మైనింగ్ స్టాఫ్‌కు స్వయం ప్రతిపత్తి


శ్రీరాంపూర్: సింగరేణిలో మైనింగ్ స్టాఫ్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించామని ఏఐటీయూసీ మైనింగ్ స్టాఫ్ అసోసియేషన్ రీజియన్ కార్యదర్శి వంగ రాజేశ్వర్‌రావు తెలిపారు. సంఘం ప్రతినిధులతో కలిసి ఆయన శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఫిట్ కమిటీ నుంచి కార్పొరేట్ స్ట్రక్చరల్ కమిటీ వరకు మైనింగ్ స్టాఫ్‌కు ప్రాధాన్యత కల్పించామన్నారు. ఏఐటీయూసీపై టీబీజీకేఎస్ మైనింగ్ స్టాఫ్ చేసిన వాఖ్యలను ఆయన ఖండించారు. టీబీజీకేఎస్ గెలిచిన ఏరియాలో స్థానిక సమస్యలను కూడా పరిష్కరించలేదని దుయ్యబట్టారు. వేజ్‌బోర్డులో సభ్యత్వం లేని ఆ నాయకులు మైనింగ్ స్టాఫ్ సమస్యలను ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు. మైనింగ్ స్టాఫ్‌కు అన్యాయం చేసింది ఐఎన్‌టీయూసేనని ఆరోపించారు.

మేం చేసిందే ఎక్కువ…
ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో తొమ్మిదేళ్లకు చేసుకువచ్చిన క్యాడర్ స్కీంను తాము గెలిచాక 7 ఏళ్ల కాలపరిమితికే ఒప్పందం చేయించామన్నారు. వారి హయాంలోనే మైనింగ్‌స్టాఫ్‌పై వేధింపులు అధిక ంగా ఉండేవని ఆరోపించారు. పలువురికి ఇంక్రిమెంట్‌లు, రివర్షన్ ఇచ్చారని.. నేడు తమ హయాంలో ఇలాంటివి ఏ ఒక్కటీ జరుగలేదని పేర్కొన్నారు. బెల్లంపల్లి రీజియన్‌లో లాకౌట్ విధించిన ప్పటికీ గుర్తింపు ఎన్నికలు కాలేదని తెలిపారు. దానికి తమకు సంబంధం లేదన్నారు. 14 సంవత్సరాలు యాక్టింగ్ చేసిన షాట్‌ఫైరర్లను పర్మినెంట్ చే యించామని తెలిపారు.

గోల్డెన్ హ్యాండ్ షేక్ పథకాన్ని ప్రవేశపెట్టించడమే కాక.. ఓవర్‌మన్లు, మైనింగ్ సర్దార్లకు చార్జీ అలవెన్స్, హెడ్ ఓవర్‌మన్లకు నైట్‌షిఫ్ట్ అలవెన్స్ ఇప్పించామని పేర్కొన్నారు. ప్రస్తుతం మైనింగ్ సర్దార్లకు టెక్నికల్ ఏ గ్రేడ్‌ను ఈ ఎన్నికల్లోపు ఇప్పించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. పెండింగ్‌లో ఉన్న ఇతర సమస్యల పరిష్కారానికి సమ్మె నోటీలో పెట్టి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. 24న శ్రీరాంపూర్ ఏరియాలో జరిగే గద్దర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రీజియన్ ఉపాధ్యక్షుడు దేవేందర్, ఏరియా ఉపాధ్యక్షుడు యోహాన్, కేంద్ర కమిటీ సభ్యులు యాదవరెడ్డి, గొర్రె నర్సయ్య, కొట్టె శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: