భవిష్యత్తు వ్యవసాయ రంగానిదే!


చిత్తూరు: మనదేశం వ్యవసాయ రంగంలో ఎంతో పురోగతి సాధించిందని, భవిష్యత్ వ్యవసాయ రంగానిదేనని న్యూఢిల్లీలోని భారతీయ వ్యవసాయపరిశోధనా సంస్థ డెరైక్టర్ జనరల్ డాక్టర్ ఎస్.అయ్యప్పన్ పేర్కొన్నారు. శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలో గురువారం రెండవ స్నాతకోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అయ్యప్పన్ ముఖ్య అతిథిగా హాజరై స్నాతకోపన్యాసం చేశారు. మన దేశం వ్యవసాయ రంగంలో పురోభివృద్ధి సాధించిం దని అన్నారు. ఈ ఏడాదిలో 235 మిలియన్ టన్నుల ఆహార ఉత్పత్తులు సాధించిందని తెలిపారు.

జాతీయ ఆహార ఉత్పత్తిలో 10 శాతం వాటా ఆంధ్ర రాష్ట్రం నుంచే వచ్చిందన్నారు. బియ్యం, వరి, మిరప ఉత్పత్తులు బాగున్నాయని తెలిపారు. పప్పు దినుసుల ఉత్పత్తి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ, మధ్య భారతదేశంలో 17.2 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించించడం వల్ల పప్పు దినుసుల లోటు తీరిందన్నారు. మనదేశంలో పశుసంపద బాగుందని తెలిపారు. వర్షాభావ పరిస్థితులు, కరువు సందర్భాల్లో దేశాన్ని ఆదుకున్నది పశు సంపదేనని అన్నారు. పాడి ఉత్పత్తిలో మనదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. చేపల ఉత్పత్తిలో చైనా తర్వాతి స్థానం భారత్‌దే అన్నారు. మన దేశంలో గ్రీన్ రెవల్యూషన్ , బ్లూ రెవెల్యూషన్, వైట్ రెవెల్యూషన్ పేరిట విప్లవాలు వచ్చాయని అయితే దేశ సమగ్రాభివృద్ధికి రెయిన్‌బో విప్లవం రావాల్సిన అవసరం ఉందన్నారు.

ఉన్నత విద్యా అభ్యసించే వారి సంఖ్య పెరగాలి
మనదేశంలో 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండే వారిలో ఉన్నత విద్యను అభ్యసించే వారి సంఖ్య 11 శాతం మాత్రమే ఉందని అయ్యప్పన్ పేర్కొన్నారు. ఇది 15 శాతానికి పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మనదేశంలో ప్రతి ఏడాది వ్యవసాయ శాస్త్రం, పశువైద్య శాస్త్రంలో కోర్సులు పూర్తి చేసి బయటికి వస్తున్న వారి సంఖ్య 35 వేలు మాత్రమేనన్నారు. ప్రభుత్వం ఒక్కో యూజీ విద్యార్థికి 5 నుంచి 8 లక్షలు, పీజీ విద్యార్థికి 10 నుంచి 12 లక్షలు, పీహెచ్‌డీ విద్యార్థికి 15 లక్షల రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేయాలని విద్యార్థులకు సూచించారు. పశువైద్య శాస్ర్తానికి మంచి భవిష్యత్ ఉందన్నారు. ప్రస్తుత వాతావరణంలో మార్పులు, గ్లోబల్ వార్మింగ్ మనముందున్న సమస్యలని తెలిపారు. అధిక వేడి, వర్షాలు, చలి అనూహ్యంగా పెరగడం, తగ్గడం వల్ల పశుసంపదపై తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. మార్పుల వల్ల చేపలు, పశుసంపద నశిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మార్పులు తట్టుకునే అంశాలపై యువ శాస్తవ్రేత్తలు పరిశోధనలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంతకు మునుపు పశువైద్య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ వి.ప్రభాకరరావు రెండు సంవత్సరాల్లో యూనివర్సిటీ సాధించిన పురోగతిని వివరించారు. అలాగే చాన్సలర్ హోదాలో పీజీ, యూజీ, పీహెచ్‌డీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ రంగనాధం, కళాశాల అసోసియేట్ డీన్ చంద్రశేఖరరావు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: