ఆత్మగౌరవ యుద్ధ కవిత కందిలి


(గుర్రం సీతారాములు)

“మహా కవుల మరణ యుద్ధ కవిత” పేరుతో మార్చి 2 వార్త ఆదివారం అనుబంధంలో
“దళిత కవులు ఇంకా బ్రతికే ఉన్నా దళిత కవిత్వం మాత్రం మరణించిందని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదని ‘కందిలి’ లాంటి కవితా సంకలనాలు రుజువు పరుస్తాయి” అన్న తీవ్రమైన వ్యాఖ్యలకు సమాధానం ఇది.

గత రెండు దశాబ్దాలుగా సమకాలీన సాహిత్య వాద వివాదాలను సమీక్ష, విమర్శకుల అభిప్రాయాలను శ్రద్ధగా గమనిస్తున్న నా పరిమిత జ్ఞానంతో ఇది రాస్తున్నాను. ఇంతగా స్పందించడానికి కారణం “ సాహిత్య విమర్శకులకు అంత్యక్రియలు నిర్వహించండ”ని అన్న సీతారాం కొందరు దళిత సాహితీ విమర్శకుల బాధ్యతారాహిత్యం వల్లనే దళిత కవిత్వం మరణించిందనీ కొందరి అసమర్థత వల్లనే అది అత్యంత అవమానకర రీతిలో దారి తప్పిందనీ అన్నారు.

ఈ సందర్భంగా దళిత సాహిత్యం పట్ల, కవుల పట్ల సాహిత్య అకాడమీల నిర్లిప్తత గూర్చి ఓ గుజరాతీ దళిత కవి ఆక్రోశాన్ని కొంచెం కటువుగా ఉన్నా చర్చించుకోవడం అవసరం అనిపిస్తోంది.

“ భాష అనే లంజముండ సాహిత్య అకాడమీ వేశ్యావాకిళ్ల ముందు తచ్చాడుతున్న కొజ్జాల వంక కృద్దంగా చూస్తోంది” అన్నాడు.
నేడు అస్థిత్వ కులాల సాహిత్యం కూడా నోరున్న, పేరున్న సాహిత్య విమర్శకుల, సమీక్షకుల ముందు అణిగిమణిగి వుంటోంది.
వర్తమానాన్ని గమనించినట్లయితే సంఘంలో అకవులు, కుకవులు, పైగంబర, దిగంబర, పోస్ట్‌మోడ్రన్‌ వగైరా..వగైరా వెనకబడిన కులాల కవులుగా చీలికలు, పేలికలుగా మారిన కవిత్వ కూటాలను “కందిలి” కవులు మరింతగా దిగజార్చారని సీతారాం ఆవేదన చెందుతున్నాడు.
పైగా దళిత కవులలో ఒక సంక్షోభం ఏర్పడిందనీ, దాన్ని అధిగమించకపోగా జటిలమైన వర్గీకరణ రాజకీయాల వైపు దళిత సాహిత్య ప్రస్థానం చెందిందనీ ఆక్షేపించారు. మరియు లక్ష్మీనర్సయ్య, సతీష్‌ చందర్‌, కె.శ్రీనివాస్‌, అసుర లాంటి విమర్శకుల మౌనం దళిత కవిత్వాభిమన్యుడుకి పద్మవ్యూహంగా మారిందనీ, కొంతమంది కవులు ఉన్న కొద్దిపాటి రక్తాన్ని ఊరికే మరిగించుకొని అలసిపోతున్నారని అన్నారు..
ఈ సందర్భంగా దశాబ్ధం క్రితం వెలువడ్డ బిసి కవుల “వెంటాడే కలాలు” పుస్తకానికి రాసిన ముందుమాటను గుర్తుకుతెచ్చుకోమని సీతారాంను కోరుతున్నాను.

అందులో ఇంతకాలం దళిత కవిత్వం మాలమాదిగ కవులు హైజాక్‌ చేశారనీ, దళిత సాహిత్యం అంటే ఆ రెండు కులాలు మాత్రమే కాదనీ దాన్ని పరిపుష్ఠం చేసింది, అధికంగా చెమట కార్చింది మంగళ్ళు, చాకళ్ళు లాంటి వెనకబడిన కులాలేననీ “బిసి కవిత్వం” పేరుతో ఓ చర్చను లేపడంలో పైన ఉదహరించిన వారిలో కొందరూ, మరియు జూలూరి గౌరీశంకర్‌, ప్రసేన్‌తో మరికొందరూ ఉన్న విషయం ఈ అష్టాది కవుల సమన్వయంతో కొత్త శిశువుకి జీవం పోసిన వీరు దేశీయ మార్కిజం పేరుతో స్వదేశీ మార్క్సిజాన్ని వెలుగులోకి తెచ్చి ఎవరినోట్లో ఏమేం పోశారో సాహిత్య లోకం మర్చిపోలేదు.

దళిత కవిత్వం వారి, అస్తిత్వ చైతన్యం, ఆగ్రహం గత కొంత కాలంగా మనువు నోట్లో పోసిన ఉచ్చనే మళ్ళీ మళ్ళీ పోయడం మరో విధంగా ఉచ్చపోయకపోవడాన్ని తప్పు పట్టిన సీతారాం మరెలా పోయాలో నేర్పిస్తే బాగుంటుందేమో! కవిత్వానికి కావాల్సిన ఒడ్డు, పొడవు, నడుము కొలతలు,సాంధ్రత, గాఢత, విస్తృతిలాంటి కొన్ని కొలిచే పనిముట్లను నిర్దేశించిన సీతారాం అర్థంపర్ధం లేని పోస్ట్‌మోడ్రన్‌ కవిత్వాన్ని ప్రమోట్‌ చేసి, తాళాలు మాత్రం నా దగ్గర ఉన్నాయి అని ఎలా అనగలిగారు? ఆయన అన్నట్లు కందిలి కవితా సంకలనంలో కవిత్వం లేకపోయినా ఇది గొప్ప ప్రయత్నం, ఈ ప్రయత్నం వెనుక అంతులేని ఆవేదన ఉంది. ఆ ఆవేదన వెనక వేల సంవత్సరాల దాష్టీకం ఉంది. బ్రాహ్మణ వాద గుట్టును నిట్టనిలువుగా చీల్చే ప్రయత్నమే ఇది. ఇది ఓ అంటరానివాని ఆక్రందన, తన పుట్టుకను దుర్మార్గంగా చిత్రించినందుకు చరిత్రలో జరిగిన ద్రోహానికి కారణాల వెతుకులాట, సామాజిక ఉద్యమాల చైతన్యంతో వచ్చిన స్ఫూర్తితో జరిగిన ఈ ప్రయత్నం హర్షించదగినది. ఆహ్వానించదగినది.

వర్గీకరణ రాజకీయాలు తెచ్చిన చైతన్యంతో వచ్చిన బలమైన కవిత ఎండ్లూరి సుధాకర్‌ “వర్గీకరణీయం” అంతకుముందు వచ్చిన నాగప్పగారి సుందర్రాజు రచనలు, మల్లెమొగ్గల గొడుగు, ఎదురుచూపులు కథా సంకలనం గోగు శ్యామల, సుభద్రల నల్లరేగడిచాళ్లు, పరిమళ్ , వేముల ఎల్లయ్య జిలుకర శ్రీనివాస్‌, డా. దార్ల, ప్రొ.డివి కృష్ణ, కదిరె కృష్ణ, ఐనాల సైదులులాంటి బలమైన సాహితీ విమర్శకుల, కవుల కవిత్వాన్ని మనసు పెట్టి చదవమని కోరుతున్నాను. ఇటీవల సెంట్రల్‌ యూనివర్శిటీలో మాదిగ, మాదిగ ఉపకులాల కవుల రాష్ట్ర స్థాయి సదస్సులో జరిగిన చారిత్రక విషయాలను తెలుసుకోమని చెప్తున్నాను. కందిలి కవిత్వం రాజకీయ నినాదమై తేలిపోయిందని విశ్వవిద్యాలయంలో పరిశోధన చేయడానికి “కందిలి కవిత్వం-ఒక పరిశీలన” అనే అంశానికి బాగా పనికొచ్చే పుస్తకం అని ఎద్దేవా చేయడం యూనివర్శిటీలో అధ్యాపక వృత్తిలో ఉన్న సీతారాం ఈ రకమైన వ్యాఖ్య చేయడం ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది.

ఆయనే అన్నట్లు కందిలి కవిత్వం వెనుక ఉన్న జీవితం పెద్దది ఆ సంస్కృతి మరి ఏ ఇతర సంస్కృతి కన్నా తక్కువది కాదు, ఎందుకంటే మానవ జీవితానికి ఉన్న అనేక విలువల స్ఫూర్తి మాదిగ కులానికి ఉంది. అద్వితీయమైన అనుభవసారం ఉంది. సమాజానికి శ్రమ సంస్కృతినీ, శాస్త్రీయమైన చర్మ శుద్ధినీ, ఆది మానవ దశలోనే సంస్కృతికి డప్పును అందించిన గొప్ప చారిత్రక నేపథ్యం ఉన్న మాదిగ కులం వ్యవస్థకు పట్టిన మలినాన్ని శుద్ధిచేసి పరిశుభ్రతను ప్రసాదించిన మహోన్నత వారసత్వం మాది. ఆది జాంబవ వారసులైన మాదిగలం మేము ఈ సమాజం మాదిగీకరణ చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందని గట్టిగా చెప్తున్నాం.

నేను ఎండలో ఎండుతున్న ఎండు మాంసాల హారాన్ని. కాల్పనిక సింహద్వారాల మీద ఎగరేసిన గెలుపు జెండాని, ఆ గెలుపు జెండా ఎగరేసే రోజు ఎంతో దూరంలో లేదు.

Advertisements

కుందేలు పెంపకం


ప్రయోజనాలు

• హెచ్చు పునరుత్పత్తి రేటు – ఏడాదికి 4 సార్లు(గర్భధారణ సమయం 30-32 రోజులు) మాత్రమే.
• హెచ్చు దాణా మార్పిడి నిష్పత్తి. వంటింటి ఉద్యానవనాలనించి మార్కెట్కు సులభంగా చేరవేయవచ్చు.
• తక్కువ స్థాయి కొలెస్ట్రాల్ గల మాంసం
• కుందేలు బొచ్చు(ఉన్ని)కు మంచి మార్కెట్ ధర ఉంది.

జాతులు
ప్రసిద్ధమైన జాతులివి :
• అంగోరా – మాంసం కన్నా  బొచ్చుకే(ఉన్ని) ప్రాధాన్యత
• న్యూజిలాండ్ వైట్ – మాంసం,  బొచ్చు(ఉన్ని)
• గ్రే జైంట్ – మాంసం,  బొచ్చు(ఉన్ని)
• వైట్ జైంట్ – మాంసం
• సోవియట్ ఛిన్ఛిల్లా – మాంసం,  బొచ్చు(ఉన్ని)
• డచ్ – మాంసం
• బ్లాక్ బ్రౌన్ – మాంసం,  బొచ్చు(ఉన్ని)

కుందేళ్ల నివాసం / పెంపకానికి షెడ్లు

• ఉష్ణోగ్రత    150 సె నుంచి 400 సె ల మధ్య ఉండాలి, తేమ శాతం   55%  నుంచి 65%  ఉండాలి

• కొండ ప్రాంతాలు – అంగోరా, మాంసం జాతి కుందేళ్లు
• సాధారణ ప్రాంతాలు – మాంసం జాతి కుందేళ్లు మాత్రమే పెంచాలి
• బోను వ్యవస్థ – ఒకటి లేదా రెండు అంతస్థుల వ్యవస్థలు
• ఒక అంతస్థు వ్యవస్థ  –  బోనులను చెక్క లేదా లోహపు స్టాండులపై ఉంచాలి.
• రెండు అంతస్థుల వ్యవస్థలు –  సింగిల్ ర్యాక్లలో రెండు బోనులమధ్య ట్రేలనుంచాలి.

మిగిలిన ఫారం జంతువులను చేసినట్లే, కుందేళ్లను కేవలం మెడ పట్టే ఎత్తాలి కానీ వాటి చెవులతో ఎత్తరాదు. వాటిని మోసేటపుడు వాటి అడుగునుంచి  సపోర్టుండాలి.
• మంచి జాతుల లభ్యత కోసం
• కుందేళ్ల షెడ్ల ఏర్పాటు గురించిన వివరాల కోసం
• కుందేళ్ల తిండి వివరాల కోసం
• ఆరోగ్యకరమైన కుందేళ్ల ఉత్పత్తి కోసం

మరిన్ని వివరాలు కావాలంటే,  అతి దగ్గరలో ఉన్న  వెటర్నరీ ఆరోగ్య కేంద్రాలను గానీ, వ్యవసాయ శాఖను గానీ సంప్రదించాలి.

భారత్లో బర్డ్‌ఫ్లూ!


మనుష్యుల్లాగే పక్షులకూ  ఫ్లూ వస్తుంది. దీన్నే ఏవియన్ ఫ్లూ, ఏవియన్ ఇన్ఫ్లుఎంజా అనీ అంటారు.  ఐ5కే1అనే వైరస్ పక్షులకు, కోళ్లకూ బాతులకూ కూడా సోకుతుంది. పక్షులకు సోకే సాధారణ వైరస్లు కేవలం ఇతర పక్షులకు మాత్రమే సోకుతాయి. ఐతే, ఈ బర్డ్ఫ్లూ మాత్రం పక్షులనుంచి మనుష్యులకు సోకే ప్రమాదం ఉంది. అలాటి ఒక మనిషికి ఐ5కే1 వైరస్ సోకిన కేసు 1997లో తొలిసారిగా హాంగ్కాంగ్లో బైట పడింది. ఆ తర్వాత ఈ వైరస్ ఆసియా, ఆఫ్రికా, యూరప్ దేశాలలోని పక్షులకి నెమ్మదిగా వ్యాపించింది. ఆసియాలో 2003లో ఐ5కే1 వైరస్ సోకినప్పటినుంచి, దీని వల్ల ఇప్పటిదాకా 234 మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

ప్రాణాంతకమైన ఈ వైరస్ ఇండియాలో మొన్న జనవరి 2008 ప్రాంతంలో సోకింది. ఫలితంగా, మనుష్యులకు సోకుతుందన్న భయంతో దాదాపు 3.9 మిలియన్ల కోళ్లనూ, బాతులనూ అంతం చేయాల్సి వచ్చిందని ఆహార వ్యవసాయ సంస్థ  ఒక ప్రకటనలో వెల్లడి చేసింది. దానివల్ల ఫిబ్రవరి 2, 2008 తర్వాత ఎలాటి సంఘటన జరగలేదని అన్నారు.

img2.JPG

ఈ బర్డ్ఫ్లూ తీవ్రంగా ఉన్నపుడు ఆ పక్షులతో బాగా దగ్గరగా సంచరించడంవల్ల మనుష్యులూ అనారోగ్యం పాలౌతారు. ఆ వ్యాధి సోకిన కోళ్లనూ, బాతులనూ సరైన రీతిలో ఉడికించకుండా తినడంవల్ల కూడా ఆ వ్యాధి మనుష్యులకు సోకే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి ప్రాణాంతకమైంది. దీనికి ఇప్పటిదాకా ఎలాటి వ్యాక్సినూ లేదు.

ఆధారం: http://www.nlm.nih.gov/medlineplus/birdflu.html

ఇండియాలో బర్డ్ఫ్లూ గురించిన తాజా వార్తలు
ఇండియాలో బర్డ్ఫ్లూ తిరిగి సోకే అవకాశాలు

బర్డ్ఫ్లూ తిరిగి భారతదేశంలో హెచ్చు ప్రమాదమైన ప్రదేశాల్లో సోకే ప్రమాదం కనిపిస్తోంది. ఇటీవలే బర్డ్ఫ్లూ బారినపడి దానినుంచి కోలుకొంటున్న పశ్చిమ బెంగాల్లో మళ్లీ ఏవియన్ఇన్ఫ్లుఎంజా సోకే సూచనలు కనిపిస్తున్నాయని యునైటెడ్ నేషన్స్ కు చెందిన  ఆహార ఏజెన్సీ – ఎఫ్ఏఓ వెల్లడించింది.
ఈ ఎఫ్ఏఓకు చెందిన ముఖ్య వెటర్నరీ అధికారి జోసెఫ్ డొమెనెక్ ఈ వార్త వెల్లడి చేస్తూ, ‘ఈ ప్రమాదకరమైన వైరస్ మళ్లీ అవే ప్రదేశాల్లో వచ్చే ప్రమాదం మెండుగా ఉంది గనక అంతా అప్రమత్తంగా ఉండాలని’ హెచ్చరించారు. ర్డ్ఫ్లూ సోకిన పక్షులన్నిటినీ సంహరించినా, అక్కడంతా మందులను జల్లినా వైరస్ అవశేషాలు ఇంకా పర్యావరణంలో ఉందని, అలాకాకపోతే పక్క దేశాలనుంచైనా సోకవచ్చనీ  ఆయన ఉన్నారు.
ఈ పక్షుల ఊచకోతవల్ల వచ్చే అపోహలను తొలగించడానికి భారత ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని  ఎఫ్ఏఓ ప్రకటించింది. ప్రభుత్వం ప్రజల్లో ఈ బర్డ్ఫ్లూ గురించి అవగాహన ఏర్పరచాలనీ, గ్రామీణ భారతంలోపౌల్ట్రీ పరిశ్రమ సురక్షితంగా ఉండేలా చూడాలనీ అందుకు గ్రామీణ సమూహాలను అప్రమత్తం చేయాలనీ, మానవ సంక్షేమాన్నిచ్చే బయో రక్షణా పద్ధతులను వాడేలా చూడాలనీ ఆ సంస్థ ప్రకటించింది.
బతికి ఉన్న పక్షులను అమ్మే మార్కెట్లు, పక్షుల వలస వేళ్ళే మార్గం, పౌల్ట్రీ ఉత్పత్తులు  – వీటిని గుర్తించి వేరుచేసి బర్డ్ఫ్లూను నిరోధించాలని ఆ సంస్థ ప్రకటించింది.
బర్డ్ఫ్లూ నియంత్రణలో ఎలాటి జాప్యమూ లేదు : పశ్చిమ బెంగాల్

విచారకరమైన క్షణం : పశ్చిమ బెంగాల్, హూగ్లీ జిల్లా ఝెరో గ్రామంలోని ఒక గ్రామస్థురాలు తన పక్షులన్నిటినీ గురువారం నాడు ఆరోగ్య కార్యకర్తలకందిస్తూ రోదించింది.

కోల్కత : ఏవియన్ ఫ్లూను నిరోధించడంలో అధికారుల అలసత్వమేమీ లేదని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. ఇది రాష్ట్రంలో 9 జిల్లాల్లో వ్యాపించిన సంగతి విదితమే.
‘పెరట్లలో సుదూరంగా పొడవుగా ఉన్న పౌల్ట్రీలలో ఉండే కోళ్లనీ, పక్షులనీ చేరడంలో అధికారులు ఆలస్యమ చేశారన్న వార్తల్లో నిజం లేదు. ఆరంభంలో కొంత ఆలస్యమైందంతే’ అని రాష్ట్ర పశువనరుల శాఖ మంత్రి శ్రీ అనీసుర్ రెహమాన్,  ది హిందూతో అన్నారు.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమైనందువల్లే బర్డ్ఫ్లూ పశ్చిమబెంగాల్లో తీవ్రమైందన్న కేంద్ర మంత్రి శ్రీ శరద్ పవార్ మాటలను ప్రస్తావించగా,  శ్రీ రెహమాన్ ప్రతిస్పందించలేదు.
మరో 5 రోజుల్లో  పక్షులన్నిటినీ సంహరించడం  పూర్తవుతుందని అధికారులన్నారు. ఐ5కే1 వైరస్ సోకిన పౌల్ట్రీల 5 కి.మీ. వ్యాసార్ధంగల ప్రాంతాలన్నిటిలో దాదాపు 21 లక్షల పక్షులను సంహరించాల్సి ఉంది.
బుధవారం సాయంత్రం నాటికి దాదాపు 7 లక్షల పౌల్ట్రీ పక్షులను సంహరించడం జరిగింది. ఆ రోజు అంతానికి మరో 3 లక్షల పక్షులను సంహరించడం జరుగుతుందని శ్రీ రహమాన్ అన్నారు.

ఈ పౌల్ట్రీ విస్తరించిన తీరు చాలా ఎక్కువ కావడంతో 20 లక్షల పక్షులను ఒకే వారంలో సంహరించడం క్లిష్టమైన పని అన్నారు ముఖ్య కార్యదర్శి శ్రీ అమిత్ కిరణ్ దేవ్. ‘ఐతే ఆ పనిని త్వరగా పూర్తి చేస్తాం’ అన్నారాయన.

ఈ పౌల్ట్రీలకు తగిన పరిహారాన్ని కూడా ఇవ్వడమే కాక, కేవలం ఈ పౌల్ట్రీ పరిశ్రమపైనే ఆధారపడి బతికే వారికి పునరావాసాన్నీ  కల్పించే దిశలో కేంద్రానికి ప్రతిపాదనలను పంపింది రాష్ట్ర ప్రభుత్వం.

మరింత సమాచారాన్నిచ్చే సైట్స్:

బర్డ్ఫ్లూ వార్తలు
విశ్వవ్యాప్తంగా ఏవియన్ ఫ్లూ గురించిన రోజువారీ అప్డేట్స్
www.thepoultrysite.com

బర్డ్ఫ్లూ ఆన్లైన్ మాన్యువల్
www.birdflu-manual.com

వ్యాధి పర్యవేక్షణా ఉపకరణం
బర్డ్ఫ్లూని త్వరగా గుర్తించి నియంత్రించే ఇంటెలిజెంట్ క్లినికల్ సాఫ్ట్వేర్
www.csdss.com

ఆవులు – జాతులు – వాటి ఎంపిక


పాడి ఆవులు

సాహివాల్

 • ముఖ్యంగా పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్,ఢిల్లీ, బీహార్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో ఉంటుంది.
 • పాల దిగుబడి- గ్రామీణ ప్రాంతాలలో :1350 కిలోలు
  – వాణిజ్య డైరీ ఫారంలో: కిలోలు
 • మొదటిసారి ఈతకు వచ్చినవపుడు వయసు -32-36 నెలలు
 • ఈతకు, ఈతకు మధ్య సమయం 15 నెలలు

గిర్

 • దక్షిణ కలైవార్ ప్రాంతాలలోని గిర్ అడవులలో ఉంటుంది.
 • పాల దిగుబడి- గ్రామీణ ప్రాంతాలలో- 900 కిలోలు
  – వాణిజ్య డైరీ ఫారంలో -1600 కిలోలు
gir.JPG

తర్ పార్ కర్

 • జోద్ పూర్, కచ్, జైసల్మార్ ప్రాంతాలలో ఉంటుంది.
 • పాల దిగుబడి- గ్రామీణ ప్రాంతాలలో- 1600 కిలోలు
  – వాణిజ్య డైరీ ఫారంలో-2500 కిలోలు

ఎర్ర సింధి

 • పంజాబ్, హర్యానా, కర్ణాటక, తమిళనాడు, కేరళ మరియు ఒరిస్సా ప్రాంతాలలో ఉంటుంది.
 • పాల దిగుబడి   – గ్రామీణ ప్రాంతాలలో-1100 కిలోలు kgs
  – వాణిజ్య డైరీ ఫారంలో-1900 కిలోలు.

పాడి మరియు సేద్య యోగ జాతులు

ఒంగోలు

 • ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు, కృష్ణ , గోదావరి మరియు గుంటూరు జిల్లాలలో లభిస్తుంది.
 • పాల దిగుబడి – 1500 కిలోలు
 • ఎద్దులు పొలం దున్నడానికి మరియు బండి కట్టడానికి బాగా అనువైనవి.

హరియానా

 • హర్యానాలోని కర్నల్, హిస్సార్, గుర్ గావ్ జిల్లాలలో మరియు పడమర మధ్య ప్రదేశ్ ప్రాంతాలలో ఉంటుంది.
 • పాల దిగుబడి- 1140-4500 కిలోలు
 • ఎద్దులు రవాణాకి మరియు పొలం దున్నడానికి అనువైనవి.

కాంగ్రెజ్

 • గుజరాత్ లో ఎక్కువగా ఉంటుంది.
 • పాల దిగుబడి – గ్రామీణ ప్రాంతాలలో-1300 కిలోలు
  – వాణిజ్య సరళిలో- 3600 కిలోలు
 • ఈతకు వచ్చినవపుడు వయసు- 36-42 నెలలు
 • ఈతకు, ఈతకు మధ్య సమయం -15నుంచి 16 నెలలు
 • ఎద్దులు బలంగా, హూషారుగా ఉండి,దున్నటానికి, బండి కట్టడానికి పని కొస్తుంది.

డియోని

 • ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర మరియు పడమర ప్రాంతాలలో ఉంటుంది
 • పాడి ఆవులు అధిక పాల దిగుబడికి, ఎద్దులు పొలం పనులకు అనువైనవి.

సేద్యయోగ జాతులుఅమ్రిత మహల్

 • కర్ణాటకలో ఎక్కువగా లభిస్తుంది.
 • పొలం దున్నడానికి, రవాణాకు బాగా ఉపయోగపడుతుంది.

హల్లికార్

 • కర్ణాటకలోని తుమ్ కూర్, హసన్, మరియు మైసూర్ జిల్లాలలో ఉంటుంది.

కిల్లర్

కంగాయమ్

 • తమిళనాడులోని కోయంబత్తూరు, ఎరోడ్, నమక్కల్, కరూర్ మరియు దిండిగల్ ప్రాంతాలలో ఉంటుంది.
 • పొలం దున్నడానికి మరియు రవాణాకు అనువైనది. దుర్బర పరిస్ధితులను కూడా తట్టుకోగలదు.

విదేశీ పాడి ఆవుల జాతులుజైర్సీ

 • మొదటి ఈతకు వయసు – 26-30 నెలలు
 • ఈతకు, ఈతకు మధ్య సమయం 13-14 నెలలు
 • పాల దిగుబడి – 5000-8000 కిలోలు
 • డైరీ పాల దిగుబడి 20 లీటర్లు , కానీ సంకరజాతి జెర్సీ పాల దిగుబడి 8-10 లీటర్లు ఒక రోజుకి.
 • భారతదేశంలో ఈ జాతి ఆవులు ఉష్ణ ప్రదేశాలకు బాగా అలవాటు పడ్డాయి

హౌలిస్టిన్ ఫ్రిజియన్

 • ఈ జాతి ఆవు హాలాండ్ నుంచి దిగుమతి చేసుకోబడింది
 • పాల దిగుబడి 7200-9000 కిలోలు
 • విదేశీ జాతులలో ఈ జాతి ఆవు పాల దిగుబడిలో అత్యంత శ్రేష్ఠమైనది
 • సగటున రోజుకు 25 లీటర్లు పాలు ఇస్తుంది,అదే సంకర పరచిన ఈ ఆవు సగటున 10-15 లీటర్లు రోజుకు దిగుబడినిస్తుంది. కోస్తా ఆంధ్రా ప్రాంతాలకు బాగా అనువైనది.

గేదెల జాతులుముర్రా

 • హర్యానా, ఢిల్లీ, పంజాబ్ ప్రాంతాలలో ఉంటుంది.
 • పాల దిగుబడి 1560 కిలోలు.
 • సగటున రోజుకు 8-10 లీటర్లు పాలు ఇస్తుంది. సంకర పరచిన ముర్రా గేదె రోజుకు 6-8 లీటర్లు ఇస్తుంది.
 • కోస్తా ప్రాంతాలలో మరియు శీతోష్ణ ప్రదేశాలకు అనువైనది.

సుర్తీ

 • గుజరాత్ లో లభిస్తుంది
 • పాల దిగుబడి 1700-2500 కిలోలు

జఫరాబాద్

 • గుజరాత్ లోని కతైవార్ ప్రాంతములో ఉంటుంది
 • పాల దిగుబడి 1800-2700 కిలోలు

నాగపూర్

 • నాగపూర్, వర్దా,అకేలా, అమరావతీ ప్రాంతాలలో ఉంటుంది.
 • పాల దిగుబడి 1030-1500 కిలోలు

పాడి పశువుల ఎంపికలో మెళకువలు

పాడి ఆవుల ఎంపిక
దూడలను, ఆవులను ప్రదర్శవలే ఎంపిక చేసుకోవడం అనేది ఒక కళ. ఆవులను కొనేటప్పుడు, వాటి పాల ఉత్పత్తి మరియు ఈత సమర్ధతను చూసి కొనాలి. బాగా సమర్ధవంతంగా నడిపిన ఫారం నుంచి, పశువుల నాణ్యతను, చరిత్రను తెలుసుకొని కొనాలి. కొనాలనుకునే ఆవు పాలదిగుబడిని మూడుపూటలా తూచి ప్రతిసారి సగటున ఎన్ని పాలిస్తున్నాయో లెక్కకట్టుకోవాలి. పాలు పితకడానికి ఎవరినైనా దగ్గరకి రానివ్వ గలిగే ఆవుని మాత్రమే ఎన్నుకోవాలి. అక్టోబరు – నవంబరు మాసాలలో మాత్రమే కొనుగోలు చేయాలి. ఈనిన తొంబై రోజుల వరకు అధిక శాతం పాలను ఇవ్వాలి.

మంచి ఈత సామర్ధ్యం ఉన్న ఆవుల ఎంపిక

ఆవులు ఆరోగ్యంగా,చురుకుగా, ఆకర్షణీయంగా, ఆడ లక్షణాలతో నిండుగా ఉండాలి. మంచి శరీర సౌష్టవం కలిగి, శరీరము త్రికాణాకారముగా ఉండాలి.
కాంతి వంతమైన కన్నులు కలిగి, మెడ సన్నముగా ఉండాలి. పొదుగు చక్కని సమతులము కలిగి, పెద్దదిగా, నిడివిగా ఉండి  శరీరమునకు చక్కగా అంటిబెట్టుకొని ఉండాలి. పొదుగు క్రింద ఉండే పాలనరము పెద్దదిగా, ఉబ్బి వంకరటింకరగా ఉండాలి. చనుకట్లు ఒకే పరిమాణము కలిగి చతురస్రముగాను, సమదూరముగాను ఉండాలి.

వాణిజ్య సరళిలో నడిపే డైరీలను పాడి పశువుల ఎంపిక

భారతదేశ పరిస్ధితులలో ఒక్కొక్క డైరీ ఫారంకు. కనీసం 20  పశువులు ఉండాలి. (10 ఆవులు, 10 గేదెలు) ఈ లెక్కన  కొన్ని రోజులకు 50 :50 లేదా 40 – 60 నిష్పత్తిలో కనీసం 100 పాడి పశువుల వరకు నడవచ్చు. మన దేశంలో చాలా మటుకు తక్కువ క్రొవ్వు కలిగిన పాలను మాత్రమే ఇష్టపడతారు ఒక డైరీలే కలబోసిన జాతులు, ఉంటే మంచిది
( సంకరపరచినవి, ఆవులు, గేదెలు ఒకే షెడ్లో వేరు వేరు వరుసలో ఉంచబడినవి) పాలు  విక్రమించుకునే ముందు, మార్కెట్టును బాగా తెలుసుకోవాలి. అవసరాన్నిబట్టి ఆవు పాలు, గేదెపాలు కలపొచ్చు కానీ, హొటల్స్, వినియోగదారులు ( 30 శాతం మంది ) ఎక్కువగా గేదె పాలను ఇష్టపడతారు. వైద్యశాలలు ఎక్కువగా ఆవు పాలను ఇష్టపడతారు.

ఆవుల ఎంపిక

మంచి నాణ్యత కలిగిన ఆవులు మార్కెట్ లో లభిస్తాయి. రోజుకి 10 లీటర్లు పాలు ఇచ్చే ఆవు 12,000 నుంచి 15,000 వరకు ఉంటుంది. ప్రత్యేక శ్రద్ధతో చూచిన ప్రతి ఆవు 13 – 14 నెలల వ్యత్యాసంలో ఒక్కొక్క దూడను ఈనుతుంది. ఆవు పాలలోని క్రొవ్వు శాతం 3 -5.5 వరకు ఉంటుంది. ఇది గేదె పాల కంటే తక్కువ.

గేదెల ఎంపిక

డైరీ ఫారంలకు బాగా అనువైన ముర్రా, మెహసనా జాతి గేదెలు మన దేశంలో బాగా అనువైనవి. క్రొవ్వు శాతం ఆవు పాల కంటే ఎక్కవగా ఉన్నందువల్ల గేదె పాలను ఎక్కువగా వెన్న, నెయ్యి తయారీకి ఉపయోగిస్తారు.ఇండ్లలో టీ తయారీకి ఎక్కువగా కూడా ఉపయోగిస్తారు. గేదెల పోషణకి నార ఎక్కువ కలిగిన వ్యవసాయ వ్యర్ధ పదార్ధాలను ఉపయోగించవచ్చు. అందువల్ల తక్కువ ఖర్చుతో గేదెలను మేపవచ్చు. గేదెలు ఎక్కువ వేడిని తట్టుకోలేవు. అందువల్ల వాటిని చల్ల బరచడానికి, ఫ్యాన్, షవర్లు అవసరం. గేదెలు ఈతకు ఆలస్యంగా వస్తాయి. ఈతకు ఈతకు 16నుంచి 18 నెలలు సమయం పడుతుంది.గమనిక : తమిళనాడు వెటర్ననరీ విశ్వవిద్యాలయం, చెన్నై మరియు బి.ఎ.ఐ.ఎఫ్. పూణె నుంచి సేకరించబడినది.

వ్యవసాయం ద్వారా జీవనోపాధి


గ్రామీణ భారతంలో జీవనోపాధినిచ్చేది నిస్సందేహంగా వ్యవసాయమే (తత్సంబంధ శాఖలతో సహా). మనం ఎలక్ట్రానిక్ కాలంలోకి అడుగుపెట్టాం. దానికి తోడు కొత్త కల్పనలు, ఆవిష్కారాలూ ఎన్నో వస్తున్నాయి. దీనికి వ్యవసాయ రంగం అతీతమైనదేమీ కాదు. అందువల్ల వ్యవసాదారులందరికీ ఈ వ్యవసాయ రంగంలో వస్తున్న ­వినూత్న మార్పుల గురించి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మెరుగైన పరిజ్ఞానం గురించి ఉపయుక్తమైన సమాచారాన్ని గ్రామీణ భారతంలోని రైతులోకానికీ, మరియు రైతు సేవ అందించే వారికీ తెలియాలి. అలా అందుబాటులోకి తేవడమే www.indg.in లక్ష్యం.

గ్రామీణ వ్యవసాయ రంగంలో వివిధ భాగస్వాములు అంటే-రైతులు, సహకార సంస్థలు, ఔద్యోగిక సంస్థలు, వ్యవసాయ పనిముట్ల ­క్రయవిక్రయదారులు, ఎరువులు, రసాయనక కంపెనీలు, బీమా సంస్థలు, అగ్రోనమిస్టులు, కన్సల్టెంట్స్, సలహాదారులు -వంటి వారికోసం. భారత ప్రగతి ద్వారం ఒక చర్చా వేదికను ఏర్పాటు చేసి, ప్రస్తుత సమస్యలకు పరిష్కార మార్గాలను చూపే విధంగా ప్రయత్నిస్తుంది.

భారత ప్రగతి ద్వారం పోర్టల్లో ( www.indg.in ) వ్యవసాయ రంగానికి సంబంధించిన సమాచారం అంటే వ్యవసాయ రుణాలు, పాలసీలు, పథకాలు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, మార్కెట్ సమాచారం, వ్యవసాయ రంగంలో పాఠించే  అత్యుత్తమ పధ్ధతులు, వివిధ వ్యవసాయ పరిశ్రమలు, ఉత్పత్తులు, సేవలు మొదలగు సమాచారాన్ని పోర్టల్ ద్వారా గ్రామీణ రైతులకు అందిస్తుంది.

సమయానికి నమ్మకమైన  సమాచారాన్ని మా వెబ్సైట్ ద్వారా స్ధానిక భాషల్లో అందించి, అనుభవజ్ఞులతో పరస్పర సమాచారాన్ని మార్పిడి చేసుకోవడానికి, రోజువారీ పనులు ప్రణాళిక చేసుకోవడానికి ఒక వేదిక నందిస్తుంది., అవసరమైనప్పుడు అన్ని రకాల సహాయాలు, సలహాలూ అందించడం ద్వారా వ్యవసాయ రంగంలో మేమొక వ్యవసాయ ­జ్ఞాన సమాజాన్ని చూడ గోరుతున్నాం.

విద్య- ఉత్తమ పద్థతులు


హిమాయత్నగర్: ప్రాథమికోన్నతపాఠశాలల విద్యార్థుల్లో భాషాప్రావీణ్యాన్నిమెరుగుపరచడం, పఠనాసక్తిపెంచడానికిసర్వశిక్షా అభియాన్ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. ఇవి అమలవుతున్నతీరును పరిశీలించేందుకు బుధవారం నగరం, రంగారెడ్డిలలోనికొన్నిస్కూళ్లను రాష్ట్రవిద్యాపర్యవేక్షణ అధికారి ఉపేందర్రెడ్డి, స్టేట్కమ్యూనిటీమొబిలైజేషన్ఆఫీసర్ మధుసూధన్, రంగారెడ్డి జిల్లాలసర్వశిక్షా అభియాన్అధికారి జయనాథరావుతదితరులు సందర్శించారు. మొదటబోయిన్పల్లిలోని జి.జి.యు.పి.ఎస్.పాఠశాలకు వెళ్లిఅక్కడ విద్యార్థులను ఈకార్యక్రమాల వల్ల కలుగుతున్న ప్రయోజనాలనుఅడిగితెలుసుకున్నారు.అనంతరం కుత్బుల్లాపూర్లోనిడి.పి.ఇ.పి.స్కూలును, గాంధీనగర్లోని మండల పరిషత్ ప్రాథమికపాఠశాలను కూడా సందర్శించారు.

సమాజాలకు విద్యనందించడం, సమాయాత్తం చేయడం

ఇండియాలో కార్మికుల్లా పనిచేసే బాలికలకోసం ఒక విశిష్టమైన పద్ధతిని ఎంవి ఫౌండేషన్ తయారుచేసింది : సమాజాలను, ప్రభుత్వాలను వెట్టి చాకిరీ , బాల కార్మిక వ్యవస్థలెంత అమానుషమైనవో వారికి తెలియజేసి వారిని సమాయాత్తం చేయడం. ఆడపిల్ల(ద గర్ల్ చైల్డ్) కార్యక్రమం ఎన్నో వినూత్నమైన మంచి పద్ధతులను సూచించింది.ఇళ్లలో పనిచేసే, వెట్టిచాకిరీచేసే  బాలికలను గుర్తించి వారిని తిరిగి బడికి పంపి, వారు చదువుకొనేలా చేయడం  ఈ కార్యక్రమం వల్ల సాధ్యమౌతోంది. సమాజంలోని  సాంప్రదాయక ఆలోచనలను,సాంఘిక కట్టుబాట్లను ఇది సవాలు విసిరింది. కీలక భాగస్వాములకు  ‘బాలికల విద్యాహక్కు’ గురించి తెలియజేయడం, పనిచేస్తున్న బాలికలను గుర్తించడం , వారికి సంబంధించిన పలు అవకాశాలను అన్వేషించింది. సమస్యను అర్థం చేసుకొని  బాలికల కోసం శ్రమించాలని సమాజానికుండే సత్తాను ఇది బలపరిచింది. తద్వారా బాలికలను బడికి వెళ్లేలా చేస్తోంది. సమాజంలో బాలికల వెట్టిచాకిరీ సమస్యను తొలగించే విషయంలో ఉండే చురుకుదనం,  రహస్యంగాకాక, ఆ సమస్యను అందరిముందు బహిరంగంగా చర్చించేలా చేయడం కూడా ప్రాథమిక ఎత్తుగడలలో ఒకటి. ఈ విషయాన్ని  అనేక సామాజికపరమైన మీటింగుల్లో  చర్చించడం జరిగింది. అంతేకాదు. పాఠశాల విద్యా కమిటీలు ఈ విషయాన్ని చర్చించి  పారిశుద్ధ్యం, రక్షణ పరమైన బాలికల ప్రత్యేక అవసరాలను తీర్చేలా పాఠశాలలను అప్గ్రేడ్ చేయాలని నిశ్చయించింది. ఈ విషయంలో స్వయంగా ఈ కష్టాన్ని అనుభవించిన వారే ‘ఆడపిల్ల’ కార్యక్రమ  కార్యకర్తలుగా నియమితులై ఉండటం, వారికి స్థానికంగా శిక్షణనివ్వడం జరిగింది.  వారు ఇంటింటికీ తిరిగి బడికిపోకుండా వెట్టి చాకిరికి గురైన బాలికలెవరున్నారో 11 మందిని  గుర్తించి, వారి తల్లిదండ్రులకు చెప్పి, వారిని పనికి కాక బడికి పంపేలా చూడటం జరిగింది. ఈ విషయంలో వారు ఘర్షణ లేని మార్గాలలో శిక్షణ పొందిన వీరు  ఆడపిల్లు చదువుకోవడానికి ఉండే అవసరాన్ని అందరూ గుర్తించేలా చేసి, వారి తల్లిదండ్రుల్లో వ్యతిరేకతను బలహీనపడేవరకు పన్చేయడం జరిగింది. తల్లిదండ్రులంగీకరించాక వారి చిన్న ఆడపిల్లలనైతే బడిలో తిరిగి చేర్చడం, పెద్ద ఈడు ఆడపిల్లలైతే  రెసిడెన్షియల్ క్యాంపుల్లో చేర్చడం జరిగింది.  అలా చేసే సమయంలో ఆ పిల్లల తల్లిదండ్రుల కు ప్రాక్టికల్గా సహాయాన్నివ్వడం జరిగింది. డ్రాప్ఔట్లను మానిటర్ చేయడం, చొరరాని చోట్లకెళ్లి వెట్టిచాకిరీకి గురైన బాలికలను గుర్తించడం జరిగింది.  కార్యకర్తలు  ఆడపిల్లలను ఏకంచేసి, వారిని అనుభవాలను పంచుకోవడం ద్వారా ఉత్తేజపరిచి  ఒకరికొకరు సహాయపడేలా చేయడం జరిగింది. గ్రామాల్లో ప్రధాన సమస్య అయిన బాల్య వివాహాలను గురించి కూడా వీరు పనిచేశారు. తద్వారా బాలికలను బడికి పంపే విషయంలో సాయం చేశారు. ప్రతీ ప్రజాకార్యక్రమంలో పాల్గొని  లింగ వివక్ష సమస్యల గురించి లేవలెత్తి, బాలికల హక్కులగురించి చర్చించేలా ‘ఆడపిల్ల’ కార్యక్రమ  కార్యకర్తలకు శిక్షణనివ్వడం జరిగింది. వివిధ కమిటీల(ఆడపిల్లల హక్కుల పరిరక్షణ, తల్లులు, బడి బాలికలు, బాలిక యువ మండలి వగైరా) ఏర్పాటు ద్వారా సమాజంలో చైతన్యం తెచ్చారు.  అన్నీ కమిటీలు కూడా  బాలికల వెట్టిచాకిరీ సమస్యనే లెవనెత్తేలా చేశారు. నాటకాలు, వీధి ప్రదర్శనలు ప్రజల్లో అవగాహనకూ, అర్థం చేసుకోవడానికీ దోహదం చేశాయి. వీటి ప్రభావం వెట్టిచాకిరీనించి బాలికలకు విముక్తి కలిగించడంలో, నిరోధించడంలో  ఎంతో వుంది. ఫలితంగా రెసిడెన్షియల్ క్యాంపుల్లో ఎన్రోల్మెంట్ శాతం పెరిగింది. ఇంటి పెద్దల అంగీకారంతో బాల్య వివాహాలు కొన్ని  రద్దయ్యాయి. మరి కొన్ని వాయిదా వేయడం జరిగింది.  బాలికలను వెట్టి చాకిరీనించి విముక్తి కలిగించి వారు చదువుకొనేలా చేయడంలో   జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా మరిందరు కార్యక్రమాన్ని చేపట్టేలా ఈ కార్యక్రమాన్ని ఎంవి ఫౌండేషన్ చేపట్టి, ఆదర్శంగా నిలిచింది.

ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ – హైవెల్- భాగస్వామ్యం

2001 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనాభా 75.7 మిలియన్లు. అక్షరాస్యత రేటు 60.5 శాతం. ఈ మొత్తం జనాబాలో 5 మిలియన్ల గిరిజనులు జనాభా ఉన్నా వారి అక్షరాస్టత రేటు కేవలం 17 శాతం. ఈ తెెగలు / ఆదివాసీలు ఆర్థికంగా చాలా వెనకబడి వ్యవసాయం చేస్తూ, అటవీ ఉత్పత్తుల సేకరణలో, దినకూలి పనులు చేయడం జరుగుతోంది. వీరి అక్షరాస్యతను, ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. గురుకులాల పేరిట రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు అలాటి కార్యక్రమాల్లో ఒకటి. ఈ స్కూళ్లలో వారికి ఉచిత విద్య, భోజన వసతి సౌకర్యాలుంటాయి. విద్యాశాఖ, సోషల్ వెల్ఫేర్ శాఖ, ట్రైబల్ వెల్ఫేర్ శాఖలు సమిష్టిగా వీటిని నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలో 4 జిల్లాలలో హోల్-ఇన్-ది-వాల్ ఎడ్యుకేషన్ లిమిటెడ్ అనే సంస్థ  గిరిజన సంక్షేమ శాఖల భాగస్వామ్యంతో లర్నింగ్ స్టేషన్లని పిలిచే ఈ శిక్షణాలయాలు ఏర్పాటయ్యాయి.   వాటిని  పార్వతీపురం, శ్రీశైలం, భద్రాచలం, నాగార్జున సాగర్లలో ఏర్పాటు చేశారు. ఆగస్ట్ 2005లో ఆరంభించిన ఈ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్లలో ప్రతిభగల ట్రైబల్ విద్యార్థులకు శిక్షణనిస్తున్నారు. ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన, 8వ తరగతినించీ 10వ తరగతిదాకా కో-ఎడ్యుకేషన్ వీటిలో ప్రత్యేకం. నాగార్జునసాగర్లోని ట్రెబల్ వెల్ఫేర్  రెసిడెన్షియల్ స్కూల్(పిటిజి-బాలురు) 1986లో ఆరంభించారు. ఇందులో 458 విద్యార్థులు, 23 టీచర్లు ఉన్నారు.  ఇక్కడ 3వతరగతినించి 10వతరగతిదాకా ఉంది. ఆంగ్ల భాష బోధిస్తున్నా, తెలుగు మాధ్యమంలో విద్యాబోధన జరుగుతోంది.  15 కంప్యూటర్లున్న కంప్యూటర్ ల్యాబ్ కూడా ఉంది. ఇది ఆరంభ దశలో ఉన్న తెగల విద్యార్థుల గ్రూప్ కోసం ఉద్దేశించబడింది. వీరిలో  తొలి తరానికి చెందిన విద్యార్థులే అధికం.

బాలికా విద్య


అందరికీ విద్య అందించాలనేది భారత ప్రభుత్వ దృఢ సంకల్పం. ఐతే మొత్తం ఆసియాలోకే అతి తక్కువ మహిళా అక్షరాస్యత భారత దేశంలోనే ఉంది. 1991లో 330 మిలియన్ల 7 ఏళ్ల వయస్సుపైబడినమహిళా జనాభాలో దాదాపు 40శాతంకన్నా తక్కువమంది అక్షరాస్యులు. అంటే, నేటికి ఇండియాలో కనీసం 200 మిలియన్ల స్త్రీలు నిరక్షరాస్యులన్నమాట.

ఈ అతి తక్కువ అక్షరాస్యత స్థాయి కేవలం మహిళల జీవనంపైనే కాదు, వారి కుటుంబ జీవనంపైన కూడా వ్యతిరేక ప్రభావాన్ని చూపుతోంది. ఆ ప్రభావం దేశ ఆర్థికాభివృద్ధి మీదా పడుతోంది. అనేక అధ్యయనాలనుబట్టి తెలిసినది ఏమిటంటే, నిరక్షరాస్యులైన మహిళలలోనే ప్రసవ సమయాల్లో చనిపోయే అవకాశాలెక్కువగా, పోషకాహారం తక్కువగా ఉండటం జరుగుతోంది. పైగా వారికి తక్కువ సంపాదనావకాశాలు, ఇంట్లో తక్కువ స్వాతంత్ర్యం ఉండటం జరుగుతోంది. దీనివల్ల ఆ మహిళల ఆరోగ్యం పైనే కాక వారి పిల్లల ఆరోగ్యంపైన కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ఉదాహరణకి, ఇటీవల భారతదేశంలో జరిపిన ఒక సర్వేలో పసికందులు మరణించే రేటు తల్లి అక్షరాస్యత స్థాయికీ సంబంధం ఉందని తేలింది. అదనంగా చెప్పొచ్చే మరో విషయం ఏమిటంటే, నిరక్షరాస్య జనాభావల్ల దేశ ఆర్థికాభివృద్ధి కూడా కుంటుపడుతుంది.

బాలికలకు మరియు స్త్రిలకు సంపూర్ణ విద్యను కల్పించడం అనేది భారత ప్రభుత్వ కార్యాచరణ విధానాల రూపకల్పన లో    ప్రాధాన్యతను సంతరించుకుంది.   ఈ కొత్త శహస్రాబ్దిలో పిల్లలందరికి ముఖ్యంగా బాలికలకు ప్రాధమిక విద్యను   అందించాలనే   లక్ష్యం తో భారత ప్రభుత్వం ఇంతవరకూ   చేప్పట్టిన విద్యాపరమైన సంస్కరణలు సమకూర్చి వాటికి మరిన్ని వనరులను మరియు ధ్రడమైన కార్య విధానాలను ఎర్పరిచి, విద్యావంతమైన నవ భారత నిర్మాణం కోసం క్రషి  చేస్తోది.