్వంత్‌సిన్హాను నియమించాలని కొందరు వాదించటంతో రెండురోజుల్లో మరోమారు సమావేశమై చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతవరకు శిబూసొరేన్‌ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. సీఎంగా భాజపా అభ్యర్థి, డిప్యుటీ సీఎంగా హేమంత్‌ సొరేన్‌ ఆధ్వర్యంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటుచేస్తారని కూడా ప్రచారంలో ఉంది.

డేరాసచ్చాసౌదా కార్యాలయంలో తొక్కిసలాట


ఐదుగురు మహిళల మృతి
చండీగఢ్‌: హర్యానాలోని సిర్సాలో ఉన్న డేరాసచ్చాసౌదా ప్రధాన కార్యాలయంలో తొక్కిసలాట జరగడంతో ఐదుగురు మహిళలు మృతిచెందారు. డేరా ఆవర్భావ దినోత్సవాల సందర్భంగా జరుగుతున్న ఉత్సవాల్లో ప్రసాదం పంపిణీ సందర్భంగా భక్తులు ఒక్కసారిగా ముందుకు రావడంతో తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.

‘జార్ఖండ్’పై భాజపా భేటీ


న్యూఢిల్లీ: జార్ఖండ్‌ రాజకీయాలపై చర్చించేందుకు భాజపా పార్లమెంటరీ బోర్డు కాసేపట్లో సమావేశంకానుంది. భాజపా నేతృత్వంలో ఏర్పడే ప్రభుత్వానికి తాము మద్దతు ఇస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శిబూసోరెన్‌ కుమారుడు హేమంత్‌సోరెన్‌ లేఖ రాయడంతో శిబూసోరెన్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణ అంశమై భాజపా పునరాలోచనలో పడింది. జార్ఖండ్‌ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించేందుకు పార్టీ అధినేత నితిన్‌గడ్కరీ అధ్యక్షతన పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో తల్లీ,కొడుకుల హత్య


అమ్రాబాద్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలంలోని వంకేశ్వరంలో తల్లీ కొడుకులు దారుణహత్యకు గురయ్యారు. మృతురాలు వంకేశ్వరం వసతిగృహంలో పనిచేస్తున్నారు.