మనుషులతో వ్యాపారం!


చిత్తూరు: అమాయకులను గుర్తించి వల వేసి వారిని నమ్మిం చి వెట్టి చాకిరీ చేయిస్తున్న 10 మంది కేటుగాళ్ల గుట్టు రట్టయింది. చిత్తూరు పోలీసులు తీగలాగి డొంకను కదిలించి వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. జిల్లా ఎస్పీ రామకృష్ణ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ కేసును చేధించిన చిత్తూరు డీఎస్పీ అబ్దుల్ రజాక్, సీఐ శ్రీకాంత్, యాదమరి ఎస్సై రవీంద్రలను ఎస్పీ అభినందించారు.

వివరాల్లోకి వె ళితే… ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వస్తున్న ఇటువంటి అమాయకులను గుర్తించి కొందరు కేటుగాళ్లు చాకచక్యంగా నమ్మించి, పని కల్పిస్తామని శాశ్వతంగా వెట్టిచాకిరీలోకి నెట్టేస్తున్నారు. పదుల సంఖ్యలో అమాయకులు బానిసత్వంలో మగ్గుతున్నారు. శ్రీకాళహ స్తికి చెందిన గంగయ్య, వెంకటరమణలు తప్పిపోయినట్లు అక్కడి పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసు పరిశోధనలో ఈ మొత్తం వ్యవహారం బట్టబయలైంది. బాధితుల బంధువుల సమాచారం మేరకు యాదమరి మండలంలో ఉండవచ్చని ఇచ్చిన కూపీతో వెట్టి నుంచి అందరూ బయటపడ్డారు. అమాయకులను కర్ణాటకకు తరలిస్తున్న వారంతా యాదమరి మండలం 180 కొత్తపల్లెకు చెందిన వారే.

ఈ గ్రామంలో కొంతమంది ఒక ముఠాగా ఏర్పడి అమాయకులకు ఎర వేసి కర్ణాటకలోని కాంట్రాక్టర్లకు అమ్మకానికి పెడుతున్నారు. అక్కడికి వెళ్లిన వారికి ఇక వేరే ప్రపంచంతో సంబంధం లేకుండా, రాత్రీపగలు అనే తేడా లేకుండా పనులు చేయిస్తూ నరకం చూపిస్తున్నారు. ముందుగా అక్కడికి వెళ్లిన వారి బట్టలు కత్తిరించడం, గుండు గీయించి మనిషి రూపురేఖలు మార్చడం చేస్తారు. ఆహారం కూడా సరిగ్గా పెట్టరు. వారు పెట్టినప్పుడే తినాల్సి ఉంది. జబ్బు చేసినా మందులివ్వరు. ఈ రకంగా మొత్తం 60 మంది కర్ణాటకలోని హసన్ జిల్లా గోనెబిందు ఇటుకల కాంట్రాక్టర్ల నిర్బంధంలో ఉన్నట్టు గుర్తించి చిత్తూరు పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. 180 కొత్తపల్లెకు చెందిన 10 మందిని రిమాండ్‌కు తరలిం చారు. వీరందరిపై మోసం, కిడ్నాప్, బలవంతపు వెట్టిచాకిరీ తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

అరెస్ట్ అయిన నిందితులు
పి.శంకర్ (33), సూరా వెంకటేశులు (34), సూరా తాతయ్య(45), సూరా భానుశంకర్ (25), పందిపట్ల మురళి(20), సూరా క్రిష్ణమూర్తి(31), వల్లభ చిన్నబ్బ (50), సూరా మంజునాథ్ (31), బండినాగరాజు (36), జడిపి రమేష్ (30) ఉన్నారు.

ఒరిస్సా రాష్ట్రం పార్థాపూర్ ప్రాంతానికి చెందిన దుర్గా శర్వణ పత్రో కుటుంబంలో ఏర్పడిన కల హాల కారణంగా మూడు నెలల కిందట తిరుమలకు వచ్చాడు. స్వామి వారికి తలనీలాలు సమర్పించి తిరుగు ప్రయాణంలో తిరుపతికి చేరుకున్నాడు. తిరుపతి రైల్వేస్టేషన్‌లో కేటుగాళ్ల వలలో చిక్కుకున్నాడు. భయం భయంగా బిక్కుబిక్కుమంటూ తిరుగుతున్న పత్రోను గమనించిన ఇద్దరు వ్యక్తులు తమ మాటలతో ముగ్గులోకి దింపారు. మంచి పని చూపిస్తామని ఎర వేశారు. అక్కడ నుంచి కర్ణాటకకు తీసుకెళ్లారు. ఓ ఇటుకల తయారీ కాంట్రాక్టర్‌కు అప్పగిం చారు. అక్కడ నుంచి పత్రో బతుకు దినదినగండం గా మారింది.

మచిలీపట్నంకు చెందిన శివకుమార్ ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతూ స్వామి వారి దర్శనార్థం తిరుమలకు వచ్చాడు. తిరుగు ప్రయాణంలో తిరుపతి బస్టాండ్‌లో మాయగాళ్ల ఉచ్చులో పడ్డాడు. ఇత ను కూడా కొన్ని రోజులకు పత్రో వద్దకు చేరాడు.

శ్రీకాళహస్తి రూరల్ మండలానికి చెందిన గంగయ్య, వెంకటరమణ కుటుంబ కలహాల కారణంగా ఓ రోజు తిరుపతికి వచ్చారు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా బస్టాండ్‌లో అమాయకంగా తిరుగుతుండగా, వీరిని గుర్తించిన కేటుగాళ్లు బుట్టలో వేసుకున్నారు. అక్కడ నుంచి ఈ ఇద్దరికీ బానిసత్వమే.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: