సెప్టెంబర్‌ 14న ఇంటర్మిడియట్‌ పరీక్షా ఫీజు తుది గడువు


మెదక్‌: ఇంటర్మిడియెట్‌ పరిక్ష ఫీజు సెప్టెంబర్‌ 14 వ తేది లోగా చెల్లించాలని ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి అబ్దుల్‌ బాసిత్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 2010లో జరిగే ఇంటర్మిడియట్‌ మినహయింపు పోందిన ప్రయివేటు విద్యార్థులు, గ్రూపు మార్చుకొన్న విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించుటకుఅఖరు తేదీ సెప్టెంబరు 14, 2009 లోగా చెల్లించాలని తెలిపారు. అపరాధ రుసుము వంద రూపాయలతో సెప్టెంబర్‌ 24 ,2009 లోగా చెల్లించాలని ఆయన తెలిపారు. పరీక్ష ధరఖాస్తూ ఫారం ఖరీదు 10 రూపాయలు చెల్లించి పోందవలెనని ఆయన పేర్కోన్నారు. జనరల్‌ కోర్సులకు రూ.210.లు, ఓకేషనల్‌ కోర్సుల విద్యార్థులకు రూ 310లు, బ్రిడ్జికోర్సు ఓకేషనల్‌ విద్యార్థులు రూ 60లు, ఓకేషనల్‌ బ్యాక్‌లాగ్‌ విద్యార్థులకు రూ100లు, బ్రిడ్జికోర్సు మ్యాథమెటిక్స్‌, బై.పి.సి. విద్యార్థులకు రూ60లు చెల్లించాల్సి ఉంటుందని ఇంటర్మీడియెట్‌ బోర్డుప్రాంతీయ పర్యవేక్షణాధికారి అబ్దుల్‌ బాసిత్‌ తెలిపారు. ఆర్ట్స్‌ ప్రైవేట్‌ విద్యార్థులు పరీక్ష ఫీజు డి.డిలను స్క్రూటిని చేయాలన్నారు. సంతృప్తి పోందిన పిదప ప్రభుత్వ జూనియర్‌ కాలేజు ప్రిన్సిపల్స్‌ వాటిని స్వికరించి
మాన్యు స్క్రిప్ట్‌నామినల్‌ రోల్‌ ఓమర్‌ ఐసిఆర్‌తో కలిపి పంపాల్సిందిగా ఆయన కోరారు. అర్హతలేని విద్యార్థులు
పరీక్ష ఫీజు చెల్లించినా తిరిగి ఇవ్వబడదన్నారు. అట్టి రూపాయలను సర్దుబాటు చేయరాదని తెలియజేశారు.
రాష్ట్రేతర బోర్డులనుంచి యస్‌. యస్‌ .సి లేదా తత్సమానం పాసైన విద్యార్థుల ఎలిజిబిటి సర్టిఫికేట్‌ను హైదరాబాద్‌ లోని ఇంటర్మీడియట్‌ బోర్డు నుంచి అనుమతి పోందిన ప్రతిని జత చేయవలేనని ఆయన తెలిపారు. ప్రైవేటు విద్యార్థులంతా రెగ్యూలర్‌ విద్యార్థులతో సమానంగా అదే సిలబస్‌లో పరీక్షలు వ్రాయాల్సివుంటుందని ఆయన తెలిపారు. మార్చి2010 నాటి సిలబస్‌ ప్రిస్‌క్రైబ్‌ చేయబడింది. అదే సిలబస్‌ ప్రైవేటు విద్యార్థులకు కూడా వర్తింస్తుందన్నారు.

Advertisements

గిడ్డంగులలో రైతులు ధాన్యం అమ్మాలి


మెదక్‌: మెదక్‌ సెంట్రల్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌లో ఏర్పాటు చేయనున్న ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే రైతులు ధాన్యం అమ్మాలని సి.డబ్ల్యూసి. రీజనల్‌ మేనేజర్‌ ఎస్‌.సి.ఎస్‌్‌.రావు అన్నారు. ఎంపిపి సమావేశ హల్‌లో ఏర్పాటు చేసిన రైతుల అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం మెదక్‌ గోదాంలో నవంబర్‌ నెలలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించనున్నామని తెలిపారు. రైతులు తొందరపడి రైస్‌మిల్లర్లకు ధాన్యాన్ని అమ్మవద్దని కోరారు. గత 50 సంవత్సరాలుగా జాతీయ భద్రత ఆహార విషయంలో ముఖ్య భూమిక పోషిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా మేనేజర్‌ విజయపాల్‌ తదితరులు పాల్గోన్నారు.

జనశక్తినేత అమర్‌ అరెస్టు, విడుదల


మెదక్‌: కామ్రేడ్‌ సుభాష్‌ నివాళులర్పించేందుకు మెదక్‌ జిల్లాకు వచ్చిన జనశక్తినేత అమర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనుమతి లేకుండా సభను నిర్వహిస్తున్నారంటూ అడ్డుకున్నారు. అనంతరం స్వంత పూచికత్తును అమర్‌ను విడుదల చేశారు.

వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌లో పేలుడు


మెదక్‌: మెదక్‌ జిల్లాలోని వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌లో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి సెంట్రీ రూం కూలడంతో గదిని శుభ్రం చేస్తున్న గ్రామ సేవకుడు బాలయ్య మృతి చెందాడు. స్టోర్‌ రూం కాలిబూడిదయింది. ఈ ప్రమాదం నుంచి ఎస్‌ఐ, మరో కానిస్టేబుల్‌ తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.