విషజ్వరాలతో వణుకుతున్న జనం


సంగారెడ్డి: మెదక్‌ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు విషజ్వరాలు సోకి జనం విలవిల లాడుతున్నారు. జిల్లాలోని గ్రామాలలోని గిరిజన తాండాలలో, పట్టణాలలో జ్వరాలు వ్యాపిస్తున్నాయి. సమాచారం అందుకున్న వైద్యాధికారులు అప్రమత్తమై చర్యలు చేపట్టారు. రామాయంపేట మండలం దొంగల ధర్మారంలో ఇద్దరు ఉపాధి కూలీలు మరణించగా, మరో 50 మందికి అస్వస్థతతో భాదపడుతున్నారు. ప్రతి ఇంటా ఒక్కరు అంతుచిక్కని విషజ్వరాలు సోకి మంచాన పడుతున్నారు. వ్యాధి లక్షణాలు వింతగా ఉండటంతో వైదులు చికిత్స అందించినప్పటికీ ఏ మాత్రం జ్వరం తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తుంది. గ్రామంలో పారిశుద్ధ్యం పడకేసింది. కలుషిత నీరు సరఫరా, గ్రామమంతా మురికిమయంగా ఉండటంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. గత పదిహేను రోజుల క్రితం విషజ్వరం సోకి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏర్పుల లక్ష్మీ(55), గాండ్లలక్ష్ష్మి(38),లు మృతి చెందారు. గ్రామంలో సుమారు 50 మంది వరకు జ్వరాల బానిప పడ్డారు. కల్హేర్‌లోని గిరిజన బాలికల మినీ గురుకులంలో 30 మంది విద్యార్థినీలు అస్వస్థతకు గురయ్యారు. వాతావరణ కల్హేర్‌ మండలం పిహెచ్‌సి వైద్యాధికారి సీతారామరాజు ఆధ్వర్యంలో వైద్యశిబిరం ఏర్పాటుచేసి వారికి చికిత్సలు చేశారు. వాతావరణ ప్రభావంతో విద్యార్థినులు జ్వరాల బారిన పడుతున్నారని తెలిపారు. కల్హేర్‌లోని గిరిజన బాలికల మినీ గురుకులాన్ని జిల్లా వైద్యాధికారి గోవర్ధన్‌రెడ్డి మంగళవారం రాత్రి సందర్శించారు. అస్వస్థకు గురైన బాలికల వివరాలను అడిగి తెలుసుకున్నారు. భోజనాన్ని పరిశీలించారు. శుభ్రత పాటించాలన్నారు. జ్వరాలతో నారాయణఖేడ్‌్‌ సాంఘీక సంక్షేమ వసతి గృహంలో 15 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. గత మూడు రోజులుగా జ్వరాలు రావడంతో ఏఎన్‌ఎం ద్వారా వారికి చికిత్సలు చేయిస్తున్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందజేయాలని సూచించారు. డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్‌, ఖేడ్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్జీ అధికారి భాస్కరాచారి, తహశిల్దార్‌ సృజనమ్మలు సందర్శించి పరిస్థతిని తెలుసుకున్నారు. దుబ్బాక మండలం రామక్కపేట బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినిలు అస్వస్థతకు గురైన సంఘటన తెలుసుకున్న సిద్ధిపేట ఆర్డీఓ హన్మంత్‌రావు సందర్శించి హస్టల్‌ను తనిఖీ నిర్వహించారు. అన్ని పట్టణాలలో ప్రజలు వైరల్‌ ఫీవర్‌, విషజ్వరాల బారిన పడుతున్నారు. రోగులతో ప్రైవేటు ఆసుపత్రిలన్నీ కిటకిటలాడుతున్నాయి.

Advertisements

సింగూరు ఆనకట్టలో నిలువ నీటితో తీరనున్న జంటనగరాల దాహర్తి


సంగారెడ్డి: మెదక్‌ జిల్లా సింగూరు ఆనకట్టలో ఉన్న నిలువైన నీటితో జంటనగరాల ప్రజల దాహర్తి తీరనున్నది. సింగూరు ప్రాజేక్టు పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజేక్టులోనికి నిత్యం నాలుగు వేల క్యుసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. సింగూరులో ఈ వర్షాకాలంలో 3.78 టి.ఎం.సిల నీరు వచ్చి చేరింది.ఆగస్టు 20 వ తేదీ నుండి వర్షాలు కురియడంతో మంచినీటి ఎద్దడి తీరనున్నది. మెదక్‌ జిల్లా జహిరాబాద్‌,నారాయణఖైడ్‌, మనూర్‌, న్యాలకల్‌ ,పుల్కల్‌, మండలాల్లో కురిసిన వర్షాల వల్ల సింగూరు ప్రాజేక్టులోకి ఇన్‌ఫ్లో ఉంది. ప్రస్తుతం 12.26 టి.ఎం.సిల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం నిల్వ ఉన్న నీటితో హైదరాబాద్‌, మెదక్‌ జిల్లా వాసుల మంచి నీటి అవసరాలు తీరుస్తుందని నీటిపారుదల శాఖ సింగూరు ఇఇ శ్రవణ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. ఆలస్యంగా కురిసిన వర్షం మంచినీటి సమస్య దూరం చేస్తుంది.

బిల్లుకోసం పాఠశాలకు తాళంవేసిన కాంట్రాక్టర్‌


సంగారెడ్డి: కాంట్రాక్ట్‌ ఒప్పందం ప్రకారం బిల్లు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ పాఠశాలకు తాళంవేసిన ఘటన మెదక్‌ జిల్లా రామాయంపేట మండలం నిజాంపేట గ్రామంలో జరిగింది. గ్రామస్థుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నిజాంపేట ప్రాథమిక పాఠశాల నూతన భవన నిర్మాణం కోసం ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలను మంజూరు చేసింది. భవన నిర్మాణం కోసం సంజీవులు అనే కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించింది. అయితే ఆ కాంట్రాక్టర్‌ నిర్మాణరంగంలో ధరలు పెరగడంతో కాంట్రాక్టర్‌ సంజీవులు మొదటిబిల్లు తీసుకున్న తరువాత ఆ పనులను వదులుకున్నాడు . దాంతో ప్రభుత్వం మిగితా పనులు పూర్తి చేయడానికి మరో కాంట్రాక్టర్‌ నాగరాజుతో ఒప్పందం చేసుకొని నిర్మాణపనులు నిర్వహించాడు. భవన నిర్మాణం పూర్తి చేశాడు. అయితే బిల్లు మొత్తం విడుదల కాకపోయేసరికి పాఠశాలను విద్యాశాఖకు అప్పగించకుండా విద్యార్థులకు అప్పగించారు. ఇటీవల 80 వేల రూపాయల ఫైనల్‌ బిల్లు వచ్చింది. ఆ చెక్కు కోసం ఛైర్మన్‌, గ్రామసర్పంచ్‌ 25 వేల రూపాయల డిమాండ్‌ చేశారని కాంట్రాక్టర్‌ నాగరాజు ఆరోపించాడు. తనకు ఫైనల్‌ బిల్లు కోసం లంచం అడగడాన్ని నిరసిస్తూ, నాగరాజు పాఠశాలకు తాళం వేశాడు. ఈ విషయమై విద్యార్థుల తల్లిదండ్రులు అగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్‌ సత్యనారాయణ రామాయంపేట పోలీసులను అశ్రయించాడు. కాంట్రాక్టర్‌ బిల్లులో సర్పంచ్‌ లంచం అడిగాడనే ఆరోపణ జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసుల జోక్యంతో ఈ సమస్య పరిష్కారం కావాలని గ్రామస్థులు కోరుతున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్‌ శశిధర్‌, డి.ఇ.వో గోపాల్‌రెడ్డిలు స్పందించి చర్యలు తీసుకొని పాఠశాలను తెరిపించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

పోలీసుల స్వంత ఇంటి కల నిజం చేస్తాం


సంగారెడ్డి: రాష్ట్ర పోలీసు శాఖలో పని చేస్తున్న వారందరికి స్వంత ఇళ్ళు నిర్మాణం కోసం స్థలాలు కేటాయించవలిసిందిగా రాష్ట్ర హోంశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మెదక్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండలం పరిధిలో ఆదివారం సాయంత్రం ఆమె బేగంపేటలో నూతనంగా నిర్మించిన పోలీసుస్టేషన్‌ను ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అదేశాల మేరకు పోలీసులకు స్వంత ఇంటి కలను నిజం చేయాలని ఆమె మెదక్‌ జిల్లా పోలీసులకు తెలిపారు. మెదక్‌ జిల్లా కలెక్టర్‌ శశిధర్‌, జిల్లా మంత్రులు గీతారెడ్డి లు అమలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో పెద ప్రజలకు కల్పిస్తున్న సదుపాయాలను పోలీసులకు వర్తింపు చేస్తామని తెలిపారు. ప్రభుత్వం సంక్షేమము, శాంతి భద్రతలు సమ పాలలో పరిపాలించిన ప్రభుత్వాన్నే ప్రజలు మళ్ళి పట్టం కట్టారని మంత్రి అన్నారు. మెదక్‌ జిల్లాలో శాంతిభధ్రతలతో పాటు మావోయిస్టులు, ప్రమాదాలు ఇతర అదనపు భాద్యతలను దృష్టిలో ఉంచుకుంటానని ఆమె అన్నారు. ప్రతి పోలీసుస్టేషన్‌లో ఇద్దరు మహిళా కానిస్టేబుల నియామకం చేస్తానని ఆమె హమీ ఇచ్చారు. వైఎస్‌ హయాంలో రాష్ట్రంలో 35 వేల మంది పోలీసులను భర్తీ చేశామన్నారు. పోలీసుల సంక్షేమానికి పెద్ద పీటవేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని అన్ని పోలీసు క్వాటర్సు నిర్మాణంతో పాటు పాత క్వాటర్‌ల మరమ్మత్తులు చేయిస్తామని హోంమంత్రి తెలిపారు. పోలీసు శాఖ పట్ల ప్రత్యేక శ్రద్ద చూపి పెద్దపీట వేసిన ఫనత వైఎస్‌ కు దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ఇటీవల 60 మంది డిఎస్‌పిలను నియామకం చేస్తే 25 మహిళలు కావడం విశేషమన్నారు. యుపిఎ చైర్‌పర్సన్‌ సోనియాగాంధి కృషి పలితంగా మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించడం మహిళలపట్ల కాంగ్రెస్‌ పార్టీ నిదర్శనమన్నారు. ప్రభుత్వానికి కలెక్టర్‌, ఎస్పీలు రెండు కళ్లుని, ఇద్దరు పరస్పర సహకారంతో కృషిచేస్తే అబివృద్ది సాధ్యమవుతుందని అన్నారు. వర్గల్‌ మండలం నాచారం గుట్ట వద్ద పోలీస్‌ అవుటు పోస్టు ఏర్పాటు చేయనున్నట్లు హోం మంత్రి ప్రకటించారు. రాష్ట్ర సమాచార, పర్యాటక శాఖ మంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా నియోజకవర్గ అభివృద్ధి చేసినందువల్లనే జహిరాబాద్‌లో ప్రజలు తనను గెలిపించారని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో పోలీసుల పాత్ర మరువలేనిదన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే ముత్యంరెడ్డి మాట్లాడుతూ పట్టాణాలతో సహ పల్లెల అభివృద్ధి చేసేందుకు కృషి జరుగాలన్నారు. గజ్వేల్‌ ఎమ్మెల్యే నర్సారెడ్డి, జిల్లా ఎస్పీ కాంతారావు, డిఐజి మీనా, జడ్పీచైర్మన్‌ బాలయ్య, డిపిఆర్వో పవన్‌కుమార్‌, మెదక్‌ డిఎస్‌పి నళిని, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.

గుర్తు తెలియని యువతి శవం లభ్యం


సంగారెడ్డి: మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం నాగ్‌సానిపల్లి గ్రామ పంచాయతి పరిధిలోని ఎడుపాయల దుర్గాభవాని దేవస్థానం పరిధిలో సోమవారం సాయంత్రం గుర్తు తెలియని యువతి శవం లభ్యం అయిందని మెదక్‌ సర్కల్‌ ఇన్సుపెక్టర్‌ విజయ్‌ కుమార్‌ తెలిపారు . సుమారు 25 నుండి 30 సంవత్సరాల మధ్య ఉంటుందని తెలిపారు. మంజీర నదిలో కిట్టుకొచ్చి ఉండవచ్చునని భావిస్తున్నామని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మెదక్‌ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

గురుకుల పాఠశాల ముందు తల్లిదండ్రుల ధర్నా


సంగారెడ్డి: గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ బాలికల గురుకుల పాఠశాల వసతి గృహాంలో నెలకొన్న మంచినీటి సమస్య, ప్రహరీగోడ, విద్యుత్‌ ట్రాన్సుఫార్మర్‌, మరుగుదొడ్ల సమస్య ను వెంటనే పరిష్కరించాలని పెరేంట్సు కమిటి చైర్మన్‌ నర్సింహాగౌడ్‌ ఆద్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎపిఆర్‌ఎస్‌ ప్రిన్సిపాల్‌ రమణమ్మ మాట్లాడుతూ మంచినీటి విషయంలో జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. ఈ యెల 30 వరకు మెదక్‌ మున్సిపల్‌ కార్యాలయం నుండి మంచినీరు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తారని ఆమె తెలిపారు . ఇంగ్లీష్‌ టీచర్‌ లేనందున విద్యార్థులకు ఇబ్బందిగా ఉండేదని తెలిపారు. ఖాలిగా ఉన్న ఒక్క పోస్టు భర్తీ చేయాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో పేరెంట్స్‌ కమిటీ జనరల్‌ సెకరెటరీ శ్రీను, 80 మంది విద్యార్థుల తల్లితండ్రులు పాల్గొన్నారు.

మక్తల్‌లో గ్రామదర్శిని


సంగారెడ్డి: సంగారెడ్డి మండలం మక్తల్‌ గ్రామంలో శుక్రవారం నాడు గ్రామదర్శిని నిర్వహించారు. గ్రామంలో ఉన్న రేషన్‌ షాపులను తనిఖీ చేసారు. ఉపాధి హామీ పనుల అమలు గురించి అధికారులు సమీక్షించారు. పాఠశాలలను తనిఖీలు చేసారు. రెవెన్యూ సమస్యలపై గ్రామస్తులతో చర్చించి సమస్యలను పరిష్కరించారు. పహానీ, పౌతిల గురించి వచ్చిన సమస్యలపై విఆర్‌వోకు సూచన ఇచ్చారు. గ్రామదర్శిని ఎంపిడివో రాజాసింగ్‌, తహశీల్దార్‌ నగేష్‌, వ్యవసాయాధికారి విద్యాధికారి, హౌసింగ్‌ ఎఈ, ఈజిఎస్‌ అధికారులు పాల్గొన్నారు.