ఇప్పటి దేవుళ్లు… ఒకప్పుడు మానవులే!


హైదరాబాద్: సత్యసాయి బాబా భౌతికకాయం వీడారన్న వార్తల్లో వాస్తవం లేదని.. అవన్నీ కట్టుకథలని భగవాన్ శ్రీసత్యసాయి భక్తుల సంఘం స్పష్టం చేసింది. ‘ఇప్పుడు మనం భగవంతుడిగా భావిస్తున్న వారు ఒకప్పుడు మానవులే. వారు భౌతికకాయం వీడిన వారే. అలాంటి వారు కూడా జీవించినప్పుడు సమకాలికులతో విమర్శలు ఎదుర్కొన్నారు. సత్యసాయి బాబా కూడా అంతే’ అని సంఘం పేర్కొంది. సంఘం సభ్యులు జస్టిస్ ఈశ్వరరావు, మాజీ డీజీపీ ఆర్.ప్రభాకర్‌రావు, మాజీ ఐపీఎస్ అధికారి వి.అప్పారావు, మాజీ ఉన్నతాధికారి పి.ఆర్.రావు, ఎమ్మెల్సీ ఎమ్.వి.రావు, ఎల్వీప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ హెచ్‌ఆర్ డెరైక్టర్ శ్రీనివాస్, నారాయణ విద్యాలయాల డెరైక్టర్ అనిల్‌కుమార్ గురువారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.

తాము కేవలం భక్తులం మాత్రమేనని, తాము చెప్పే విషయాలతో భగవాన్ ట్రస్టుకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రతి వ్యక్తికి ప్రైవసీ హక్కు ఉందని దీనికి భంగం కలిగించడం సమంజసం కాదనే బాబా వైద్య చికిత్సకు సంబంధించిన ఫొటోలు, వీడియో దృశ్యాలను బయటికి వెల్లడించడంలేదని చెప్పారు. తాను అందరిలా మనిషికాదని భగవత్ స్వరూపమని బాబా తెలిపారని, వారికి భౌతికంగా మరణం ఉండదని వివరించారు. ట్రస్ట్‌లో ఉన్న ఐదుగురు సభ్యులు బాబా నియమించిన వ్యక్తులే కావడంతో.. ట్రస్ట్‌లో అవకతవకలు జరిగే అవకాశమే లేదన్నారు.

పుట్టపర్తిలోని బాబా ఆశ్రమంలో అసలు హుండీయే లేదని, ఎవరూ బంగారం కానుకగా ఇచ్చే ప్రసక్తే ఉండదన్నారు. అలాంటప్పుడు బంగారం ఎలా మాయమవుతుందని ప్రశ్నించారు. ట్రస్టుకు వచ్చే నిధులన్నీ చెక్కుల రూపంలోనే వస్తాయని చెప్పారు. ఇది ప్రపంచానికే ఒక ఆదర్శవంతమైన ట్రస్ట్ అని.. దీన్ని అభాసుపాలు చేయడం మంచిది కాదని వారు పేర్కొన్నారు. వైద్యం, విద్య, మంచినీటి సౌకర్యాల కల్పన తదితర సేవలు బాబా చేసిన విధంగా ఇంకెవ్వరూ చేయలేరన్నారు. బాబా తప్పకుండా కోలుకుని ఆయన గతంలో ప్రవచించినట్లుగా 96 ఏళ్లు తప్పకుండా జీవిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: