కౌన్సిలర్ల కొమ్ముకాస్తున్న ఆర్డీవో: టిడిపి


కరీంనగర్‌: మెట్‌పల్లి మున్సిపల్‌ అధికారి, జగిత్యాల ఆర్డీవో అమయ్‌కుమార్‌ కాంగ్రెస్‌ కౌన్సిలర్ల కొమ్ముకాస్తున్నాడని టిడిపి మహిళా కౌన్సిలర్‌ వడ్డెపల్లి లక్ష్మి ఆరోపించింది. శుక్రవారంనాడు మెట్‌పల్లి మున్సిపల్‌ ప్రాంతంలో విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, టిఆర్‌ఎస్‌ విప్‌ ఒరిజినల్‌ కాగితం ఆర్డీవోకు అందజేయడం జరిగిందని, కాంగ్రెస్‌ వాళ్ల కొమ్ముకాచేందుకే జిరాక్స్‌ కాగితం అందినట్లు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి మాట వినాల్సిందే తప్ప, ఇలా తప్పుడు ఆరోపణలతో భుజస్కాందాలపై వేసుకొని ఇలాంటి అబద్ధాలు ఆడకూడదని ఆమె సూచించారు. ఈ ఎన్నికలు మధ్యంతరంగా వాయిదా వేసినంత మాత్రాన తమకు జరిగే నష్టం ఏమి ఉండబోదని తాము ఎన్నికల్లో పోటీలో ఉన్నామని ఆమె తెలిపారు. విలేఖరుల సమావేశంలో బిజెపి, టిడిపి కౌన్సిలర్లు ఆమె వెంట ఉన్నారు.

Advertisements

హైకోర్టు ఉత్తర్వులతో ఎన్నికలు వాయిదా


కరీంనగర్‌: మెట్‌పల్లి మున్సిపల్‌ ఎన్నికలు హైకోర్టు స్టే ఉత్తర్వులు మధ్యంతరంగా వెలువడడంతో ఈ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు జగిత్యాల ఆర్డీవో, ఎన్నికల అధికారి అమయ్‌కుమార్‌ నిలిపివేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారంనాడు 3వ మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక జరగనున్న ప్రక్రియలోనే ఈ ఎన్నికలను నిలిపివేయాలన్న హైకోర్టు నుండి వచ్చిన పిటిషన్‌ ఆధారంగా ఈ ఎన్నికలను నిలిపివేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 24 మంది కౌన్సిలర్లు ఉండగా, అందులో కాంగ్రెస్‌కు సంబంధించి సుభాషిణి అనే కౌన్సిలర్‌ గైర్హాజరైనట్లు ఎన్నికల అధికారి వివరించారు. కాంగ్రెస్‌ నుండి పది మంది, టిఆర్‌ఎస్‌ నుండి ఐదుగురు, బిజెపి నుండి నలుగురు, టిడిపి నుండి ముగ్గురు ఈ ఎన్నికల్లో హాజరయ్యారని, ఈ నోటిఫికేషన్‌ వెలుబడడంతోనే ఎన్నిక వాయిదా పడింది. టిఆర్‌ఎస్‌ నుండి విప్‌ జారీ చేసినట్లుగా తెలుపుతున్నది అవాస్తవమన్నది దానికి సంబంధించిన జిరాక్స్‌ మాత్రమే అందిందని దాంతో విప్‌ చెల్లబోదని అమయ్‌కుమార్‌ తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులు తిరిగి ఎన్నికల నియామకం చేపట్టడం జరుగుతుంది.

ఘనంగా సింగరేణి బొగ్గుగనుల్లో వారోత్సవాలు


కరీంనగర్‌: శుక్రవారం నుండి జిల్లాలోని సింగరేణి బొగ్గు గనుల్లో రక్షణ వారోత్సవాలు ఘనంగా చేపట్టారు. సింగరేణి ప్రాంతంలోని 32 బొగ్గు గనుల్లో, 14 ఉపరిత గనుల్లో వారం రోజులపాటు ఈ రక్షణ వారోత్సవాలు జరుపుకుంటారు. అంతేగాకుండా గతంలో సింగరేణి ప్రాంతంలోని ప్రతి మైనింగ్‌లో బొగ్గు పెళ్లలు పైనుండి కిందపడకుండా కర్రదిమ్మెలతో సపోర్టులు చేపట్టి భద్రత నిర్వహించేవారు. ప్రస్తుత పరిస్థితులలో అండర్‌గ్రౌండ్‌లోని పైకప్పు కూలి బొగ్గు పెళ్లలు పడకుండా ఆధునీక పద్ధతిలో రూపుబోల్టింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టి ఈ భద్రతను కాపాడుతున్నారు. దీని వల్ల ప్రమాదాలకు తావివ్వకుండా పుంచుతుంది. దాంతో గనుల్లో ఎక్కువ బొగ్గు ఉత్పత్తి కార్మికులు తీస్తు అధిక లాభాలలో సింగరేణి ముందుకు నడుస్తుంది.

దివంగత నేత సేవలు మరవం: ఎంపీ


కరీంనగర్‌: దివంగత నేత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేసిన సేవలను మరువబోమని పెద్దపల్లి ఎంపి వివేకానంద అన్నారు. శుక్రవారంనాడు పెగడపల్లి మండలంలోని బతికెపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన వెంట మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి నివాళులర్పించినవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దివంగత నేత రాష్ట్రంలోని రైతులకు, మహిళలకు అత్యధికంగా అభివృద్ధి చేసే దశలోనే రాజశేఖర్‌రెడ్డి పయణించడాని వారు గుర్తు చేశారు. రైతులకు ఉచిత విద్యుత్‌, రుణ మాఫీ లాంటి కార్యక్రమాలు చేపట్టడమేగాకుండా తెలంగాణా ప్రాంతంలోని రైతాంగం సాగు, తాగునీరు, జలయజ్ఞాన్ని చేపట్టిన ఘననీయుడని వారు కొనియాడారు. ఇకపోతే మహిళలకు పావలా వడ్డీ రుణాలు, రాష్ట్రంలో మగవారితో సమానంగా ఆర్థికంగా ఎదిగేందుకు ఆదుకున్న గొప్ప నాయకుడని అన్నారు. ఈ సంస్మరణ సభలో పెగడపల్లి ఎంపిపి రాంచంద్రం, స్థానిక మాజీ ఎంపిపి కరుణాకర్‌రెడ్డి తోపాటు స్థానిక సర్పంచ్‌ ప్రభాకర్‌రెడ్డి ధర్మపురి ఇన్‌ఛార్జ్‌ లక్ష్మణ్‌కుమార్‌, నాయకులు తిరుపతిరెడ్డి, మోహన్‌రెడ్డి, మహీందర్‌రెడ్డి, సత్యనారాయణ, గ్రామప్రజలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

జడ్పీటీసీ ఎన్నికలు 16కు వాయిదా


కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లాలో రెండు జడ్పీటీసీ ఉప ఎన్నికలు వై.ఎస్‌. మరణానంతరం ఎన్నికలను 8రోజులపాటు పొడిగించారు. జిల్లాలో తిమ్మాపూర్‌, ఎల్లారెడ్డిపేట మండలాల జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించి ఈ నెల 8 జరగనున్న జడ్పీటీసీ ఎన్నికలను 16న జరిగేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. 16న ఎన్నికలు, ఒట్ల లెక్కింపు 17న జరుగుతాయని వారు తెలిపారు. ఈ ఎన్నికల ప్రచారం సాగుతున్న సమయంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. హఠాన్మరణంతో 4రోజులపాటు ప్రచారాన్ని నిలిపివేసారు. ఎలాగైనా టిడిపి జడ్పీటీసీ ఎన్నికలను కైవసం చేసుకుని చైర్మన్‌ పదవిని దక్కించుకోవాలనే ఆలోచనలో ఉంది.

ముఖ్యమంత్రి మృతిని తట్టుకోలేక కరీంనగర్లో ఇప్పటివరకు 28మంది మృతి


కరీంనగర్‌: ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి మృతిచెందిన వార్త వినగానే ఇప్పటివరకు 28మంది గుండెపోటుతో మరణించారు. హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి మృతిచెందిన నాటి నుండి టివీలలో ఆయన మృతివార్తలు వింటూ, చూస్తూ మూడురోజులపాటు జిల్లాలోని మృతిచెందారు. దివంగత నేత తనయుడైన ప్రస్తుత ఎంపీ జగన్‌ రాష్ట్ర ప్రజలకు నిబ్బరంగా ఉండాలని పిలుపునిచ్చినప్పటికీ అభిమానాన్ని తట్టుకోలేక రోజురోజుకు ఈ మరణాలు నమోదవుతున్నాయి. జిల్లా మంత్రి శ్రీధర్‌బాబు కూడా ప్రజలకు నచ్చజెప్పారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటివరకు సుమారు 28మంది గుండెపోటుతో మరణించడం కాంగ్రెస్‌ పార్టీలో కాంగ్రెస్‌ పార్టీని కొంత కలవరానికి గురిచేస్తుంది.

ప్రజలను పట్టి పీడిస్తున్న విషజ్వరాలు


కరీంనగర్‌: జిల్లాలో డెంగీ, విషజ్వరాలు ప్రజలను పట్టి పీడిస్తుంటే డాక్టర్లు మాత్రం నామమాత్రంగా వారికి వైద్యసేవలందిస్తున్నారు. గ్రామాలలో అనేకమందికి విషజ్వరాలు మొదలయ్యాయి. జిల్లా వైద్యాధికారిని డాక్టర్‌ సుభద్ర పట్టణ, మండలస్థాయిలో వైద్యాధికారులు టీంలుగా ఏర్పడి ప్రజలకు వైద్యం అందించాలని వైద్య అధికారి డాక్టర్లకు ఆదేశించినప్పటికీ మండలస్థాయి డాక్టర్లు, గ్రామస్థాయిలో ఎఎన్‌ఎంలు నామమాత్రంగా పర్యటించి వైద్యం అంతంత మాత్రాన అందిస్తున్నారు. దాంతో గ్రామాల్లో డెంగీ, విషజ్వరాలు అధికంగా పెరుగుతున్నాయి. ఇప్పటికైనా గ్రామీణ ప్రాంతంలోని ప్రజలను ఈ వ్యాధుల నుండి ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.