ఎస్‌కే యూనివర్సిటీలో ఉద్రిక్తత : లాఠీచార్జి


అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సమైక్యాంధ్రకు మద్దతుగా చేపడుతున్న ఆందోళనను అడుకునేందుకు అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులపై రాళ్లతో దాడికి దిగారు. దీంతో ఉద్రిక్తంగా మారడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ దాడిలో పోలీసులతోపాటు, కొందరు మీడియా సిబ్బంది కూడా గాయపడ్డారు.

Advertisements

భారీగా ప్రభుత్వ పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం


హైదరాబాదు: పంచాయతీరాజ్‌ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ మేరకు 1532 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి గీతారెడ్డి వెల్లడించారు. అలాగే 52 ప్రభుత్వ జూనియర్‌ కాళాశాలల్లో ప్రిన్సిపల్స్‌ నియామకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపినట్లు ఆమె వివరించారు. నల్గొండలోని మహాత్మగాంధీ యూనివర్సిటీలో 109 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నలిచ్చిందని గీతారెడ్డి ప్రకటించారు.

ఎస్‌కే యూనివర్సిటీలో ఉద్రిక్తత : లాఠీచార్జి


అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సమైక్యాంధ్రకు మద్దతుగా చేపడుతున్న ఆందోళనను అడుకునేందుకు అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులపై రాళ్లతో దాడికి దిగారు. దీంతో ఉద్రిక్తంగా మారడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ దాడిలో పోలీసులతోపాటు, కొందరు మీడియా సిబ్బంది కూడా గాయపడ్డారు.

పొట్టి శ్రీరాములుకు ఘనంగా నివాళులర్పించిన సీఎం


హైదరాబాద్‌: అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా సచివాలయం వద్ద ఆయన విగ్రహానికి మంగళవారం ముఖ్యమంత్రి రోశయ్య పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్ర ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు కృషిని సీఎం కొనియాడారు. నివాళులు అర్పించినవారిలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు.

సచివాలయంలో సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళన


హైదరాబాద్‌: శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో విద్యార్థులపై లాఠీచార్జిని నిరసిస్తూ సీమాంధ్రకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు సచివాలయంలోని సీ-బ్లాక్‌ ఎదుట బైఠాయించారు. సమై్యకాంధ్ర కోసం విద్యార్థులు శాంతియుతంగా ఉద్యమాన్ని చేపడుతున్నారని, ఈ ఉద్యమాన్ని అణగదొక్కేందుకే ఆంధ్రా, ఎస్‌కే యూనివర్సిటీల్లో పోలీసుల బలగాలను మోహరించారని వెంటనే పోలీసు బలగాలను వెనక్కి రప్పించాలని ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.

వివేకానందరెడ్డి కడప తరలింపు


హైదరాబాద్‌: సచివాలయం వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహం ఎదుట దీక్ష చేపట్టిన ఎమ్మెల్సీ వైఎస్‌ వివేకానందరెడ్డిని మంగళవారం అదుపులోకి తీసుకున్న పోలీసులు కడపకు తరలించారు. వివేకానందరెడ్డిని తొలుత గోషామహల్‌ స్టేడియంకు తరలించారు. అయితే ఉద్రిక్తతలు తలెత్తేప్రమాదముండటంతో కడప తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

నేను సమైక్యవాదిని : వైఎస్‌ జగన్‌


హైదరాబాదు: సమైక్యాంధ్రకే తాను కట్టుబడి ఉన్నట్లు కడప ఎంపీ వైఎస్‌ జగన్‌ స్ఫష్టం చేశారు. గత కొద్ది రోజులుగా ఆంధ్ర, సీమ ప్రాంతాల్లో సమైక్య జ్వాలలు చలరేగుతున్న నేపథ్యంలో మౌనం వహించిన జగన్‌ ఎట్టకేలకు నోరు విప్పారు. ప్రత్యేక తెలంగాణ, ఆంద్ర, రాయలసీమ రాష్ట్రాల ఏర్పాటుకు తాను వ్యతిరేకినని, అందరూ కలిసి ఉండటమే తన అభిమతమని జగన్‌ వెల్లడించారు. అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేకించిన వారిపై చర్యలు తీసుకోవాలని జగన్‌ సూచించారు. ఈ సమస్య ఇంతగా జటిలమవ్వడానికి తెలుగుదేశం పార్టీయే కారణమని జగన్‌ ఆరోపించారు. చంద్రబాబు రెండు నాల్కల ధోరణితో మాట్లాడుతున్నారని జగన్‌ విమర్శించారు. అందరూ అనుకుంటున్నట్లుగా తాను టీడీపీ ఎంపీలకు సంఘీభావం తెలపలేదని జగన్‌ అన్నారు. సువర్ణ తెలంగాణగా అభివృద్ధి చెందాలని తాను కోరుకుంటున్నట్లు జగన్‌ తెలిపారు.