మోడల్ రైల్వేస్టేషన్ కళ ఉట్టిపడేలా సదుపాయాలు


తిరుపతి: ప్రపంచ వ్యాప్తంగా భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే తిరుపతి రైల్వేస్టేషన్‌లో అదే స్థాయిలో సదుపాయాలు ఉండాలని గుంతకల్ డివిజన్ కొత్త రైల్వే మేనేజ ర్ టీపీ.సింగ్ కోరారు. రెండు రోజుల క్రితం డీఆర్‌ఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన తొలిసారి తిరుపతి పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా స్టేషన్ మేనేజర్ చాంబర్‌లోని వీఐపీ లాంజ్‌లో అన్ని విభాగాల రైల్వే అధికారులతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. రైల్వే స్టేషన్ శుభ్రత, సాధారణ ప్రయాణికులకు కల్పిస్తున్న వసతులపై ఆయా విభాగాల అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం స్టేషన్ ఆవరణలోని ప్లాట్‌ఫారాలు, పార్శిల్ ఆఫీసు, తాగునీటి వనరులు, రైల్వే ట్రాక్‌లు, పారిశుద్ధ్య సిబ్బంది పనితీరు, రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు, మరుగుదొడ్లను పరిశీలించారు. స్టేషన్ పరిధిలోని పడమటి వైపున్న ప్రధాన ప్రవేశ ద్వారం విస్తరణ, పార్కింగ్ స్థలాల కేటాయింపు, బుకింగ్ కార్యాలయాల పరిధిలోని హాళ్లలో ఏర్పాటు చేసిన ఏసీలను పరిశీలించి తగు సూచనలు చేశారు. మొదటి అంతస్తులోని జనరల్ ప్యాసింజర్ వెయిటింగ్ హాలును తనిఖీ చేసి భద్రతా చర్యలపై ఆదేశాలిచ్చారు.

ప్రస్తుతం రక్షణ విభాగం, ఇంజినీరింగ్, శానిటేషన్, షంటింగ్, బుకింగ్ విభాగాల్లో నెలకొన్న సిబ్బంది కొరతపై నివేదికలు అందజేయాలని కోరారు. పడమటి వైపున్న ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై నుంచి షంటింగ్ యార్డు, పిట్‌లైన్లు, దక్షిణం వైపు ఏర్పాటు చేసిన అదనపు రిజర్వేషన్ కమ్ జనరల్ బుకింగ్ కౌంటర్లను తనిఖీ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలోని ప్రహరీ గోడకు సమీపంలో ఉన్న ప్రైవేటు స్థలంపై సీనియర్ డివిజనల్ ఇంజినీర్ బీఎస్‌ఎల్‌ఎన్.మూర్తి ద్వారా వివరాలు తెలుసుకుని సూచనలు చేశారు. ప్లాట్‌ఫారాలపై ఉండే ప్రయాణికులకు రైల్వే ట్రాక్‌ల నుంచి ఎలాంటి దుర్వాసనలు వెదజల్లకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎయిర్ కూల్ డక్ పనితీరుపై లైజన్ ఆఫీసర్ అనంతాచార్యుల ద్వారా తెలుసుకున్నారు.

సమస్యల పరిష్కారానికి ప్రతిపాదనలు పంపండి
తిరుపతి స్టేషన్‌ను మరింత సుందరంగా, మోడల్ స్టేష న్ స్థాయికి అభివృద్ధి చేసేందుకు కావాల్సిన ప్రతిపాదనలు పంపాలని డీఆర్‌ఎం సింగ్ అధికారులను ఆదేశిం చారు. అందులో భాగంగా ప్రస్తుతం ఉన్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా తాగునీటి వనరులు, పారిశుద్ధ్య నిర్వహణ, ప్లాట్‌ఫారాల్లో మౌలిక సదుపాయాలు వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ముఖ్యంగా జనరల్ ప్యాసింజర్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భవిష్యత్ ప్రణాళికలు ఉండాలన్నారు. రైల్వే రిజర్వేషన్ కార్యాలయంలో కూడా ఆయన తనిఖీలు నిర్వహించి మూసివేసిన కౌంటర్లపై ఆరా తీశారు.

రిజర్వేషన్ ప్రయాణికులకు తగిన స్థాయిలో సౌకర్యం, టికెట్ల పంపిణీ జరగాలని ఆదేశించారు. రిజర్వేషన్ కార్యాలయంలో పరిపాలన విధానాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రైల్వే లైజన్ ఆఫీసర్ కే.అనంతాచార్యులు, స్టేషన్ మేనేజరు కూర్మారావు, చీఫ్ రిజర్వేషన్ ఇన్‌స్పెక్టర్ పీవీ.ప్రసాద్, సీనియర్ డివిజనల్ ఆపరేషన్ మేనేజర్ సత్యనారాయ ణ, సీనియర్ డీసీఎం సుబ్బరాయుడు, ఐఆర్‌సీటీసీ మేనేజరు శేషగిరిరావు, ఆర్‌పీఎఫ్ ఎస్పీ సుధాకర్, సీఐలు జనార్దన్‌చౌదరి, రత్నకుమార్ పాల్గొన్నారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: