యువతలో ఆత్మవిశ్వాసం: కరీంనగర్ కలెక్టర్


కరీంనగర్: యువత ధృడ సంకల్పం, ఆత్మవిశ్వాసంతో కృషి చేస్తె అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారని జిల్లా కలెక్టర్‌ జి.డి. అరుణ అన్నారు. సోమవారం స్థానిక స్వశక్తి కాలేజిలో డిఆర్‌ .డి.ఏ, ఐ.కె.పి. ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ అండ్‌ మార్కేటింగ్‌ మిషన్‌ ద్వారా సిరిసిల్ల టెక్స్‌ టైల్స్‌ జూకీ సేంటర్‌ లో శిక్షణ పొందిన విద్యార్థులతో కలెక్టర్‌ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసుకున్న 15 మంది విద్యార్థులకు హైదరాబాద్‌ లోని శశి ఎక్స్‌పర్టు కంపెనీలో ఉద్యొగవకాశాలు కల్పించినట్లు ఆమె తెలిపారు. పై#్రవేటు రంగంలో యువతకు విస్త్రత ఉద్యోగవశాలున్నాయని తెలిపారు. అందుకు అవసరమైన శిక్షణ, వృత్తి నైపుణ్యతను పెంపొందించుకోవాలని సూచించారు . ఆత్మ విశ్వాసంతో పనిచేస్తే ఉద్యోగాలలో రాణిస్తారని, అన్నారు. కుటుంబాలకు భారం కాకుండా ఉద్యోగాలలో చేరి తమ వంతు సహాయాన్ని వారికందించడం ఎంతో అభినందనీయమని అన్నారు. డి.ఆర్‌.డి.ఎ. పి.డి. రవీందర్‌ మాట్లాడుతూ మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చెందిన చదువుకున్న నిరుద్యోగ యువతి యువకులకు ఎంప్లాయిమెంటు జనరేషన్‌ అండ్‌ మార్కేటింగ్‌ మిషన్‌ ద్వారా ఉచిత శిక్షణఇచ్చి వివిధకంపెనీలలో ఉద్యోగవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. 2010-11వ సంవత్సరంలో మొదటి బ్యాచ్‌ లో ఏఫ్రిల్‌ 1నుండి మే 31 వరకు శిక్షణ పూర్తి చేసుకున్న 15 మంది హైదరాబాద్‌ లోని శశి ఎక్స్‌ ఫర్టు కంపెనీలో ఉద్యోగాలు కల్పించనట్లు తెలిపారు. వీరికి నెలకు 5,368 వేతనంతో పాటు ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయని తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి వెంటనే ఉద్యొగాలు లభించడం అభినందనీయమని అన్నారు. ఈ సమావేశంలో జె.డి.యం. జార్జి, ఎ.పి.యం.భార్గవ్‌ శిక్షకులు తిరుపతి, వేణు, స్వశక్తి కాలేజి ప్రిన్సిపాల్‌ శ్రీదేవి తదితరులు పాల్గోన్నారు.

Advertisements

టాటా సొంతవ్యాపారానికి వీసా


‘మమ్మల్ని, టాటా గ్రూప్‌ను వదిలిపెట్టి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు?’ తన ఎదురుగా ఉన్న వ్యక్తిని ప్రశ్నించారు టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ రతన్‌ టాటా. ‘నీకేం కావాలి, డబ్బు కావాలా, హోదా కావాలా, భత్యాల పెంపు కావాలా… దేని గురించి ఆలోచిస్తున్నావు… నీ నిర్ణయాన్ని మార్చుకోలేవా?’ అంటూ అడిగారు. అందుకు ఆ వ్యక్తి చెప్పిన సమాధానం ‘నేనిక సొంతంగా బతకదలి చాను’. ఈ సంఘటన జరిగింది 1994లో. ఇలా బదులిచ్చిన వ్యక్తి ఓ అసామాన్యుడు. ఆయనే నేటి వీసా గ్రూప్‌ ఛైర్మన్‌ విశ్వంభర్‌ శరణ్‌ (అగర్వాల్‌). అప్పట్లో ఆయన 1988 నుంచి కూడా టాటా స్టీల్‌ రా మెటీరియల్స్‌ డివిజన్‌ కు డైరెక్టర్‌గా ఉండేవారు. తాను స్వయంగా పారిశ్రామిక వేత్తగా మారాలనే బలమైన ఆకాంక్షతో ఆయన టాటా గ్రూప్‌ నుంచి బయటకు వచ్చేశారు.

ఆయన తీసుకున్న నిర్ణయం టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ మొదలుకొని కిందిస్థాయి వరకూ అందరినీ విస్మయ పర్చింది. కలవరపర్చింది. టాటా గ్రూప్‌నకు ఆయనచేసిన సేవలు అలాంటివి. పాతి కేళ్ళ పాటు సంస్థ ఉన్నతికి నిర్విరామంగా కృషి చేశారు. ముడిపదార్థాల సేకరణలో వ్యయాల తగ్గింపునకు ఎన్నెన్నో వినూత్న విధానాలను రూపొందించారు. వాటిని పటిష్ఠం గా అమలు చేశారు. 1969లో ఆయన టాటా ఐరన్‌ అండ్‌ స్టీల్‌ కంపెనీ (టిస్కో)లో చేరారు.

బనారస్‌ హిందూ యూని వర్సిటీ నుంచి మైనింగ్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేయగానే ఆయనకు ఈ ఉద్యోగం లభించింది. 1969-1994 మధ్య కాలంలో కంపెనీ క్యాప్టివ్‌ మైనింగ్‌, మినరల్‌ బెనిఫికేషన్‌ కార్యకలాపాల విస్తరణలో, యాంత్రికీకర ణలో ఆయన కీలక పాత్ర పోషించారు. సంస్థ గనుల వ్యాపారాన్ని ఎంతో లాభ దాయకంగా మార్చారు. ఒరిస్సాలో ప్రభుత్వరంగ సంస్థ ఫెర్రో అల్లాయ్‌ ప్లాంట్‌ను టాటా గ్రూప్‌ స్వాధీనం చేసు కోవడంలో ప్రధానపాత్ర నిర్వర్తించారు.

పారదీప్‌ ఓడరేవులో కార్యకలాపాలను మానవప్రమేయ రహితం చేయడంలో కూడా శరణ్‌ ప్రధానపాత్ర వహిం చారు. నాడు టాటా కంపెనీకి ముడి పదార్థాల దిగుమతు లు అక్కడికే ఎక్కువగా చేరేవి. ఈ మెకనైజేషన్‌ వల్ల టిస్కో గణనీయరీతిలో ఆదాలను పొందగలిగింది. ‘తన పనితీరు ఫలితంగా శరణ్‌ సంస్థలో ప్రతీచోటా ఎంతో గౌరవం పొందే వారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో తనపై విశ్వసనీయ తను పెంచుకోగలిగారు’ అని ఆయన మాజీ సహచరుడు, జెస్సాప్‌ ఇంజినీరింగ్‌, టాటా మార్టిన్‌ లాజి స్టిక్స్‌ ఇంటర్నేష నల్‌ (టీఎంఎల్‌ఐ) మాజీ ఎండీ ఎస్‌సీ సక్సేనా ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు.

కోల్‌కతాలో శరణ్‌ తన పొదుపు మొత్తం రూ. 10 లక్షలతో, ఓ చిన్ని కార్యాలయంతో సొంత వ్యాపారం ఆరం భించారు. టాటా స్టీల్‌ను వదిలేసి సొంతంగా వ్యాపారం చేయ లని తీసుకున్న నిర్ణయం సారన్‌ స్నేహి తులను, శ్రేయోభిలాషూలను, సహోద్యో గులను ఆశ్చర్యానికి గురి చేసింది. టాటా స్టీల్‌ ఛైర్మన్‌ రుస్సీ మోడీ లాంటి వారు మాత్రం సారన్‌ భవిష్యత్తులో గణనీయ విజయాలను సాధించగలరని ఆనాడే భావించారు.

టాటా స్టీల్‌ను వదిలేసిన తరువాత శరణ్‌కు కన్సల్టెన్సీ రూపంలో తొలి వ్యాపార అవకాశం లభించింది. జర్మనీ స్టీల్‌ కంపెనీకి ఆయన సలహాదారుగా వ్యవహరించారు. రెండేళ్ళ తరువాత సొంత వ్యాపార నిర్వ హణలో ఆయన మరింత రాటుదే లారు. మంచి అనుభవం, నైపుణ్యం సాధించా రు. క్లయింట్ల సంఖ్య పెరిగింది. దీంతో మైనింగ్‌ రిసోర్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కార్యాల యాలను స్విట్జర్లాండ్‌లో ఆరం భించారు. తదనంతర కాలంలో లండన్‌, సింగపూర్‌ లలో కూడా కార్యాలయాలను ప్రారంభించారు.

ఆరంభంలో కన్సల్టెన్సీ రూపం లో ఉన్న ఈ సంస్థ ముడిపదార్థాలు, వస్తువుల షిప్పింగ్‌, ట్రేడింగ్‌ కార్యకలాపాలను చురుగ్గా నిర్వహించడం ఆరం భించింది. థర్మల్‌ కోల్‌, కుకింగ్‌ కోల్‌, క్రోమ్‌ ఓం్‌, కాన్‌సన్‌ ట్రేట్స్‌, ఇనుము, మాంగనీసు లాంటి కర్బన ఉత్పాదన లతో పాటుగా, బాక్సైట్‌, అల్యూమినియం, ఫెర్రో అల్లా య్స్‌, పిగ్‌ ఐరన్‌, స్టీల్‌ లాంటి నాన్‌-ఫెర్రస్‌ మెటీ రియల్స్‌ లాంటి వాటి ఎగుమతి, దిగుమతి కార్యకలాపాలను నిర్వహించింది. ఆస్ట్రేలియా, చైనా, భారత్‌, ఇండోనేషి యా, దక్షిణాఫ్రికా లతో పాటుగా మధ్యప్రాచ్యం, యూరప్‌ దేశాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

విసా గ్రూప్‌నకు చెందిన వాణిజ్య అనుబంధ సంస్థ విసా కామ్‌ట్రేడ్‌ ముడి పదార్థాలు, ఉత్పాదనలు సేకరిం చడం, ఓడలను అద్దెకు తీసుకోవడం, బీమా, గిడ్డంగుల వసతులు సమకూర్చడం వంటి కార్యకలాపాలు నిర్వ హిస్తుంది. సాధారణ మధ్యవర్తిగా మరింత బాధ్యతా యుతమైన పాత్రనే ఇది నిర్వహిస్తుంది. బ్యాంక్‌లో లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ తీసుకున్న అనంతరం ఇది ఆయా ఉత్పాదనలను సేకరిస్తుంది. ఇలా చేయడం మా విశ్వసనీ యతను మరింత పెంచుతుంది అని అంటారు శరణ్‌. ‘కమాడిటీ అనేది మాకు డబ్బు సాధించే పెట్టే ఉపకరణం కాదు, అంతకు మించింది’ అని అంటారు ఆయన. సరైన ఉత్పాదనను ఏ ధరకు ఎప్పుడు కొనుగోలు చేయాలో తాము సూచిస్తామని తెలిపారు. తీవ్రపోటీ నెలకొన్న అంతర్జాతీయ మార్కెట్‌లో తమ ఖాతాదారులకు తాము విస్తృత ఉత్పాదనలను, తమ అనుభవాన్ని, నైపుణ్యాలను అందిస్తామన్నారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో గెంకోర్‌ ఇంటర్నేషనల్‌ ఏజీ, నోబుల్‌ గ్రూప్‌ సంస్థల నుంచి విసా గట్టి పోటీని ఎదుర్కొం టోంది. దేశీయంగా టాటా స్టీల్‌, జిందాల్‌ స్టీల్‌ ఈ సంస్థకు పోటీని ఇస్తున్నాయి. మేనేజ్‌మెంట్‌ స్టాఫ్‌ అనుసరించే అత్యున్నత స్థాయి ప్రొఫెషనలిజం ద్వారా వీసా గ్రూప్‌ మార్కెట్‌లో తన ఉనికిని నిలబెట్టుకోగలుగుతోంది. ఎప్పటికప్పుడు తాము కొత్త క్లయింట్లను పొందగలుగుతు న్నామని సక్సేనా తెలిపారు. ఈ గ్రూప్‌లో మొత్తం 1500 మంది దాకా పని చేస్తున్నారు. వీరిలో అత్యధికులు టెక్నా లజీ, బిజినెస్‌ నేపథ్యం గల వృత్తి నిపుణులే.

‘ఈ విధమైన నాలెడ్జ్‌ ఆ గ్రూప్‌ విస్తరణకు ఎంతో తోడ్ప డింది’ అని అంటారు మోర్గాన్‌ స్టాన్లీకి చెందిన వి.బన్సాల్‌. ఎదగాలన్న తపనతో ఉన్న ఈ గ్రూప్‌ స్టీల్‌, పవర్‌ రంగాలకు కూడా తన కార్యకలాపా లను విస్తరించింది. ఒరిస్సాలోని కళింగ నగర్‌ వద్ద 525 ఎకరాల్లో పాక్షికంగా ఓ స్టీల్‌ మిల్లును నెలకొల్పినట్లు విసా స్టీల్‌ కంపెనీ ఎండీ విశాల్‌ అగర్వాల్‌ తెలిపారు. ఇది రూ. 4,500 కోట్ల విలువైన ప్రాజెక్టు. చైనాకు చెందిన అతి పెద్ద ఉక్కు తయారీదారు అయిన బావో స్టీల్‌, విసా సంస్థల జాయింట్‌ వెంచర్‌ ఇది. ఇందులో విసా సంస్థ వాటా 35 శాతం. భారతదేశంలో బావో స్టీల్‌ మొదటి తయారీ వెంచర్‌ ఇది. అంతర్జాతీయంగా చూస్తే మూడోది. పిగ్‌ ఐరన్‌, కోక్‌ ఓవెన్‌, ఫెర్రో క్రోమ్‌, స్పాంజ్‌ ఐరన్‌, పవర్‌, స్టెయిన్‌స్టీల్‌ ప్లాంట్లు కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి.

తాను ఎన్నడూ స్వాప్నికుడిని కాదని, ఆచరణవాదినని అంటారు 62 ఏళ్ళ శరణ్‌. తమ సంస్థను మరింత ఉన్నతస్థాయికి చేర్చడమే ఇప్పుడు తమ ముందు ఉన్న సవాల్‌ అని అంటారు ఆయన.

వరంగల్‌లో శతరూపం ప్రదర్శన


వరంగల్: శతరూప కార్యక్రమాలలో భాగంగా జూన్‌ నెల 1 వ తేదీన మేదక్‌ జిల్లా కళాకారులు తమ ప్రదర్శనలను ఇవ్వనున్నారు. ఈ నెల 26 నుండి స్థానిక నేరేళ్ల వేణు మాధవ్‌ ప్రాంగణంలో జరుగుతున్న శతరూప కార్యక్రమాలలో మంగళవారం నాడు మేదక్‌కు చెందిన వివిధ కళారూపాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. వీటిలో భాగంగా మేదక్‌ జిల్లా, మం. సంగారెడ్డి పొల్లారెడ్డి గ్రామంనకు చెందిన డి.పూజ బృందంచే కూచిపూడి డ్యాన్స్‌, మం. సిద్దిపేట గ్రా. పొన్నాలనుండి పి. థనుజయ్య ఆధ్వర్యంలో గొండు న్యాటం, మం. సిద్దిపేట గ్రా.ఇమాంబాద్‌ కి చెందిన పి. దేవదాస్‌ చే ఫోక్‌ సాంగ్స్‌. మం. చిన్నకోడూర్‌ గ్రా. మందపల్లికి చెందిన పి. చంద్రమౌళి బృందంచే చిందు యక్షగానాలు ప్రేక్షకులను ఆహ్లద పరచనున్నాయి.

చిన్న మొత్తాల పొదుపులో లక్ష్య సాధన


వరంగల్: 2009-2010 సంవత్సరానికి చిన్న మొత్తాల పొదుపులో వరంగల్‌ జిల్లాకు రూ.350 కోట్లు లక్ష్యాంగా నిర్థేశించగా లక్ష్యాన్ని మించి 513 కోట్ల రూపాయలు పొదుపు చేయించడం జరిగిందని ప్రత్యేకతహసిల్థార్‌ ఎన్‌.ఎస్‌.ఎస్‌. హెచ్‌.కె. ఫహిం అహ్మద్‌ సిద్థిఖ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో 820 మంది ఎన్‌.ఎస్‌.ఎస్‌. ఎజెంట్లు పని చేస్తున్నట్లు అందులో ఎస్‌.ఎ.ఎస్‌. 315 మంది ఎంపికెబివై 488 మంది మరియు ఇపిఎఫ్‌ 15 మంది తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 14 వేల 92 కోట్ల రూపాయలను చిన్న మొత్తాల పొదుపు క్రింద చేయడం జరిగిందని ఆయన అన్నారు. గత 50 సంవత్సరాల నుండి చిన్న మొత్తాల పొదుపు శాఖ ప్రజలలో పొదుపు పట్ల అవగాహన కల్పించి వారిని పొదుపు చేయడానికి ప్రోత్సహించడమే కాకుండా రాష్ట్ర అభివృద్థి కార్యక్రమాల అమలుకు అవసరమైన వనరులను సంకూర్చుకొనుటకు కీలక పాత్ర నిర్వహిస్తుందని ఆయన అన్నారు. చిన్న మొత్తాల పొదుపుకు అమలులో ఉన్న పథకాలు 6 సంవత్సరాలు ఫోస్టుఆఫీసు నెలసరి ఆదాయ పథకం, 5 సంవత్సరాలు రికరింగ్‌ డిపాజిట్‌ ఖాతా, టైమ్‌ డిపాజిట్‌ పథకం,జాతీయ పోదుపు సర్టిఫికేట్స్‌, కిసాన్‌ వికాస్‌ పత్రం, 15 సంవత్సరాలు ప్రజా భవిష్యనిధి ఖాతా, 5 సంవత్సరాలు పెద్దల పొదుపు పథకం తదితర పథకాలు ఉన్నాయని ప్రజలు తమ సోమ్మును పై ఖాతాలలో పొదుపు చేసుకొనచో తమ కుటుంబ అభివృద్థికే కాక రాష్ట్ర అభివృద్థికి దాహదపడతారని విజ్ఞప్తి చేశారు.

‘గోలీమార్‌’‌తో ఘన స్వాగతం: రోజా


‘శంభో శివ శంభో’ చిత్రంతో రీ-ఎంట్రీ ఇచ్చిన నాకు ‘గోలీమార్‌’ చిత్రం ఘన స్వాగతం పలికింది. నేను ‘శంభోశివశంభో’ చిత్రంలో పవర్‌ఫుల్‌ పొలిటీషియన్‌గా చేసాను కాబట్టే.. ఈ చిత్రంలో ప్రియమణి మదర్‌ క్యారక్టర్‌కు నేనయితే బాగుంటుందని పూరి జగన్నాధ్‌కు అనిపించింది. అందుకే మా నిర్మాత బెల్లంకొండ సురేష్‌కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను’ అంటున్నారు ప్రముఖ నటి రోజా.

‘గోలీమార్‌’లో ప్రియమణి తల్లి క్యారక్టర్‌ అంటె తొలుత సందేహించాను. అయితే ఆ క్యారక్టర్‌లోని పవర్‌ గమనించాక ఆనందంగా అంగీకరించాను. నాకు పూరి దర్శకత్వం వహించిన ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ చిత్రంలో జయసుధగారు పోషించిన తల్లి పాత్ర అంటె నాకు చాలా ఇష్టం. ఆ చిత్రంలో ఆమె కూడా ఓ హీరో అనే చెప్పాలి. అలాగే.. ‘గోలీమార్’లో నా పాత్ర కూడా చాలా పర్పస్‌ఫుల్‌ పాత్ర. నేను ‘గోలీమార్‌’లో చేసిన పాత్రల్లాంటివి నిజ జీవితంలో చాలా తారసపడు తుంటాయి. మగాళ్ల చేతిలో ఘోరంగా మోసపోయిన మహిళల గాధలు ఓ రాజకీయ నాయకురాలిగా నాకు ఎన్నో తెలుసు. అందుకే ఈ క్యారక్టర్‌ అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఇక నా రీఎంట్రీలో నా పాత్రలకు నేనే డబ్బింగ్‌ చెప్పుకోవడం కూడా నాకు చాలా ఆనందాన్నిస్తోంది.

‘శంభో..’లో కూడా నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పినప్పటికీ.. ఆ పాత్ర నిడివి చాలా చిన్నది కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే గోలీమార్‌’లో నా పాత్ర పరిధి పెద్దది కాబట్టి నా అభినయానికే కాకుండా, నా వాయిస్‌కు కూడా మంచి స్పందన వస్తోంది. ఇందులో గోపీచంద్‌, ప్రియమణిల నటన కూడా వ్యక్తిగతంగా నాకు చాలా నచ్చింది’ అంటూ తాను ముఖ్యపాత్ర పోషించిన ‘గోలీమార్‌’ సాధిస్తున్న ఘన విజయంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు రోజా!

ముఖ్యమంత్రికి సమర్పించిన వినతులు


అనంతపురం: జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్రముఖ్యమంత్రి కె .రోశయ్యకు స్థానిక పోలీసు గెస్టు హౌస్‌ లో సోమవారం మధ్యాహ్నం పలువురు కలిసి వినతి పత్రాలు సమర్పించారు . 1. జిల్లాలో శ్రీకృష్ణదేవరాయాల పంచశతాబ్ది ఉత్సవాలను వెంటనే నిర్వహించాలని, 2009-10 సంవత్సరానికి రైతులకు భీమా వెంటనే ఇవ్వాలని, పెనుకొండ కాళేశ్వరస్వామి ఆక్రమించిన దేవదాయ స్థలాలపై విచారణ చేసి చర్యలు గైకొనాలని బి జె పి జిల్లా అధ్యక్షులు ఎస్‌ .విష్ణువర్థనరెడ్డి, జనరల్‌ సెక్రటరీలు లలిత్‌ కుమార్‌ , అంకాల్‌ రెడ్డి ఆపార్టీ మైనార్టీ మోర్చా అధ్యక్షులు ఫయాజ్‌ భాష , మహిళా మోర్చా ఆదిలక్ష్మమ్మలు సి ఎం ను కలిసి విజ్ఞప్తి చేసి వినతి పత్రం అందజేశారు. జిల్లాలో మద్యం టెండర్లను వెంటనే ఆపి కఠిన మద్య నియంత్రణను అమలు చేయాలని లోక్‌ సత్తా పార్టీకి చెందిన నాగరాజు , మధు, నిజాంలు సిఎంను కోరారు. తక్షణమే ఈ పార్లమెంట్‌ సమావేశాలలో ఎస్‌ సిల వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదించేలా కృషి చేయాలని ఎం ఆర్‌ పి ఎస్‌ – కె ఎస్‌ బాబు వర్గానికి చెందిన జిల్లా గౌరవ అధ్యక్షులు కె ఓబిలేసు, అధికార ప్రతినిధి అక్కులప్ప , కార్యదర్శి తిమ్మరాజులు, సి ఎంకు విన్నవించారు . 4. ప్రభుత్వ ఉత్తర్వులు 28 ను పాటించకపోవడం వలన 2008 డి ఎస్‌ సి నియామాకాలు ఆగిపోయే ప్రమాదం వున్నదని, వెంటనే జి ఓ 28 ఉత్తర్వులను అమలుపరచి డి ఎస్‌ సి 2008 వారికి ఉద్యోగాలు కల్పించాలని 2008 డి ఎస్‌ సి – ఎస్‌ జిటి నియమాకాల సాధన కమిటీ జిల్లా అధ్యక్షులు వెంగమనాయుడు, ఉపాధ్యక్షులు ఓబిరెడ్డి, శివరామక్రిష్టలు , సిఎంకు విజ్ఞప్తి చేశారు . 5. స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేస్తున్న 208 మంది కాంట్రాక్ట్‌ మెంబర్స్ను 8 నెలలుగా జీతాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని , వెంటనే వారందరికి జీతాలు మంజూరు చేయాలని జిల్లా మెడికల్‌ ,హస్పిటల్‌ ఎంప్లాయిస్‌ వెల్పేర్‌ఒ ,సొసైటీ అధ్యక్షురాలు వై . విమలమ్మ సిఎం ను కోరారు . సమస్యలన్నింటిపై పరిశీలించి తగు చర్యలు గైకొంటామనిసిఎంతెలిపారు.

ముఖ్యమంత్రికి సమర్పించిన వినతులు


అనంతపురం: జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్రముఖ్యమంత్రి కె .రోశయ్యకు స్థానిక పోలీసు గెస్టు హౌస్‌ లో సోమవారం మధ్యాహ్నం పలువురు కలిసి వినతి పత్రాలు సమర్పించారు . 1. జిల్లాలో శ్రీకృష్ణదేవరాయాల పంచశతాబ్ది ఉత్సవాలను వెంటనే నిర్వహించాలని, 2009-10 సంవత్సరానికి రైతులకు భీమా వెంటనే ఇవ్వాలని, పెనుకొండ కాళేశ్వరస్వామి ఆక్రమించిన దేవదాయ స్థలాలపై విచారణ చేసి చర్యలు గైకొనాలని బి జె పి జిల్లా అధ్యక్షులు ఎస్‌ .విష్ణువర్థనరెడ్డి, జనరల్‌ సెక్రటరీలు లలిత్‌ కుమార్‌ , అంకాల్‌ రెడ్డి ఆపార్టీ మైనార్టీ మోర్చా అధ్యక్షులు ఫయాజ్‌ భాష , మహిళా మోర్చా ఆదిలక్ష్మమ్మలు సి ఎం ను కలిసి విజ్ఞప్తి చేసి వినతి పత్రం అందజేశారు. జిల్లాలో మద్యం టెండర్లను వెంటనే ఆపి కఠిన మద్య నియంత్రణను అమలు చేయాలని లోక్‌ సత్తా పార్టీకి చెందిన నాగరాజు , మధు, నిజాంలు సిఎంను కోరారు. తక్షణమే ఈ పార్లమెంట్‌ సమావేశాలలో ఎస్‌ సిల వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదించేలా కృషి చేయాలని ఎం ఆర్‌ పి ఎస్‌ – కె ఎస్‌ బాబు వర్గానికి చెందిన జిల్లా గౌరవ అధ్యక్షులు కె ఓబిలేసు, అధికార ప్రతినిధి అక్కులప్ప , కార్యదర్శి తిమ్మరాజులు, సి ఎంకు విన్నవించారు . 4. ప్రభుత్వ ఉత్తర్వులు 28 ను పాటించకపోవడం వలన 2008 డి ఎస్‌ సి నియామాకాలు ఆగిపోయే ప్రమాదం వున్నదని, వెంటనే జి ఓ 28 ఉత్తర్వులను అమలుపరచి డి ఎస్‌ సి 2008 వారికి ఉద్యోగాలు కల్పించాలని 2008 డి ఎస్‌ సి – ఎస్‌ జిటి నియమాకాల సాధన కమిటీ జిల్లా అధ్యక్షులు వెంగమనాయుడు, ఉపాధ్యక్షులు ఓబిరెడ్డి, శివరామక్రిష్టలు , సిఎంకు విజ్ఞప్తి చేశారు . 5. స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేస్తున్న 208 మంది కాంట్రాక్ట్‌ మెంబర్స్ను 8 నెలలుగా జీతాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని , వెంటనే వారందరికి జీతాలు మంజూరు చేయాలని జిల్లా మెడికల్‌ ,హస్పిటల్‌ ఎంప్లాయిస్‌ వెల్పేర్‌ఒ ,సొసైటీ అధ్యక్షురాలు వై . విమలమ్మ సిఎం ను కోరారు . సమస్యలన్నింటిపై పరిశీలించి తగు చర్యలు గైకొంటామనిసిఎంతెలిపారు.