రామప్ప దేవాలయంలో అసాంఘిక కార్యకలాపాలు


వరంగల్: వరంగల్ జిల్లాలోని రామప్ప దేవాలయం పరిసర ప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలకు వేదిక అవుతున్నాయి. భక్తుల కోసం నిర్మించిన గెస్ట్ హౌజ్‌లు పాడు పడిపోగా, అక్కడ వుండే పచ్చని చెట్లు ప్రేమికుల సరస సలాపాలకు నెలవవుతున్నాయి. పదుల సంఖ్యలో ప్రేమ జంటలు అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. వెంకటాపురం మండలం పాలెంపేటలో కాకతీయులు నిర్మించిన దేవాలయాల్ని దర్శించేందుకు వచ్చే భక్తులు ప్రేమికుల విచ్చలవిడితనాన్ని చూసి శివ…శివ ఇదేం ఖర్మరా బాబో అని మండిపడతున్నారు. చెరువులో ప్రేమ జంటలు నగ్నంగా స్నానాలు చేయటం ద్వారా రామప్ప ప్రాశస్త్యాన్ని దెబ్బతీస్తున్నారని భక్తులతో సహా స్థానిక గిరిజన సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రంపచోడవరం వద్ద ట్రాక్టర్‌ బోల్తా : ఇద్దరు మృతి


రాజమండ్రి : రంపచోడవరం బాపనమ్మ గుడి వద్ద ట్రాక్టర్‌ బోల్తా పడింది. ఈప్రమాదంలో ఇద్దరు మరణించారు. 10 మందికి గాయాలయ్యాయి.

కన్యాకుమారిలో టీటీడీ పాలకమండలి సమావేశం


కన్యకుమారి : తమిళనాడులో కన్యాకుమారిలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశమయింది. మండలి సభ్యులు ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 201011 వార్షిక బడ్జెట్‌ రూ. 1338 కోట్లుగా ప్రతిపాధించారు. ఇంజనీరింగ్‌ శాఖకు 35 శాతం నిధులు మంజూరు చేశారు. ధర్మ ప్రచార పరిషత్‌కు రూ. 35 కోట్లు, లతా మంగేష్కర్‌ ఆడియో సీడీ రూ. 100లకు తగ్గింపు, ఆస్థాన గాయకురాలిగా లతామంగేష్కర్‌, ఆస్థాన విద్వాంసుడిగా శోభరాజ్‌ను నియమిస్తూ టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. లడ్డూ పేటెంట్‌ సాధించాలని నిర్ణయించారు. శీఘ్రదర్శనంతో రూ. 100 ఆదాయం వస్తుందని పాలకమండలి అంచనా వేసింది. రెండవ ఘాట్‌ రోడ్డు మరమ్మతు పనులకు రూ. 3 కోట్ల 60 లక్షల రూపాయలు కేటాయించింది. ఎమ్మెల్యే చిరంజీవికి మహాద్వాప్రవేశం కల్పించాలని తీర్మానించారు.

టీడీపీ బృందంపై కాంగ్రెస్‌ కార్యకర్తల దాడి


ప్రకాశం : వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో టీడీపీ నిజ నిర్ధారణ బృందంపై కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడికి దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రక్షణ కల్పించలేమని పోలీసులు చేతులెత్తేశారు. దాడి చేసినవారు స్థానిక ఎమ్మెల్యే అనుచరులని టీడీపీ ఆరోపించింది. కావాలనే ఓ ప్రణాళిక ప్రకారమే ఈ దాడి జరిగిందని, ఈ విషయం పోలీసులకు కూడా ముందే తెలుసని, అందుకే రక్షణ పోలీసులు చేతులెత్తేశారని తెలుగు దేశం పార్టీ అంటోంది.

ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేది మంత్రి బొత్స కాదు : రఘువీరా


హైదరాబాద్‌ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చేది మంత్రి బొత్స సత్యనారాయణ కాదని మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనకు కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ చేతుల్లో ఉందని ఆయన అన్నారు. కాగా తెలంగాణపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలను ఎంపీ పొన్నం ప్రభాకర్‌ సమర్థించించారు. టీడీపీ సీమాంధ్ర నేతలు బొత్త చేతిలోనే ఉందని ఆన్నారు.

మంత్రి బొత్స వ్యాఖ్యలు తప్పుకాదు : వీహెచ్‌


హైదరాబాద్‌ : గత ఎన్నికల మ్యానిఫెస్టోలో తెలంగాణ ప్రస్తాపన తెచ్చిన చంద్రబాబు ఇప్పుడు వెన్నుపోటు పొడిచారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంతరావు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లడుతూ తెలంగాణపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తప్పుకాదని ఆయన అన్నారు. తెలంగాణపై బాబు మాట్లాడితే న్యాయం.. మంత్రి బొత్స మాట్లాడితే అన్యాయం ఎట్లవుతుందని వీహెచ్‌ ప్రశ్నించారు. వచ్చే ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ తర్వాతే పరిస్థితులను బట్టి పోటీపై ఆలోచిస్తామని వీహెచ్‌ చెప్పారు.

యువత రాజకీయాల్లో భాగస్వాములు కావాలి:జేపీ


హైదరాబాద్‌ : దేశంలో మార్పు తేవాలరటే ముఖ్యమంగా యువత రాజకీయాల్లో భాగస్వాములు కావాలని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌నారాయణ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాలను మార్చుకోవాలన్న కోరిక ప్రజల్లో బలంగా ఉన్నా అది తమ పని కాదన్నట్టు వ్యవహరిస్తున్నారని జేపీ అన్నారు.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో గ్రామపంచాయతికి నిప్పు


మహబూబ్‌నగర్‌ : జిల్లాలోని బిజినేపల్లి మండలం పాలేం గ్రామ పంచాయతికి గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం ఉదయం నిప్పంటించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు.

ప్రారంభమైన తెలంగాణ ప్రాంత టీడీపీ నేతల భేటీ


హైదరాబాద్‌ : తెలంగాణ ప్రాంత టీడీపీ ప్రజాప్రతినిధుల సమావేశం ఈ రోజు అసెంబ్లీహాల్‌లోని టీడీఎల్‌పీ కార్యాలయంలో ప్రారంభమయింది. కేంద్రహోంశాఖ ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీకి సమర్పించవలసిన నివేదికపై వారు ఈ సమావేశంలో చర్చిస్తునట్లు సమాచారం.

ఫ్లై ఓవర్‌కు మహాత్మగాంధీ పేరు పెట్టాలి:బీజేపీ


హైదరాబాద్‌ : లంగర్‌హౌస్‌ ఫైఓవర్‌కు మహాత్మగాంధీ పేరు పెట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్‌ చేసింది. ఆ పార్టీ నాయకులు బద్ధం బాల్‌రెడ్డి, బంగారు ప్రసాద్‌లు ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి రోశయ్యకు వినతిపత్రం అందజేసేందుకు వెళ్లగా వారిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.