పాప ప్రక్షాళన కోసమే ఏసు ప్రాణత్యాగం


ప్రేమ, త్యాగం అనగానే కరుణామయుడు ఏసు ప్రభువు గుర్తుకు వస్తాడు. పాపులను రక్షించేందుకు ఆయన శిలువ ఎక్కాడు. ఆయనకు శిలువ వేసిన రోజు ఇది. మానవాళి పాపాల గురించి ఆత్మావలోకనం చేసుకోవాలి. శిలువలో ఏసు పలికిన ఏడు మాటలను శుభ శుక్రవారం రోజున మననం చేసుకుంటారు. నేడు జిల్లాలో క్రైస్తవ సోదరులు గుడ్ ఫ్రైడేను ఉపవాస దీక్షలతో జరుపుకోనున్నారు. ప్రత్యేక ప్రార్థనలకు చర్చిలను సిద్ధం చేశారు. తిరుపతి, చిత్తూరు, మదనపల్లెలోని చర్చిలలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు.

మాన వాళి పాప ప్రక్షాళన కోసం ఏసు శిలువపై ప్రాణత్యాగం చేసిన రోజు గుడ్‌ఫ్రైడే (శుభ శుక్రవారం) ఇది పండుగ కాదు. ఏసు మరణాన్ని స్మరించుకుంటూ మానవాళి తమ పాపాలు క్ష మించమని కోరేరోజు. ఏసుక్రీస్తును మధ్యాహ్నం శిలువ వేస్తారు. ఆయన రక్తం చిందించి మరణించాక మూడవ రోజున ఆదివారం తిరిగి సజీవుడవుతాడు. ఈ పునరుత్థాన దినాన్ని ‘ఈస్టర్ పండుగ’గా జరుపుకుంటారు. గుడ్‌ఫ్రైడే రోజున క్రైస్తవులు ఉపవాసాలుంటారు. మరి కొందరు 40 రోజుల(లెంట్‌కాలం) కఠిన ఉపవాసాలు ఆచరిస్తారు. మానవాళి పాపాల కోసం బలైన ఏసు ప్రభువును ధ్యానిస్తారు. చర్చిలలో మధ్యాహ్నం 11 గంటల నుంచి మూడు గంటల వరకు ప్రార్థనలు చేస్తారు.

ఏసు పలికిన మాటలు
ఏసు ప్రభువును ఉదయం 9 గంటలకు శిలువ వేయగా, మధ్యాహ్నం 3 గంటలకు ఆయన మరణించారు. ‘తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమింపుము’ అన్న మొదటి మాట ఆయనలోని క్షమా గుణాన్ని తెలుపుతోంది. ‘నేడు నీవు నాతో కూడా పరలోకంలో ఉందువని నిశ్చయంగా చెప్పుచున్నాను’ అనేది రెండవ మాట. ఇక ఏసు పలికిన మూడవ మాట ‘నా తల్లి, తాను, ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచుండటం’ అని తన తల్లితో చెప్పడం ప్రేమ బాంధవ్యాలను సూచిస్తోంది. ‘ఏలీ ఏలీ లామా సబక్తాని’ అని బిగ్గరగా కేక వేయడం వియోగాన్ని తెలుపుతుంది. ఆయన పలికిన ‘దప్పిగొనుచున్నాను’ అన్న ఐదవ మాట అన్వేషణకు గుర్తుగా నిలుస్తుంది. ‘శిలువపై క్రీస్తు పలుకులు సమాప్తమైనవి’ అన్న ఆరవ మాట విజ యమార్గాన్ని బోధిస్తుంది. చివరగా క్రీస్తు పలికిన ఏడవ మాట ‘తండ్రీ నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను’ అని పలికారు. లోక రక్షణార్థం ఈ లోకానికి పంపబడిన క్రీస్తు విజయంతో తండ్రి అప్పగించిన పనిని ముగించి లోకానికి రక్షణను అందించి ఆత్మను దేవునికి అప్పగించాడు.

ఏసును శిలువ చేసిన స్థలం హేబ్రీ భాషలో గొల్దొతా. లాటిన్‌లో కల్వరి. ఈ పదాలకు పుర్రె అని అర్థం. ఏసును శిలువ వే సిన కొండ మానవ పుర్రె వలే ఉంటుంది. ఏసుపై శిలువ మోపి నడిపించిన మార్గాన్ని డౌలాదోషాలంటారు. శిలువ బరువు దాదాపు 136 కిలోల కన్నా ఎక్కువ. శిలువ వేయబడే నేరస్తుడి తలపై అతడిని ఎందుకు అలా చేయవలసి వచ్చిందో రాసిన పలకను ఏర్పాటు చేస్తారు. ఏసు శిలువైపై నజరేయుడగు ఏసు యూదుల రాజు అనిమూడు భాషలలో రాసి ఉంచారు. రోమా గవర్నర్ పిలాతు ప్రధాన యాచకులు, యూదులు ఏసుకు శిలువ శిక్ష విధిస్తారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: