ప్రశాంతి నిలయానికి ప్రత్యేక రైళ్లు, బస్సులు


సికింద్రాబాద్ నుంచి పుట్టపర్తికి 4 ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ నుంచి పుట్టపర్తికి రేపటి నుంచి నాలుగు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. సత్యసాయి బాబాను చివరి సారి చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో పుట్టపర్తి వెళుతున్నారు. భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్యరైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. పుట్టపర్తికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు, బస్సులను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్‌, విజయవాడ, బెంగళూరు నుంచి ప్రత్యేకంగా ఆరు రైళ్లను నడపనున్నారు. హైదరాబాదు, విజయవాడ, గుంటూరు, చెన్నై, తిరుపతి, బెంగళూరు, అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, మహబూబ్‌నగర్‌, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. రాజధాని నుంచి సోమ, మంగళవారాల్లో ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయించారు.

* నెంబరు 07611 ప్రత్యేక రైలు సోమవారం సాయంత్రం 5.30 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి మరునాడు ఉదయం 3.30 గంటలకు ప్రశాంతి నిలయం చేరుతుంది. ఈ ప్రత్యేక రైలు (నెంబరు 07612) వెంటనే (ఉదయం 5.00 గంటలకు) ప్రశాంతి నిలయం నుంచి తిరుగు ప్రయాణమై, సాయంత్రం 5.30 గంటలకు కాచిగూడ చేరుతుంది. నెంబరు 07603 ప్రత్యేక రైలు కాచిగూడ నుంచి ఈ నెల 26వ తేదీ రాత్రి 10 గంటలకు బయలుదేరి మరునాడు ఉదయం 7.30 గంటలకు ప్రశాంతి నిలయం చేరుతుంది.

* విజయవాడ నుంచి ఓ ప్రత్యేక రైలు ఈ నెల 26వ తేదీ సాయంత్రం 4 గంటలకు బయలుదేరి మరునాడు ఉదయం 4.30 గంటలకు ప్రశాంతి నిలయం చేరుతుంది

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: