థర్మల్ విద్యుత్ ప్లాంట్ విస్తరణకు నీటి కేటాయింపులు పెంచితే సహించం


తాడిపత్రి: థర్మల్ విద్యుత్ ప్లాంట్ విస్తరణ నేపథ్యంలో పెన్నా నది నుంచి కోర్టు ఆదేశాల మేరకు 2లక్షల 50వేల లీటర్లను నీటిని మాత్రమే వినియోగించుకోవాలని, కేటాయింపులు పెంచి నీటిని తరలిస్తే సహించేది లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పైలానరసింహయ్య హెచ్చరించారు. అల్ట్రాటెక్ కర్మాగారంలో 50మెగావ్యాట్ల థర్మల్ ప్లాంట్‌ను వంద మెగావ్యాట్ల విస్తరణపై మండలంలోని బోగసముద్రం గ్రామంలో శివాలయం వద్ద ప్రజాభిప్రాయసేకరణ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు.

డీఆర్‌ఓ సుదర్శనరెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి అసిస్టెంట్ ఇంజనీర్ కృష్ణమూర్తి, ఇన్‌చార్జ్ తహసిల్దార్ మాధవరెడ్డి, బోగసముద్రం, అయ్యవారిపల్లి, వెంకటరెడ్డిపల్లి, గదరగుట్టపల్లి, వెంకటాంపల్లి, తిమ్మేపల్లి, యరగ్రుంటపల్లి గ్రామస్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి వివరాలను కంపెనీ సిబ్బంది దేవిప్రసాద్ గ్రామస్తులకు తెలియజేశారు. పైలానరసింహయ్య మాట్లాడుతూ ఫ్యాక్టరీ ఏర్పాటు వల్ల ఇక్కడి నిమ్మకాయల తోటలు ఆనవాళ్లు కూడా లేకుండా పోయాయన్నారు. కంపెనీ యాజమాన్యం కొన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించి మిగతా గ్రామాలను విస్మరించిందన్నారు. ఫ్యాక్టరీ నుంచి వెలువుడుతన్న కాలుష్యం వల్ల ప్రజలు టీబీ, గొంతునొప్పి తదితర వ్యాధులకు గురవుతున్నారన్నారు. ప్లాంట్ విస్తరణకు కోర్టు ఆదేశాల మేరకే నీటిని తరలించాలని, ఇష్టారాజ్యంగా నీటిని వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తే ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.

గ్రామాల ప్రజలు మాట్లాడుతూ స్థానికులకు కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇస్తేనే ప్లాంట్ విస్తరణకు అంగీకరిస్తామని పేర్కొన్నారు. ఈమేరకు అర్జీలు సమర్పించారు. డీఆర్‌ఓ సుధర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల అభిప్రాయాలను, అర్జీలను కేంద్రప్రభుత్వానికి పంపుతామని, ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. అందరికీ న్యాయం జరిగేలా చూస్తామన్నారు. వ్యవసాయంతో పాటు పారిశ్రామికీకరణ జరిగితేనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ రాజశేఖర్, అల్ట్రాటెక్ కంపెనీ సిబ్బంది వసంతరావు, గోపాల్‌రెడ్డి, తాగునీటి సంఘం చైర్మన్ తిరుపాల్‌రెడ్డి, సర్పంచ్ సోమేశ్వరమ్మ, ఎస్‌ఐ విలియమ్స్, గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: