రైతు దిగుబడి పెంచడమే యాత్రల లక్ష్యం


విజయనగరం: దిగుబడి, ఇతర ఆదాయ మార్గాల ద్వారా రైతు ఆదాయాన్ని పెంచేందుకు రైతు చైతన్య యాత్రలు చేపట్టామని విజయనగరం జిల్లా కలక్టర్ జి.రామనారాయణరెడ్డి అన్నారు. సోమవారం ఉదయం కలక్టరు క్యాంప్‌ కార్యాలయం వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు చైతన్య యాత్ర జీపును కలక్టర్ ప్రారంభించారు. మే 17 నుంచి జూన్‌ 2వ తేది వరకు జిల్లాలో రోజుకి రెండు, మూడు పంచాయితీల్లో రైతు చైతన్య యాత్ర నిర్వహించడం జరుగుతుందన్నారు.

రైతు చైతన్య యాత్రలు ప్రతీ రోజు ఉదయం 8 గంటల నుంచి 10.30 గంటల వరకు మరల 11 గంటల నుండి 1 గంట వరకు గ్రామ పంచాయితీల్లో నిర్వహిస్తారన్నారు. మే, జూన్‌ నెలల్లో రైతులకు ఖరీఫ్‌ సీజన్‌ నందు పంటల దిగుబడి, అభివృద్ది పెంచేందుకు ఆధునిక విషయాలు, రైతులకు అవగాహన కల్పించేందుకు రైతు చైతన్య యాత్రలు దోహదపడతాయన్నారు. వ్యవసాయ శాఖ మాత్రమే కాకుండా వ్యవసాయ అనుబంధ శాఖలు ఉద్యాన, పశుసంవర్థక, పట్టు పరిశ్రమలు, మత్య్సశాఖ, మార్కింటింగ్‌, ఎ.పి.సీడ్సు, ఇరిగేషన్‌, షుగర్సు, జలయాజమాన్య సంస్థ, ఐ.కె.పి., ఎ.పి.యం .ఐ.పి., వ్యవసాయ పరిశోధనా శాస్త్రవేత్తలు, ఉపాధి హామీ, ఆగ్రోస్‌, పంచాయితీరాజ్‌, ట్రాన్సుకో,అటవీ శాఖ, వ్యవసాయ రీసెర్స్‌ సెంటరు వంటి శాఖలు అన్నియును రైతు చైతన్య యాత్రలో పాల్గొంటాయని ఆయా శాఖల ద్వారా రైతులకు అనుబంద శాఖల ద్వారా సూచనలు, సలహాలు అందజేస్తారన్నారు.

ఆధునిక వ్యవసాయ ద్వారా అధిక దిగుబడులు పెంచే దశగా కొత్త వ్యవసాయ దారులకు ఋణాలు కల్పన, కౌవుల భూము దారులకు జాయింట్‌ లైయబులిటితో ఋణాలు అందజేయటం వంటి విషయాలపై అవగాహన కల్పించడం ముఖ్యోద్దేశ్యమన్నారు. గ్రామీణ ప్రాంతాల రైతుల ఆదాయాల వృద్ది చేసేందుకు, రైతు చైతన్య యాత్రలతో యితర ఆదాయ మార్గాలు అవలంబనతో దిగుబడులు పెంచడం ప్రతీ గ్రామంలో అవగాహన కల్పించాలన్నారు. అన్ని శాఖల సమన్యయంతో రైతు చైతన్య యాత్రలు కార్యక్రమం చేపట్టడమైనదని కలక్టరు అన్నారు.

అనుబంద శాఖలు కరపత్రములు, గోడపత్రికలు రైతులకు తెలిసే విధంగా ముద్రించడమైనదని అన్ని పంచాయితీలకు సరఫరా చేస్తున్నామన్నారు. అనంతరం వ్యవసాయ సమాచారం, సలహాలు అందించేందుకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు టోల్‌ ఫ్రీ నెంబరు 1551/ 1100 కూడ ఏర్పాటు చేయడమైనదని దీనికి సంబంధించి స్టిక్కర్లను కూడ కలక్టరు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టరు అశోక పురోహిత్‌, పశుసంవర్థక శాఖ జాయింట్‌ డైరెక్టరు సయ్యద్‌ అబ్దుల్‌ వాసీ, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు లక్ష్మణరావు, ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు పి.ఎన్‌.వి. లక్ష్మీనారాయణ, పశుసంవర్థక శాఖ సహాయ సంచాలకులు డా. ఎన్‌. కోటేశ్వరరావు, ఉపాధి హామీ పధకం అదనపు ప్రోగ్రాం అధికారి ఒ. రంగరావు, ఎ.పి. సీడ్స్‌ కార్పొరేషన్‌, ఆగ్రోస్‌, మార్కిటింగ్‌ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisements

వైఎస్‌ మృతికి పలువురి సంతాపం


విజయనగరం: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి అకాల మరణాన్ని చింతిస్తూ పలు సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, పట్టణంలో ఘనంగా సంతాప సభలునిర్వహించాయి. అదే విధంగా అన్నదాన కార్యక్రమాలు, వైఎస్‌, జ్ఞాపకార్థం రక్తదాన శిబిరాలు జరిగాయి.
12వ వార్డులో వైఎస్‌ సంతాప సభ: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సంతాపసభ మంగళవారం ఉదయం స్థానిక 12వ వార్డులో జరిగింది. ఈ సందర్భంగా 12వ వార్డుకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు వైఎస్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. అనంతరం సుమారు మూడు వేల మందికి పై పేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో 12వ వార్డు అధ్యక్షులు వంకర గురుమూర్తి, వార్డు కౌన్సిలర్‌ యర్రం శెట్టి సునీత, మాజీ కౌన్సిలర్లు బట్టాన సూరిబాబు, గొర్లె నారాయణ, వార్డు నాయకులు యర్రం శెట్టి రమణ, దేవదాస్‌, యూత్‌ అధ్యక్షులు వంకర అప్పలపైడి తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌టియు ఆధ్వర్యంలో : బలహీన వర్గాల ఆశాదీపం, ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, కర్షకులకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి మృతి తీరని లోటని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ (ఎస్‌టియు) జిల్లా ప్రధాన కార్యదర్శి పతివాడ నారాయణరావు అన్నారు. ఇక్కడి అమర్‌భవన్‌లో ఏర్పాటైన వైఎస్‌ సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజశేఖరరెడ్డి సేవలు మరువరానివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్‌టియు జిల్లా అధ్యక్షుడు కె.జోగారావు, ఎస్‌.టియు రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.అప్పలరాజు, వి.కృష్ణారావు, ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా సహకార మార్కెటింగ్‌ సంఘ కార్యాలయంలో : జిల్లా సహకార మార్కెటింగ్‌ సంఘ ప్రధాన కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సంతాప సభ జిల్లా మార్కెటింగ్‌ సంఘ అధ్యక్షుడు కె.వి.సూర్యనారాయణరాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సభలో సంఘ బిజినెస్‌ మేనేజర్‌ ఎ.విజయకుమార్‌, ఆఫీస్‌ మేనేజర్‌ వి.శ్రీనివాసరావుతో పాటు సిబ్బంది, సంఘ ప్రిన్సిపాల్‌ సప్లయర్స్‌, లీజుదారులు, ఇతర ప్రముఖులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.
కెనరా బ్యాంకు ఆవరణలో : జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సంఘం ఆధ్వర్యంలో స్థానిక కెనరాబ్యాంకు ఆవరణలో పేదల పెన్నిది దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌. రాజశేఖరరెడ్డి సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని బ్యాంకుల ఉద్యోగులు పాల్గొని వైఎస్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, నల్లబ్యాడ్జీలు ధరించి మౌనం పాటించారు. అనంతరం వైఎస్‌ ఆకస్మిక మృతికి చింతిస్తూ ఆయన పేదలకు చేసిన సేవలను ఘనంగా కొనియాడారు. కెనరాబ్యాంక్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో సాలూరు దగ్గరలో గల లక్ష్మీపురంలో గత వృద్ధాశ్రమానికి కుర్చీలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎంసిహెచ్‌ గుప్తా, ప్రధాన కార్యదర్శి కృష్ణారావు, కెనరాబ్యాంకు సీనియర్‌ మేనేజర్‌ వేణుగోపాల్‌, రామునాయుడు, నారాయణరావు, శ్రీనివాసరావు, శంకరరావు, బాలు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రాస్పత్రిలో : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జ్ఞాపకార్థం వివిధ స్వచ్ఛంద సంస్థలు మంగళవారం ఉదయం జిల్లా కేంద్రాస్పత్రిలో మెగా బ్లడ్‌క్యాంప్‌ నిర్వహించాయి. చెంత చేరి ఓదార్చే ఒక చెయ్యి కనుమరుగు కావడం రాష్ట్ర ప్రజలకు తీరని లోటని పలు సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలనే తపనతోనే బ్రహత్త కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు పేర్కొన్నారు. ఏటా 80 లక్షల యూనిట్లు రక్తం అవసరం కాగా, కేవలం 30 లక్షల యూనిట్ల రక్తం మాత్రమే లభిస్తుందని మిగతా లోటు భర్తీ చేసేందుకు ప్రతి ఒక్కరూ రక్తదాన కార్యక్రమాలను నిరంతర ప్రక్రియగా చేపట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విశాల హృదయ యువజన సేవా సంఘ అధ్యక్షులు అబ్దుల్‌ రవూఫ్‌, జన విజ్ఞాన వేదిక కన్వీనర్‌ ఎవిఎన్‌ వెంకటరావు, పంచాయితీ రాజ్‌ ఛాంబర్‌ చైర్మన్‌ మామిడి అప్పలనాయుడు, మాల మహానాడు అధ్యక్షుడు ఆదాడ మోహనరావు, స్పార్క్స్‌ ప్రతినిధి పద్మనాభం, రాంకి ఫౌండేషన్‌ అధినేత ఆర్‌ఆర్‌కె రావు ఆశ్రమ ఫౌండేషన్‌ అధినేత రామకృష్ణారావు, బ్లడ్‌బ్యాంక్‌ డాక్టర్‌ సత్యశ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

9న ప్రెస్‌క్లబ్‌లో వై.ఎస్‌. సంతాప సభ


విజయనగరం: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి సంతాప సభ ఈనెల 9వ తేదీ ఉదయం 9 గంటలకు ఇక్కడి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం (ఎపియుడబ్ల్యుజె) జిల్లా శాఖ ప్రధానకార్యదర్శి పి.ఎస్‌.ఎస్‌.వి.ప్రసాద్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి సీనియర్‌ పాత్రికేయులు, ప్రెస్‌ అకాడమీ సభ్యులు డి.అచ్చుతరావు హాజరుకానున్నట్లు చెప్పారు. ఈ సంతాప సభకు ప్రింట్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియాకు చెందిన ప్రతినిధులు హాజరుకావాలని ఆయన పేర్కొన్నారు.

10 నుంచి బస్సుపాసుల రెన్యువల్స్‌


విజయనగరం: వివిధ మండలాల పరిధిలో గల విద్యా సంస్థలలో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతినెలా 8898 రాయితీ పాసులు, 5041 ఉచిత పాసులు ఇవ్వడం జరుగుతుందని విజయనగరం డిపో అసిస్టెంట్‌ మేనేజర్‌ ఎన్‌.వి.ఎస్‌.వేణుగోపాల్‌, డిపో మేనేజర్‌ టి.వి.ఎస్‌ సుధాకర్‌లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఈనెల 9లోగా ఉచిత పాసులు పొందాలన్నారు. ప్రభుత్వ సెలవులతో సంబంధం లేకుండా ఈనెల 10 నుంచి 17వ తేదీవరకు విజయనగరంలో రెండు కౌంటర్లలో బస్సు పాలు రెన్యువల్స్‌ జరుగుతాయన్నారు. సాధ్యమైనంతవరకు ఆయా కళాశాలల వద్దనే పది రూపాయల అదనపు రుసుంతో రెన్యువల్స్‌ జరుగుతుందన్నారు. కొత్తగా బస్సుపాసులు పొందాలనుకున్న వారికి మంగళవారం నుంచే దరఖాస్తుల విక్రయం ప్రారంభమైంది.

ఈనెల 21న బాలల హక్కుల అవగాహన యాత్ర


విజయనగరం: బాలల హక్కుల యాత్రకు సంబంధించి ఈనెల 10న బాలాజీ మార్కెట్‌ ఎదురుగా నెహ్రూ యువకేంద్రం దగ్గర ఉన్నసేవాంజలి కార్యాలయంలో నిరుద్యోగ యువతకు శిక్షణ, జిల్లా వ్యాప్తంగా ఈనెల 21న బాలల హక్కుల అవగాహన యాత్ర జరుగుతుందని సేవాంజలి డైరెక్టర్‌ జి.ప్రసాదరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలకు 9440867326 నెంబర్‌ను సంప్రదించవచ్చునన్నారు.

జడ్పీ ఉప ఎన్నికల పోలింగ్‌ 16న


విజయనగరం: జిల్లాలో జరగనున్న జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజక వర్గాలు, మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజక వర్గం ఎన్నికలు ముందుగా ప్రకటించిన విధంగా సెప్టెంబర్‌ 8వ తేదీన కాకుండా సెప్టెంబర్‌ 16వ తేదీన జరుగుతాయని విజయనగరం జిల్లా ఎన్నికల అధారిటి అధికారి మహ్మద్‌ ఇక్భాల్‌ హుస్సేన్‌ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుగా ప్రకటించే విధంగా జిల్లాలోని డెంకాక, దత్తిరాజేరు, జియ్యమ్మవలస జడ్పీటీసీ స్థానాలకు, ఎల్‌.కోట మండలం కాసాపేట ఎంపిటిసి స్థానానికి సెప్టెంబర్‌ 8వ తేదీన పోలింగ్‌, సెప్టెంబర్‌ 11వ తేదీన ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉందని, ముఖ్యమంత్రి ఆకస్మిక మరణం వలనను, 7 రోజుల పాటు సంతాప దినాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి ఉన్నందున పలువురు చేసిన అభ్యర్థన మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం వారు ఎన్నికల తేదీలను మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని తెలిపారు. సదరు ఉత్తర్వులలో తెలియజేసిన ప్రకారం తెలిపిన 3 జడ్పీటీసీ స్థానాలకు, 1 ఎంపిటిసి స్థానానికి సెప్టెంబర్‌ 16న పోలింగ్‌ జరుగుతుందన్నారు. పోలింగ్‌ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటలవరకు జరుగుతుందని, ఓట్ల లెక్కింపు8 ఈనెల 19వ తేదీనే జరుగుతుందన్నారు.

8న మెగాబ్లడ్‌ బ్యాంక్‌


విజయనగరం: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి జ్ఞాపకార్థం ఈనెల 8న జిల్లా కేంద్రాస్పత్రిలో బ్లడ్‌ క్యాంపు నిర్వహించనున్నట్లు వివిధ స్వచ్ఛంధ సంస్థల నాయకులు అబ్దుల్‌ రవూఫ్‌, పివి పద్మనాభం, ఎంవిఎన్‌ వెంకటరావు, ఆర్‌ఆర్‌కె రావు, ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఏటా 80లక్షల యూనిట్ల రక్తం అవసరానికి కేవలం 30 లక్షల యూనిట్లు రక్తం మాత్రమే లభిస్తుందని, ప్రతిఒక్కరూ రక్తదానం నిరంతర పక్రియగా చేపట్టాలని పిలుపునిచ్చారు.