‘అకాల’ నష్టం!


కాకినాడ: మబ్బులు ముట్టడించిన శత్రువుల్లా, చినుకులు అవి సంధించిన బాణాల్లా కనిపిస్తుంటే అన్నదాత గుండె గుభేలుమంటోంది. అకాల వర్షం చే తికొచ్చిన పంటపై ప్రతాపం చూపుతూ అతడి మనసుకు కుదురు లేకుండా చేస్తోంది. ఇప్పటికే ధాన్యానికి గిట్టుబాటు ధర రాక దిగులు పడుతుండగా పుండు మీద కారం రాసినట్టు మరింత బాధిస్తోంది. గురువారం జిల్లాలో పలుచోట్ల ఆక స్మికంగా కురిసిన వర్షానికి రైతన్నకు పెద్ద నష్టమే వాటిల్లింది. ఉదయమంతా ఎండ కాసినా మధ్యాహ్నానికల్లా ఆకాశం నిండా మేఘాలు కమ్ముకున్నాయి. ఉన్నట్టుండి వర్షం మొదలైంది. కొన్నిచోట్ల ఈదురుగాలులు వీచాయి.

జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వరి కోతలు కోసి పనలపై ఉంచగా, ఇంకొన్ని చోట్ల నూర్పులకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో కురిసిన వర్షానికి రైతులు బెంబేలెత్తి పోయారు. కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని వాన బారి నుంచి కాపాడటానికి అష్టకష్టాలు పడ్డారు. కొందరు రైతులు ధాన్యంపై గడ్డిని వేసి తడవకుండా ప్రయత్నించారు. వరి పనలను మా త్రం వర్షం నుంచి తప్పించలేక నిస్సహాయుల య్యారు. కాకినాడ, కోరుకొండ, కడియం, సీతానగరం, మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం, రావులపాలెం మండలాల్లో వర్షతీవ్రత అధికంగా కనిపించింది. కడియం మండలంలో వెయ్యి ఎకరాల్లో వరి పంట తడిసి ముద్దయింది. కోరుకొండ మండలంలో 500 ఎకరాల్లో పనలు నీట మునిగా యి. మండపేట, రాయవరం తదితర ప్రాంతాల్లో కళ్లాల్లో నూర్చి ఉంచిన ధాన్యంతో పాటు వరిపనలు తడిసిపోయాయి. వర్షానికి ధాన్యం రంగు మారి నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాగే పనలు నీటిలో నిల్వ ఉంటే మొలకలు వస్తాయన్న ఆందోళన అన్నదాతలను వెంటాడుతోంది.

ఇతర పంటలకూ దెబ్బే
ఈదురుగాలుల వల్ల 300 ఎకరాల్లో మామిడి, జీడిమామిడి తోటలు దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాం తాల్లో చెట్లు కూలాయి. సీతానగరం మండలంలో 120 ఎకరాల్లో పొగాకు పంటకు నష్టం వాటిల్లిం ది. కొన్నిచోట్ల బట్టీల్లో తయారు చేసి కాల్చడానికి సిద్ధంగా ఉంచిన పచ్చి ఇటుకలు పాడయ్యాయి. రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతోనే అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితి రెండు మూడు రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: