‘రియల్’ దందా!


తుని: పట్టణ ప్రాంతంలో భూమి ధరలకు రెక్కలు రావడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారుల చూపు గ్రామాలపై పడింది. పట్టణాన్ని ఆనుకుని ఉన్న ఎస్.అన్నవరం పంచాయతీ భూములకు డిమాండ్ ఉండడంతో రియల్ దందా మొదలయ్యింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇచ్చే ముడుపులకు ఆశపడి నిబంధనలను నిలువునా తుంగలోకి తొక్కి అధికారులు అడ్డగోలుగా అనుమతులు మంజూరు చేస్తున్నారు. వ్యవసాయ భూమి కాస్తా కొద్దిరోజుల వ్యవధిలోనే నివాసగృహాల ప్లాట్లుగా రూపుదిద్దుకుంటున్నాయి. పంచాయతీ అధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు దం డిగా సొమ్ములు వెనకేసుకుంటూ ప్రభుత్వ ఆ దాయానికి గండికొడుతున్నారు. కేవలం రెం డేళ్ల వ్యవధిలోనే 120 ఎకరాల భూమి ప్లాట్లు గా మారిందంటే ఏ స్థాయిలో వ్యాపారం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.

నిబంధనలు ఇలా
పట్టణం, గ్రామాల్లో వ్యవసాయ భూమిని నివాస స్థలాలుగా మార్పుచేసి, ప్లాట్లు వేయాలంటే జిల్లా ప్రణాళికా విభాగం నుంచి పూర్తిస్థాయి అనుమతి పొందాలి. ముందుగా భూమికి సంబంధించి పత్రాలతో పాటు, ప్రభుత్వ మార్కెట్ విలువ ప్రకారం పదిశాతం సొమ్మును రెవెన్యూ శాఖకు చెల్లించాలి. తహసీల్దారు కార్యాలయంలో డీడీతోపాటు దరఖాస్తును అందజేస్తే ఆర్డీఓ పరిశీలించి ఎల్‌సీసీ (భూమి మార్పిడి ధ్రువపత్రం) జారీచేస్తారు. దాన్ని తీసుకుని పంచాయతీ కార్యాలయంలో అందజేయాలి. పంచాయతీ అధికారులు పరిశీలించిన తర్వాత తీర్మానం చేసి జిల్లా పట్టణ ప్రణాళికాధికారికి, పంచాయతీరాజ్ శాఖ అధికారికి పంపా లి. నిబంధనల ప్రకారం రోడ్లు, కాలువలు, విద్యు త్ స్తంభాలు, కమ్యూనిటీ స్థలం కేటాయింపుల వివరాలన్నీ సరిగా ఉంటేనే అనుమతి ఇవ్వాలి.

పంచాయతీకి దానపట్టా రాసి ఇచ్చిన
తర్వాతే అనుమతి ఇవ్వాలి
జిల్లా పట్టణ ప్రణాళికాధికారి నుంచి అనుమతి పొందిన వ్యాపారి, వెంచర్‌కు సంబంధించి భూమి లో రోడ్లు, కాలువలు, పది శాతం కమ్యూనిటీ స్థలం పంచాయతీకి దానపట్టా రూపంలో రిజస్ట్రేషన్ చేయించి ఇవ్వాలి. అలాగే విద్యుత్, తాగునీరు సదుపాయాలకు సంబంధించి ఆయా శాఖలు త యారుచేసిన అంచనాల ప్రకారం సొమ్ములు ముం దుగానే చెల్లించాలి. ఇవన్నీ సక్రమంగా ఉన్న తర్వా తే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లు విక్రయించుకునేందుకు పంచాయతీ అనుమతి ఇవ్వాలి. కానీ పంచాయతీ పరిధిలో ఇవేమీ పరిగణనలోకి తీసుకోకుండానే అనుమతులు ఇచ్చేస్తున్నారు.

కమ్యూనిటీ, రోడ్ల స్థలాలను మింగేస్తున్న
వ్యాపారులు
లే అవుట్ స్థలంలో కమ్యూనిటీ అవసరాల కోసం కేటాయించిన పదిశాతం భూమిని పంచాయతీకి అప్పగించకుండానే ప్లాట్లతో కలిపి అమ్ముకుంటున్నారు. 33 అడుగుల వెడల్పులో రోడ్లు నిర్మిం చాల్సి ఉండగా 15 నుంచి 20 అడుగుల వెడల్పు మాత్రమే కేటాయించి మిగిలిన స్థలాన్ని ప్లాట్లలో కలిపేస్తున్నారు.

వుడా నిబంధనలు గాలికి
తుని పట్టణాన్ని ఆనుకుని ఉన్న ఎస్.అన్నవరం పంచాయతీని 2008లోనే వుడా పరిధిలోకి చేర్చా రు. కొత్తగా లే అవుట్లు వేయాలన్నా, బహుళ అంతస్థుల భవనాలు నిర్మించాలన్నా వుడా అనుమతి తప్పనిసరి. ఈ నిబంధనలు పట్టించుకున్న నాథు డే లేరు. కొత్తగా వేస్తున్న లే అవుట్లకు కూడా పాత తేదీలతో తీర్మానాలు చేసి అనుమతిస్తున్నారు. ఎస్.అన్నవరం పరిధిలో రెండేళ్లలో 20కి పైగా లే అవుట్లు వేశారు. వీటిలో ఇప్పటికే 60 శాతం మేర ప్లాట్లు రియల్టర్లు అమ్మేశారు. వీటన్నింటికీ భూమి మార్పిడి ధ్రువపత్రం జారీకాలేదు.

రెవెన్యూశాఖ ఆదాయానికి గండి
పంచాయతీ పరిధిలో ఇటీవల వేసిన 120 ఎకరాల లేఅవుట్ భూమి ద్వారా రెవెన్యూ శాఖకు రూ. 1.60 కోట్లు రావాల్సి ఉన్నా ఇంతవరకు రూపాయి కూడా జమ చేయలేదు. భూమి విలువలో ఎకరాకు పదిశాతం చొప్పున సొమ్మును ఎల్‌సీసీకి జమ చేయాలి. కానీ ఎల్‌సీసీకి సొమ్ము చెల్లించకుండానే ప్లాట్లు వేసి అమ్మేసుకుంటున్నారు.

కొనుగోలుదారులకు ఇబ్బందులు
అనుమతి లేని లే అవుట్లలో ఇండ్ల స్థలాలు కొనుగోలు చేసినవారు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని అధికారులు అంటున్నారు. ఎల్‌సీసీతోపాటు రోడ్లు, విద్యుత్, తాగునీరు తదితర సదుపాయాలకు వ్యాపారులు సొమ్ము చెల్లించిం దీ, లేనిదీ పరిశీలించాకే కొనుగోలు చేయాలి. ఎల్‌సీసీ లేని ప్లాట్లుకు పదిశాతం సొమ్ముతోపాటు 50 శాతం అపరాధ రుసుం సదరు ప్లాటు యజమాని నుంచి వసూలు చేస్తామని తహసీల్దారు మహ్మద్ యూసఫ్ జిలానీ తెలిపారు. పంచాయతీ పరిధిలో వేసిన లే అవుట్లకు సంబంధించి భూమి మార్పిడికి ఎటువంటి దరఖాస్తులు రాలేదన్నారు.

నోటీసులు జారీచేశాం
నిబంధనలకు విరుద్ధంగా లే అవుట్లు వేసిన వ్యాపారులకు నోటీసులు జారీచేశామని పంచాయతీ కార్యదర్శి టి.నందన వివరించారు. పంచాయతీ పరిధిలో ఎన్ని లే అవుట్లు ఉన్నాయి, వాటిలో అనుమతి ఇచ్చినవి ఎన్ని అనే దానిపై సమగ్ర నివేదిక తయారుచేస్తున్నామన్నారు. ఇప్పటివరకు 15 లే అవుట్ల యజమానులకు నోటీసులు ఇచ్చామన్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: