ట్రస్టుపైనే అనుమానపు ముసుర్లు!


పుట్టపర్తి: బాబా ఆరోగ్యంపై అందరి చూపులు ట్రస్టు వైపే అనుమానంగా చూస్తున్నాయి.. వారి చర్యలనే వేలెత్తి చూపిస్తున్నాయి. అసలు సిమ్స్‌లో ఏం జరుగుతోంది..? బాబా ఎలా ఉన్నారు..? ఆయనకు ఎలాంటి చికిత్సను అందిస్తున్నారు..? వంటి ప్రశ్నలు భక్తులనుంచి శరంపరంగా దూసుకువస్తున్నాయి. 25 రోజులుగా బాబా ఆరోగ్యంపై అవే బులెటిన్లు.. ఒకే రకమైన ప్రకటనలు.. వెలువడుతుండడం భక్తులను గందరగోళానికి గురిచేస్తోంది.

తాజాగా బాబా ఆరోగ్యం విషమంగా ఉందని చేసిన ప్రకటనతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. భక్తులను మానసికంగా సిద్ధం చేయడానికే సత్యసాయి సెంట్రల్ ట్రస్టు, సిమ్స్(శ్రీసత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సెన్సైస్) వర్గాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. బాబా ఆరోగ్యంపై ఉదయం, సాయంత్రం విడుదల చేసే బులెటిన్లు ఇదే విషయాన్ని బలపరుస్తున్నాయి.

‘బాబా భౌతికదేహం ప్రధానం కాదు.. బాబా ఆత్మ ప్రధానం, ఆయన భగవంతుడు. బాబాకు మరణం లేదు’ అని ట్రస్టు సభ్యుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీఏన్ భగవతి బుధవారం ‘నెట్’లో వ్యక్తం చేసిన అభిప్రాయంలోని పరమార్థం కూడా ఇదేననే భావన వ్యక్తమవుతోంది. సిమ్స్, ట్రస్టు అనుసరిస్తున్న వైఖరి వల్ల పుట్టపర్తిలో శాంతిభద్రతల సమస్యల తలెత్తే అవకాశం ఉందని పోలీసు ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై గురువారం ట్రస్టు సభ్యులను ఓ పోలీసు ఉన్నతాధికారి నిలదీసినట్లు సమాచారం.
ట్రస్టు సభ్యులపై పోలీసు ఉన్నతాధికారి ఆగ్రహం!
తాజాగా సత్యసాయిబాబా ఆరోగ్యం పూర్తిగా విషమించిన నేపథ్యంలో గురువారం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని శాంతిభవన్‌లో ట్రస్టు సభ్యులతో మంత్రి గీతారెడ్డి, కలెక్టర్ బి.జనార్దనరెడ్డి, డీఐజీ చారుసిన్హా, ఎస్పీ షహనావాజ్ ఖాసీంలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ట్రస్టు సభ్యులు వ్యక్తం చేసిన అభిప్రాయాలపై ఓ పోలీసు ఉన్నతాధికారి మండిపడినట్లు సమాచారం. ‘‘మీరు సహాయ నిరాకరణ చేస్తే శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవుతుంది. ఏ చర్యలు తీసుకున్నా పారదర్శకంగా తీసుకోండి’’ అని ట్రస్టు సభ్యులకు సూచించినట్లు సమాచారం. పోలీసు ఉన్నతాధికారి ఆగ్రహం వ్యక్తం చేయడంతో ట్రస్టు సభ్యులూ ఒకింత వెనక్కి తగ్గినట్లు తెలిసింది. గురువారం సాయంత్రం 6.30 గంటలకు బీపీ ఒకింత మెరుగుపడటంతో హీమోడయాలసిస్‌ను చేశామని.. కాలేయం పనితీరు ఏ మాత్రం మెరుగుపడలేదని, అవయవాలేవీ సక్రమంగా పనిచేయడం లేదని సిమ్స్, ట్రస్టు వర్గాలు అధికారులకు వివరించినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. అవయవాలన్నింటి పనితీరును మెరుగుపరచడానికి తగు మోతాదులో మందులు ఇస్తున్నామని సిమ్స్ వర్గాలు వెల్లడించాయి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: