ఊరు వదిలిన దళితులు!


కమలాపురం: నాయకులు తమ వద్దకు వస్తున్నారంటే ఊరూ వాడా సంబరపడాలి. విందు భోజనం పెడుతున్నారంటే ఎగిరి గంతేయాలి. ఇందుకు విరుద్ధంగాఇళ్లకు తాళాలు వేసి ఊరుబయట వంటచేసుకుని ఉన్నారంటే ఊహించలేం. కానీ ఇది నిజం. పదేళ్ల క్రితం ఫ్యాక్షన్ రాజకీయాలతో అట్టుడికిన ఊరు అది. కాంగ్రెస్, టీడీపీ నాయకుల వర్గ రాజకీయాల మధ్య చిక్కి శల్యమైన గ్రామమది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కాంగ్రెస్, టీడీపీల దాష్టీకం మాకొద్దంటూ ముక్తకంఠంతో చెబుతున్నారు. కడప పార్లమెంట్ ఉప ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలు ఆ గ్రామానికి ప్రచారానికి వస్తుండగా, ఊరు ఊరంతా ఇళ్లకు తాళాలు వేసి పొలాల్లో వంట చేసుకున్న పరిస్థితి వారినెంతగా కలవర పెడుతుందనేందుకు ప్రత్యక్ష ఉదాహరణ.

అధికార పార్టీ కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి స్వగ్రామం కోగటంకు కూతవేటు దూరంలో ఉన్న ఊరే సంబటూరు. కమలాపురం మండలానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. సుమారు 130 దళితుల ఇళ్లుండగా, 2000 సంవత్సరంలో ఫ్యాక్షన్ హత్యల్లో ఏడు మందిని కోల్పోయిన అనంతరం 50 దళిత కుటుంబాలు ఊరువదిలి వెళ్లాయి. ఎమ్మెల్యే ఆ ఊర్లో స్థానం కోల్పోయారు. టీడీపీని అసహ్యించుకున్నారు. ఇప్పుడా ఊరి దళిత వాడ పూర్తిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది. టీడీపీకి ఉన్నది కేవలం రెండే రైతు కుటుంబాలు. అధికార, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులిద్దరూ చేసిందేమీ లేదు. కనీసం మోరీ (కల్వర్టు) కూడా కట్టించలేకపోయారు. రోడ్లు లేవు, ఇటీవలే 60 మందికి తెల్ల రేషన్ కార్డులు తొలగిస్తే పట్టించుకున్న వారు లేరు. రచ్చబండలో వేడుకున్నా కార్డులివ్వలేదని వాపోయారు. దీంతో మొత్తం దళితులు వైఎస్సార్ కాంగ్రెస్‌కు జైకొట్టారు.

ఫ్యాక్షన్‌లోకి లాగకండి
మీకు దండం పెడతాం తమను మళ్లీ ఆ ఫ్యాక్షన్ ఉచ్చులోకి తేకండంటూ వేడుకుంటున్నారు ఆ ఊరి దళితులు. టీడీపీ నేతలు ఎంవీ మైసూరారెడ్డి, పుత్తా నరసింహారెడ్డి గురువారం ఆ ఊర్లో విందుకు వస్తున్నారని తెలుసుకొని ఊర్లో ఉన్న దళిత వాడంతా ఇళ్లకు తాళాలు వేసి పొల్లాల్లో వంట చేసుకుంటున్నారు. వాళ్లు వచ్చి తమపై ఒత్తిడి తెచ్చి విందుకు ఆహ్వానిస్తారేమోనన్న భయంతోనే ఇలా చేశామని చెప్పారు. మహానేత వైఎస్ మాకు ఇళ్లు కట్టుకునేందుకు ’ 20 వేల చొప్పున ఇచ్చారన్నారు. ఈ ఎన్నికల్లో దళితులమంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తున్నామని, ఇప్పటివరకూ కాంగ్రెస్, టీడీపీ చేసిన ఫ్యాక్షన్ రాజకీయంతో విసిగివేసారి పోయి ఉన్నామని, తమ ఊరు పట్టణానికి దగ్గరలో ఉన్నా కనీసం వార్తాపత్రికలు కూడా ఊర్లోకి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తంచేశారు. పదేళ్లుగా పొరుగు ఊరతనే ఎమ్మెల్యేగా ఉన్నా పట్టించుకున్న పాపాన పోలేదని, ఇంత అధ్వాన్నంగా ఎక్కడా దళిత కాలనీలు లేవని వాపోయారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: