హోంమంత్రిని కలిసిన సాంబశివుడు


హైదరాబాద్‌: మావోయిస్టు మాజీ నేత సాంబశివుడు ఈరోజు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిశారు. ఈనెల 25న తాను నల్గొండ జిల్లా భువనగిరిలో నిర్వహించ తలపెట్టిన తెలంగాణ సాధన యాత్ర, బహిరంగసభకు అనుమతి ఇవ్వాలని ఆయన మంత్రిని కోరారు. సభ అనంతరం మహబూబ్‌నగర్‌ వరకు యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. తన యాత్రకు ప్రభుత్వం అడ్డంకులు కలిగిస్తోందని అయినా తాను అనుమతికోసం మానవహక్కుల సంఘాన్ని, కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు.

Advertisements

పెరగనున్న ఆసుపత్రి సామర్థ్యం: దానం


నల్గొండ: అభివృద్ధి చెందుతున్న హుజుర్‌నగర్‌ పట్టణంలో ఇక ప్రభుత్వ వైద్య సేవలకు ఢోకా లేదు. ఇప్పుడు 50 పడకలతో రోగులకు వైద్య సేవలందుతుండగా, త్వరలో 100 పడకల స్థాయికి పెరగనుంది. చాలా ఏళ్ల నుంచి ఆసుపత్రి సామర్ధ్యానికి పెంచాలని స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. అయితే ఏ ప్రజాప్రతినిధి కూడా పట్టించుకోకపోవడంతో పరిస్థితి అలాగే ఉంది. హుజుర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంగా మారడం, ఎమ్మెల్యేగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎన్నికకావడంతో ఆయన ఆసుపత్రిపై దృష్టి సారించారు. ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకు ఆసుపత్రిని సందర్శించి రోగుల సమస్యలను తెలుసుకున్నారు. ఇక్కడ నెలకొన్న ఇబ్బందులను అధికారులు, వైద్యుల నుంచి ఆరా తీశారు. సమస్యలను ఆకళింపు చేసుకున్న ఆయన ఈనెల 8న వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దానం నాగేందర్‌ను పట్టణానికి రప్పించి ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను స్వయంగా చూపించారు.

లక్షల కుచ్చుటోపి


నల్గొండ: నల్గొండ పట్టణం శరవేగంగా విస్తరిస్తోంది. ఐటి పార్కు, యూనివ ర్సిటీ, కొత్త పరిశ్రమలు వస్తుండడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో చుట్టు పక్కల ఉన్న వ్యవసాయ భూములన్నీ ప్లాట్లుగా మారుతున్నాయి. కొన్ని చోట్ల వెంచర్ల పేరుతో ఇప్పటికే నిర్మాణాలు ఊపందుకున్నాయి. పెరుగుతున్న పట్టణ పరిధి మాట అటుంచితే… అను మతి లేకుండా నిర్మాణాలు, నిబంధనలు పాటించకుండా వ్యవసాయ భూములను ప్లాట్లుగా మారుస్తున్నారనే ఆరోపణలున్నాయి. పట్టించుకోవాల్సిన పాలకవర్గం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవ హరిస్తోందని ప్రజలు పేర్కొంటున్నారు. వెంచర్‌ చేస్తున్న వ్యాపారులు లే-అవుట్‌ లేకుండానే, మౌలిక సదుపాయాలు కల్పించకుండానే ప్లాట్లను విక్రయిస్తున్నారు. మున్సిపాలిటీకి చెల్లించా ల్సిన లక్షలాది రూపాయల పన్నులను ఎగనామం పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

నల్గొండలో రోజురోజుకు పెరుగుతున్న జనాభాతో పాటు నివాసిత ప్రాంత విస్తీ ర్ణం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు వలస వచ్చే ప్రజలకు కూడా నివాసిత స్థలం అవసరమవుతుంది. ఈ కారణాల దృష్ట్యా రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు ఇక్కడ పాగా వేశారు. వ్యాపారం చేసేందుకు పంట పోలాలను కొనుగోలు చేస్తున్నారు. ప్లాట్లుగా విభజించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కానీ గ్రామాల్లో మాదిరిగానే పట్టణాల్లో కూడా స్వేచ్చగా ఇళ్ళను నిర్మించుకోవచ్చననే ఉద్దేశ్యంతోనే ఎక్కువ మంది ఉన్నారు. కానీ మున్సి పాలిటీల్లో భూమిని ప్లాట్లుగా విభజించాలన్నా…

ఇళ్ళు నిర్మించుకోవాలన్నా అధి కారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఇవేమి వ్యాపారులు పట్టించు కోవడం లేదు. నల్గొండ పట్టణం నుండి హైదరాబాద్‌ రహదారి పక్కన ఉన్న పంట పోలాలు, మిర్యాలగూడ వెళ్లే రహదారిలో ఉన్న పంటపోలాలు మరికొన్ని చోట్ల పంట పోలాలను ప్లాట్లుగా విభజించారు. పంట పోలం స్థలాన్ని నివాసిత స్థలం గా మార్చేందుకు మున్సిపాలిటీకి పన్ను చెల్లించాల్సి ఉంది. అంతేకాక రెండున్నర ఎకరాల వరకు నల్గొండ టౌన్‌ప్లానింగ్‌ రిజనల్‌ డిప్యూటీ డైరక్టర్‌ అనుమతిస్తారు. రెండున్నర ఏకరాలకు మించితే హైదరాబాద్‌లోని టౌన్‌ ప్లానింగ్‌ డైరక్టర్‌ నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంది. దీనికి మున్సిపాలిటీ నుండి ఫైలు పంపించాల్సి ఉంది. లేఔట్‌ అనుమతి పొందటానికి ముందే మౌళిక సదుపాయాలు కల్పిం చాల్సి ఉంది.

మొత్తం స్థలంలో 10 శాతం స్థలాన్ని కమ్యూనిటీ స్థలంగా విడగొ ట్టాలి. ఆస్థలంలో పాఠశాలలకుగానీ, కళ్యాణమండపాకుగానీ, కమ్యూనిటీహాళ్ళ నుగాని నిర్మించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ స్థలం అందరి సోత్తులో (మున్సిపాలిటీ కింద) ఉంటుంది. 40 అడుగుల వెడల్పులో రోడ్లను నిర్మించాలి. మురికి కాలువలను తవ్వించాలి. విద్యుత్తులైన్లను ఏర్పాటు చేయాలి. ఈ జాగ్రత ్తలన్నీ తీసుకున్న తర్వాత మాత్రమే ప్లాట్లను విక్రయించాల్సి ఉంది. ఇవేవి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు పట్టించుకోరు. అధికారులకు అంత కన్నా నిద్రవ్యవస్థలో ఉన్నారు.

ప్రస్తుతం అనధికారికంగా సుమారు 80 ఎకరాలల్లో ప్లాట్లను వి్ర యిస్తున్నట్లు సమాచారం. ఈ 80 ఎకరాలకు 10 శాతం చోప్పున 8 ఎకరాల స్థలాన్ని మున్సిపాలిటీకి అప్పగించాల్సి ఉంది. మున్సిపాలిటీకి లక్షలాది రూపాయాలు పన్నుచెల్లించాల్సి ఉంది. కానీ వ్యాపారులు అందుకు సముఖత చూపడం లేదు. వ్యాపారులందరికి నోటీసులు మాత్రం ఇస్తున్నారు. స్థలాల వద్ద కు వెళ్లి సరిహద్దు బండలను పికెస్తున్నారు కానీ ప్రయోజనం చేకూరడంలేదు. ఇప్పటికైన మున్నిపల్‌ అధికారులు కొరడఝళిపిస్తే స్థలాలను కొనుగోలు చేసే ప్రజ లు ఇబ్బందులు పడే అవకాశాలు ఉండవని పలువురు కోరుతున్నారు.