మోహన్ గాంధీ మొదటి అనుభవం


మోహన్ గాంధీ… ఈ పేరు వినగానే తెలుగు సినీ చరిత్రలో మనకు గుర్తొచ్చేది ఒక ‘కర్తవ్యం’, ఒక ‘మౌనపోరాటం’.. లాంటి సందేశాత్మక, సామాజిక ప్రయోజనాత్మక చిత్రాలతోపాటు ‘మంచి మనసులు’, ‘వారసుడొచ్చాడు’ లాంటి ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సెంటిమెంట్ సినిమాలు. మోహన్ గాంధీలోని దర్శకత్వ ప్రతిభను బాహ్య ప్రపంచానికి చాటిన ఆయా చిత్రాలు నేటికే కాదు… ఏనాటికీ చరిత్రలో మిగిలే ఉంటాయి. ఎంత ఎదిగినా ఒదిగినట్టే ఉండాలనే మోహన్ గాంధీ వ్యక్తిత్వం నేటి తరం దర్శకులకు ఎంతో అవసరం.

కేవలం తాను దర్శకత్వం వహించిన చిత్రాలను సూపర్‍ హిట్‍ చేయడమే కాకుండా విజయశాంతి లాంటి వారిని పరిశ్రమలో ఒక స్థాయిలో నిలిపిన ఘనత కూడా ఆయనది. ఇప్పటి వరకూ దాదాపు 40 సినిమాలకి పైగా దర్శకత్వం వహించిన మోహన్ గాంధీ కొన్ని కన్నడ సినిమాలకీ దర్శకుడిగా పనిచేశారు. మొదటిసినిమా అనుకోగానే ఒక్కసారిగా మనసు 30 సంవత్సరాలు వెనక్కి వెళ్లింది. చిత్రరంగంలో పనిచేసే వాళ్లకి మొదటి సినిమా అంటే .. ఒకటి కంటే ఎక్కువే ఉంటాయి, మొదటి సినిమాకి ఇచ్చే నిర్వచనాన్ని బట్టి. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజమే .. అంటే .. సినిమా రంగంలోకి ఏదో ఒక సినిమా తోటి ప్రవేశిస్తాం, మరో సినిమాతోటి మా రంగానికి చెందిన శాఖలో అడుగుపెడతాం .. ఇంకో సినిమా తోటి మా శాఖలో నిజమైన పేరు తెచ్చుకుంటాం. ఒక్కో కోణంలో ఇలా ఇవన్నీ మొదటి సినిమాలే అనిపిస్తాయి ..

నా విషయానికొస్తే ..

విజయవాడలో బి.ఎస్సీ ముగించుకుని కేరళలోని మణిపాల్‍లో ఇంజనీరింగ్ కోర్సులో చేరినా, ఆరోగ్యం దెబ్బతినడం వల్ల 4 నెలలు తిరక్కుండానే చదువుకి మధ్యలోనే స్వస్తి చెప్పి ‘బ్యాక్‍ టు హోమ్’ అవ్వాల్సి వచ్చింది. ఒక విశేషమేమిటంటే, మణిపాల్ వెళ్ళేటప్పుడల్లా మాకజిన్ వెంకటరత్నం నాకు తోడుగా నన్ను దిగబెట్టి వస్తుండేవాడు. ఆ ప్రయాణం మధ్యలో మద్రాసులో దాదాపు ఉదయంనుంచీ సాయంకాలం వరకూ ఉండాల్సి వచ్చేది. ఆ సమయంలో మా కజిన్ వెంకటరత్నానికి దూరపు బంధువూ, అంతకు మించి మంచి మిత్రుడూ, అప్పుడే తెలుగు చలన చిత్రరంగంలో హీరోగా ఎదుగుతున్న శోభ‌న్‌బాబు గారింటికి వెళ్ళేవాళ్ళం. ఆయన నాగురించి క్షేమ సమాచారాలు తెలుసుకుంటుండేవారు.

చదువు మానేసి విజయవాడ వచ్చేసాక మళ్ళీ ఆరోగ్యం కుదటపడడానికి ఏడెనిమిది నెలలు పట్టింది.

Advertisements

సక్సెస్ కోసం ఛార్మి గ్లామర్‌ పాట్లు


కథానాయిక ప్రాధాన్యతా చిత్రాలకు కొత్త ఒరవడి తెచ్చిన నాయిక చార్మి. కథానాయిక ప్రాధాన్యతా చిత్రాలకు కొత్త ఒరవడి తెచ్చిన నాయిక చార్మి. అనుకోకుండా ఒకరోజు, మంత్ర, మనోరమ ఇత్యాది చిత్రాలకు ఆమె అందం, అభినయమే ప్రధాన బలంగా నిలిచాయి. తదనంతరం ఇదే దారిలో కొందరు నాయికలు కూడా నడిచారంటే.. చార్మి ప్రభావం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. తారలందరూ గ్లామర్‌వైపు పరుగుపెడుతుంటే ఇలాంటి సినిమాలు చేయాలని, అభినయానికే పెద్ద పీట వేయాలని మీకెందుకు అనిపించింది అని చార్మిని అడిగితే.. గ్లామర్‌ పాత్రలు నేను చాలా చేశాను. చేస్తున్నాను కూడా.

అసలు నా దృష్టిలో గ్లామర్‌ పాత్రలు చేయడం కథానాయికల కెరీర్‌కు చాలా ముఖ్యం. కానీ ఏదైనా కొత్తగా చేయాలి అనిపించింది. ఆ సమయంలో గుణ్ణం గంగరాజుగారి ‘అనుకోకుండా ఒకరోజు’ సినిమా చేసే అవకాశం వచ్చింది. ఆ సినిమా నాకు ఓ కొత్త ఇమేజ్‌ తెచ్చిపెట్టింది. తర్వాత ‘మంత్ర’. ఆ సినిమా థ్రిల్లర్‌ చిత్రాల్లోనే ఓ ట్రెండ్‌ సెట్టర్‌ అయ్యింది. వాటి తర్వాత ‘మనోరమ’ చేశాను. వైవిధ్యమైన కథాంశాలతో రూపొందిన ఈ సినిమాలు నటిగా నాకు సంతృప్తినిచ్చాయి.

కానీ ఈ మధ్య గ్లామర్‌ పాత్రలకు దూరమవుతున్నానేమో అనే భావన కలుగుతోంది. అందుకే ఇక నుంచి ఆ దిశగా కాన్సన్‌ట్రేషన్‌ చేయాలను కుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు చార్మి. ఆమె కథానాయికగా రూపొందిన ‘సై ఆట’ సినిమా త్వరలో విడుదల కానుంది. ఇది కూడా హీరోయిన్‌ ఓరియంటెడ్‌ సినిమానే కావడం గమనార్హం. ‘మంగళ’ అనే మరో హార్రర్ సినిమాలో ఛార్మి నటిస్తోంది.

పమేలా డాన్స్‌ మంత్రం


‘బే వాచ్‌’ యాక్ట్రెస్‌ పమేలా ఆండర్సన్‌ ఇటీవల డాన్స్‌పై ప్రత్యేక శ్రద్ద కనబరుస్తోంది. తన బాయ్‌ఫ్రెండ్స్‌ అందరికీ దూరంగా ఉంటున్న ఈ అందాల తార ప్రతిరోజు డాన్స్‌ చేస్తుండడంతో తాను మరింత యాక్టివ్‌గా ఉండగల్గుతున్నానని చెబుతోంది. పలు హాలీవుడ్‌ సినిమాలతో పాటు టీవీ సీరియల్స్‌లో హాట్‌, హాట్‌గా కనిపించిన ఈ భామ ప్లేబాయ్‌ మ్యాగజైన్‌ కవర్‌ పేజీపై న్యూడ్‌గా కనిపించి వార్తల్లో నిలిచింది.

గ్లామర్‌ తార పమేలా ఆండర్సన్‌ నేడు ‘డాన్స్‌’ మంత్రాన్ని జపిస్తోంది. ‘డాన్సింగ్‌ విత్‌ ద స్టార్స్‌’ టాలెంట్‌ షోలో పాల్గొనడంతో తనకు డాన్స్‌పై ఆసక్తి పెరిగిందని ఆమె చెబుతోంది. ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉంటున్నానని ఇక ఎవరితోను కొత్త బంధాన్ని ఏర్పరచుకోవాలనుకోవడంలేదని ఈ భామ అంది. 42 సంవత్సరాల ఈ అందాలభామ ఇటీవల పలు టీవీ చానెల్స్‌లో తళుకులీనే ఔట్‌ఫిట్స్‌తో దర్శనమిచ్చి ప్రేక్షకులను మైమరపిస్తోంది. డాన్సింగ్‌తో తన బాడీ షేప్‌ పర్‌ఫెక్ట్‌గా మారుతోందని ఆమె తెలిపింది. ప్రస్తుతం జిమ్‌కు వెళ్లడానికి బదులుగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం డాన్సు ప్రాక్టీస్‌ చేయడంతో ఫిజికల్‌గా ఫిట్‌గా ఉంటున్నానని పమేలా వెల్లడించింది.

ఇక తన ఇద్దరు పిల్లలతో జీవితాన్ని హాయిగా గడుపుతున్నానని సంతోషంగా చెబుతోంది. ఈ అందాల తార దాదాపు రెండు దశాబ్దాలుగా గ్లామర్‌ రంగంలో వెలుగొందుతుండడం విశేషం. కొలంబియాలో 1967 జూలై ఒకటవ తేదీన జన్మించిన పమేలా డినైస్‌ ఆండర్సన్‌ కెనడియన్‌-అమెరికన్‌ యాక్ట్రెస్‌. ఆమె గ్లామర్‌ మోడల్‌గా, ప్రొడ్యూసర్‌గా, జంతు ప్రేమికురాలిగా, రచయితగా, షో గర్ల్‌గా నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచింది. టెలివిజన్‌ సీరియల్స్‌ బేవాచ్‌, హోమ్‌ ఇంప్రూవ్‌ మెంట్‌, వి.ఐ.పి.ల ద్వారా ఈ భామ మరింత పాపులారిటీ సంపాదించింది.

ఇక ప్లే బాయ్‌ మ్యాగజైన్‌ కవర్‌పేజీపై మొదటి సారిగా 1989లో కనిపించి యువకుల మతులు పోగొట్టింది. అమెరికన్‌, కెనడియన్‌ సిటిజన్‌షిప్‌ కలిగిన పమేలా నేడు ప్రపంచంలో ప్రముఖ సెలబ్రిటీగా పేరుగాంచింది. 1985లో గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన అనంతరం ఆమె వాంకోవర్‌ ప్రాంతానికి తరలివెళ్లి అక్కడ ఫిట్‌నెస్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసింది. ఇక 1989 సంవత్సరంలో ఆమె మోడలింగ్‌ రంగంలోకి అడుగిడిగింది. అదే సంవత్సరం పమేలా ప్లేబాయ్‌ మ్యాగజైన్‌ కవర్‌పేజీపై దర్శనమిచ్చింది.

శ్రీకాంత్ ‘రంగా ది దొంగ’ ప్రోగ్రెస్


వింత వింత దొంగతనాలతో.. ఎంత వారినైనా చిత్తు చేయడం రంగ స్పెషాలిటీ. అలాంటి ఈ దొంగగారి జీవితంలో అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటాయి. అదేంటో తెరపై చూస్తేనే మజా’ అంటున్నారు దర్శకుడు సుధాకర్‌ నాయుడు (జీవి). శ్రీకాంత్‌ కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రంగ ది దొంగ’.

ఈ సినిమా గురించి మాట్లాడుతూ జీవి పై విధంగా స్పందించారు. సీఆర్‌ మనోహర్‌, సుధాకర్‌ నాయుడు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విమలారామన్‌ ఇందులో కథానాయిక. నిర్మాత సీఆర్‌ మనోహర్‌ మాట్లాడుతూ – ”ఇందులో శ్రీకాంత్‌ పోషిస్తున్న దొంగ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఇక విమలారామన్‌ పాత్ర అయితే… చాలా వినోదాత్మకంగా ఉంటుంది. కొత్త ఒరవడిలో సాగే ఫక్తు మాస్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ‘మహాత్మ’ తర్వాత శ్రీకాంత్‌తో నేను చేస్తున్న చిత్రమిది. పాటలు, పోరాట సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఇటీవలే శ్రీకాంత్‌, విమలారామన్‌పై నిక్సన్‌ నృత్య దర్శకత్వంలో రామానాయుడు సినీ విలేజ్‌లో వేసిన భారీ సెట్‌లో ఓ పాట చిత్రీకరించాం. ప్రస్తుతం ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. ఈ నెల 25 వరకు ఈ షెడ్యూలు జరుగుతుంది. మూడో షెడ్యూలు మే నెలలో ఉంటుంది” అని తెలిపారు.

రమ్యకృష్ణ, భువనేశ్వరి, తస్లీమా, జయప్రకాశ్‌రెడ్డి, తెలంగాణ శకుంతల, శివాజీరాజా, డా.మోహన్‌, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చక్రి, కెమెరా: పూర్ణకాండ్రు, ఎడిటింగ్‌: గౌతంరాజు, ప్రొడక్షన్స్‌ ఎగ్జిక్యూటివ్‌: బందరు బాబి, ఆర్ట్‌: ఎం.బంగార్రాజు, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత : ఎం.ఎ.అజీమ్‌, నిర్మాణం: గోల్డెన్‌ లయన్‌ ఫిలింస్‌, గాడ్‌ఫాదర్‌ ఫిలింస్‌.

ఇలాగైతే చిత్రాలను ఆపేస్తాం : నిర్మాతలు


హైదరాబాద్‌: సుమారు 80 ఏళ్ల చరిత్ర కలిగిన తెలుగు సినీరంగం సంక్షోభం వైపు పరుగులిడుతోంది. నటులు తమ భారీ పారితోషికాలను తగ్గించుకునేంతవరకు చిత్రాల నిర్మాణం చేపట్టేది లేదని నిర్మాతల మండలి హెచ్చరించింది. నిర్మాణ వ్యయం దిగివచ్చేంతవరకు తాము సినీ షూటింగ్‌లను నిర్వహించేది లేదని ఏప్రిల్‌ 30 నజిరిగన మండలి సమావేశంలో సూచించింది.

తెలుగు చిత్ర పరిశ్రమలో ఏటా సుమారు 150 చిత్రాలు నిర్మితమవుతాయి. 95 శాతం సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడటంతో పరిశ్రమ విలవిలలాడుతోంది. దాంతో చిత్రకళాకారుల సమాఖ్య(మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌)కు మండలి తుది హెచ్చరిక (అల్టిమేటమ్‌) పంప వలసి వచ్చింది. సరైన కారణం లేకుండా చిత్ర దర్శకులు నటులు షూటింగ్‌ షెడ్యూల్స్‌ను సాగదీస్తుండటంతో తాము నిస్సహాయంగా ఉండిపోవలసి వస్తోందని నిర్మాతలు అంటున్నారు. అందువల్ల తమకు వడ్డీ భారం అధికమవుతోందని వారు చెబుతున్నారు.

”హాస్యనటులతో సహా అందరు కళాకారులు తమ పారితోషికం తగ్గించుకోవాలి. కొంతమంది హాస్యనటులు రోజుకు రూ.2-3 లక్షలు వసూలు చేస్తున్నారు. వారు రోజు కూలీలు కాదు. ఇతర నటులకు వలెనే వారికి నిర్ణీత పారితోషికం ఉండాలి. ఇందువల్ల నిర్మాతలకు భారీ నష్టం వస్తోంది. ఏ కారణం వల్ల అయినా షూటింగ్‌ రద్దు అయితే ఆ సొమ్ము నష్టం నిర్మాతకే.” అని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సంయుక్త కార్యదర్శి ఎన్‌.కుమార్‌ చెప్పారు.

కొన్ని అపరిష్కృత సమస్యలను పరిష్కరించుకునేందుకు ఒకటి రెండు రోజులలో సంయుక్త తనిఖీ కమిటీని ఏర్పాటు చేస్తామని మండలి అధికారి ఒకరు చెప్పారు. పారితోషికం మాత్రమే కాక వాహనాల వరుస శ్రేణి (కాన్వాయ్‌), విందుల ఖర్చు కూడా నిర్మాతల నెత్తి పైనే పడుతున్నాయి. చలన చిత్ర కళాకారుల సంఘం (మా) అధ్యక్షుడు మురళీమోహన్‌ మాట్లాడుతూ నిర్మాతల మండలి నుంచి, దర్శకుల మండలి నుంచి, కళాకారుల సంఘం నుంచి ఇద్దరేసి సభ్యులతో జాయింట్‌ స్క్రీనింగ్‌ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.

గత ఐదేళ్లలో చిత్ర నిర్మాణ వ్యయం రెట్టింపైంది. చిత్ర నిర్మాణంలో నిర్మాతల పాత్ర పరిమితం. అతడి పాత్ర పెట్టుబడి పెట్టటం వరకే. చిత్రం హీరో, డైరెక్టర్‌ అన్నీ నిర్ణయిస్తారు. నిర్మాతలు అనవసరపు ఖర్చులు చాలా భరించాల్సి ఉంటుంది. అని మోహన్‌ చెప్పారు. దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే రూ.700 కోట్ల తెలుగు చిత్ర పరిశ్రమ కూలిపోతుందన్నారు. కర్నాటక చిత్రపరిశ్రమను ఉదాహరణగా చూపిస్తూ అక్కడ చిత్రాల డబ్బింగ్‌ను నిషేధించారన్నారు. తెలుగు చిత్రపరిశ్రమలో కూడా అదే విధంగా చేయాలన్నారు.

రజనీకాంత్‌ నటించిన పలు చిత్రాలను తెలుగు లోనికి డబ్‌ చేసినపుడు పలు నేరు చిత్రాలను అధిగమించి విజయవంతమయ్యాయని దాంతో తెలుగు నిర్మాతలు నష్టపోయారని చెప్పారు. చిత్ర పరిశ్రమకు చెందిన ఒక పరిశీలకుడి అభిప్రాయం ప్రకారం ఇకపై అందరు నిర్మాతలు కొత్త సినిమా ప్రారంభించే ముందు తమ స్క్రిప్ట్‌ నివేదికను జాయింట్‌ స్క్రీనింగ్‌ కమిటీకి సమర్పించాల్సి ఉంటుంది. షూటింగ్‌ వివరాలు, ఆర్టిస్టుల వివరాలు వారి పారితోషికాలను కమిటీ పరిశీలిస్తుంది.

చిత్ర నిర్మాణ సమయంలో నటులకు పారితోషికంలో 20 శాతం మాత్రమే చెల్లించాలని నిర్మాణం పూర్తయిన తర్వాత 30 శాతం చెల్లించాలని, చిత్ర విడుదలకు ముందు మిగతా 50 శాతం చెల్లించాలని నిర్మాతల మండలి సూచించినట్లు మండలి సభ్యుడు ఒకరు చెప్పారు. ఇందువల్ల నిర్మాతకు వడ్డీ భారం తప్పుతుందన్నారు.

జీరో సైజులో సంజన సంతోషం!


”కన్నడ రంగానికి చెందిన ఏ తారకైనా ఆ కోరిక ఉంటుంది. నాకూ ఆ కోరిక ఉంది” అంటోంది బెంగళూరు బ్యూటీ సంజన. ఇంతకీ ఆ కోరిక ఏమిటీ అనుకుంటున్నారా? ఆ విషయానికే వస్తున్నాం. కన్నడ రంగంలో డాక్టర్ రాజ్‌కుమార్‌కి నటుడిగా ఓ విశిష్టమైన స్థానం ఉంది. పాత తరం నాయికలు ఎంతోమంది రాజ్‌కుమార్‌ సరసన జతకట్టారు. నేటి తరం నాయికల్లో చాలామంది రాజ్‌కుమార్‌ తనయుల సరసన సినిమా చేయడం తమ అదృష్టంగా భావిస్తారు.

అలా అనుకునే వారిలో సంజన ఒకరు. కన్నడ రాజ్‌కుమార్‌ తనయుడు శివరాజ్‌కుమార్‌ సరసన ఆమె ఓ చిత్రంలో నటిస్తున్నారు. దీని గురించి చెబుతూ ”కన్నడంలో రాజ్‌కుమార్‌గారిది చాలా పెద్ద ఫ్యామిలీ. ఆయన తనయుడి సరసన నటించాలనే నా కోరిక తీరడం ఆనందంగా ఉంది” అని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మడు. ఇంకో విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో కొత్త లుక్‌లో కనిపించి అలరించబోతున్నానంటూ సెలవిచ్చింది. ఈ మధ్యకాలంలో ‘జీరో సైజ్‌’ ట్రెండ్‌ నడుస్తోంది కదా.

బహుశా ఆ ట్రెండ్‌కి అనుగుణంగా ఉండాలనే ఉద్దేశంతో సంజన జీరో సైజ్‌కు మారినట్లుంది. ఈ కొత్త లుక్‌ అందరికీ నచ్చుతుందనే నమ్మకాన్ని వ్యక్తపరిచారామె. శివరాజ్‌కుమార్‌ సరసన చేస్తున్న సినిమా కాకుండా ఆమె రవీంద్ర దర్శకత్వంలో ఓ కన్నడ సినిమా చేస్తున్నారు. మలయాళంలో అంగీక రించిన చిత్రం షూటింగ్‌ జూన్‌లో ఆరంభం కానుంది. కేరళలో ఇది ఆమెకు తొలి చిత్రం. తెలుగులో కూడా అవకాశాలు ఉన్నాయని, అధికారికంగా ఒప్పందం కుదిరిన తర్వాత ఆ చిత్రాల గురించి చెబుతానని సంజనా అన్నారు.

సినీ వాణిజ్యంలో మనదే సింహభాగం!


భారతదేశంలో జరుగుతున్న మొత్తం సినీ వాణిజ్యంలో సింహభాగం దక్షిణాదిదే. ఈ నిజాన్ని అంగీకరించడానికి బాలీవుడ్ వాణిజ్య వర్గాలు అంగీకరించవేమో గానీ, వాస్తవంలో మాత్రం దీన్ని ఎవరూ కాదనలేరు. దేశంలోని మొత్తం సినీ పరిశ్రమ ఆదాయంలో నాలుగింట మూడొంతుల వాటా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలదే. 2008-09లో ఈ నాలుగు దక్షిణాది భాషా చిత్రాలు రూ.1,700కోట్ల పైగా ఆదాయం ఆర్జించాయి. సాధారణంగా దక్షిణాది చిత్రాల మొత్తం ఆదాయాల్లో తెలుగు, తమిళ సినిమాల వాటా చెరి 45శాతం, మలయాళం 8శాతం, కన్నడ చిత్రాల భాగం సుమారు 2శాతం వుంటోంది.

మొత్తం హిందీ చిత్ర పరిశ్రమ నిర్మించే చిత్రాల కన్నా తెలుగులో తయారయ్యే సినిమాలే అత్యధికం. ఎర్న్ స్ట్ అండ్ యంగ్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ), ఇండియన్ ఎంటర్ టైన్మెంట్ డౌన్ సౌత్ సంస్థలు కలిసి తయారుచేసిన నివేదిక ప్రకారం గత ఏడాది 230 తెలుగు సినిమాలు రిలీజయ్యాయి. ఇక దేశంలోని థియేటర్లలో సగభాగం దక్షిణాదిలోనే వున్నాయి.

దక్షిణాదిన సినిమాల నిర్మాణం స్ర్కిప్ట్ నుంచి స్ర్కీన్ దాకా ఓ క్రమశిక్షణతో సాగిపోతుంది. గడిచిన అయిదేళ్ళుగా దక్షినాది చిత్రాలు ఓ రకంగా భారతీయ ఫిల్మ్ ఇండస్ట్రీని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. లేటెస్ట్ టెక్నాలజీలు, యానిమేషన్, స్పెషల్ ఎఫెక్ట్ లు ఉపయోగించుకోవడంలోనూ సౌత్ సినీ ఇండస్ట్రీ ముందుంటోంది.

ఆస్కార్ను అందుకున్న ఎ.ఆర్.రెహమన్, రసూల్ పొకుట్టి కూడా దక్షిణాది వారే. సౌత్ సినిమాలంటే రజనీకాంత్ స్టయిల్స్, క్విక్ గన్ మురుగన్ తరహా పాత్రలేనని మిగతా ప్రాంతాల వారు అనుకున్నా బాక్సాఫీసు దగ్గర కాసులు రాబట్టుకోవడంలో ఈ చిత్రాలే ముందుంటున్నాయి.

సినిమా విడుదల హక్కులను పరిశ్రమ గట్టిగా నియంత్రించడం దక్షిణాది చిత్రాల విజయంలో ప్రధాన పాత్ర పోషిస్తోందని ఎర్న్ స్ట్ అండ్ యంగ్ కి చెందిన ఫారుఖ్ బర్సాలా అభిప్రాయపడ్డారు. పైరసీ సంగతి పక్కనపెడితే సినిమా విడుదలైన ఏడాది దాకా టీవీల్లో ప్రసారం కాకుండా జాగ్రత్త పడతాయి కాబట్టి థియేటర్ల కలెక్షన్లు ఎక్కువగా వుంటాయని ఆయన విశ్లేషించారు.

2008-09లో వచ్చిన రూ.1,700కోట్ల ఆదాయంలో రూ.1,300కోట్లు దేశీయంగా థియేటర్ల కలెక్షన్ల ద్వారానే రావడం దీనికి ఊతమిస్తోంది. దక్షిణాది పరిశ్రమ వ్యాపార ధోరణిని కూడా మార్చుకుంది. కోటి, రెండు, మూడు కోట్ల బడ్జెట్ సినిమాలనుంచి ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తోంది. ఈ ప్రభావం కలెక్షన్లమీద కూడా కనిపిస్తోంది. రూ.7కోట్లపైగా బడ్జెట్ తో తీసిన సినిమాలపై ఆదాయం గతంలో 45శాతం దాకా వుండగా, ప్రస్తుతం 65శాతం వుంటోంది. దేశంలోని మిగతా ప్రాంతాల్లో పంపిణీ తక్కువే అయినా, ఈ సినిమాలు దక్షిణాదిలోని పొరుగు రాష్ట్రాల్లో కూడా మంచి కలెక్షన్లనే సాధించుకోగలుగుతున్నాయి.

తమిళ సినిమాల ఆదాయంలో నాలుగోవంతు పొరుగు రాష్ట్రాల నుంచే వుంటోంది.

దక్షిణాది సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి ఆదరణ దక్కించుకోగలిగే సామర్థ్యం వుందని బల్సారా చెప్పారు. అయితే, థియేటర్ కలెక్షన్ల విషయంలో పారదర్శకత లేకపోవడం, తరచూ టికెట్ ధరలు పెంచడం అడ్డంకులని ఆయన అభిప్రాయపడ్డారు. సెన్సార్ బోర్డు ఆమోదం పొందిన తర్వాత కూడా వివిధ కారణాల వల్ల 35శాతం సినిమాలు విడుదల కావన్నారు. దీనికితోడు తారల పారితోషికం ఆకాశాన్నంటుతుండడంతో బడ్జెట్ లు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.

పి.టి.నాయుడు.