ఇక మీటరు బాదుడు!


కరీంనగర్: దివగంత వుుఖ్యవుంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం క్రమం గా వుంగళం పాడుతోంది. ఇప్పటికే పలు పథకాలపై ఉక్కుపాదం మోపిన ప్రభుత్వం తాజాగా వ్యవసాయు రంగానికి ఉచిత విద్యుత్ ఎత్తివేసేందుకు సిద్ధవువుతోంది. దీంతో రైతులకు ఏడేళ్ల క్రితం నాటి కష్టాలు పునరావృతవుయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పర్యవసానంగా రైతుల నెత్తిపై ‘విద్యుత్ బిల్లుల’ పిడుగుపడనుంది. వ్యవసాయు కనెక్షన్లకు మీటర్లు బిగించి రీడింగ్ ప్రకారం రైతుల నుంచి బిల్లులు వసూలు చేయునున్నారు. ఇటీవల ప్లానింగ్ కమిషన్‌తో జరిగిన రాష్ట్ర అధికారుల సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది.

వెయైస్సార్ బతికి ఉన్నంతకాలం ఉచిత విద్యుత్‌పై మాట్లాడని ప్లానింగ్ కమిషన్ ఇప్పుడు సబ్సిడీలో కోత విధించాలని సూచించడం, దీనికి రాష్ట్ర ప్రభుత్వం వంతపాడటం రైతులకు శాపంగా పరిణమించనుంది. భూగర్భ జలాల అధిక వినియోగాన్ని సాకుగా చూపి ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్ అహ్లువాలియా ఉచిత విద్యుత్‌కు ఇస్తున్న సబ్సిడీపై కోత విధించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖరాశారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు విధిగా మీటర్లు బిగించాలని సూచించారు. దీంతో ఏడు గంటలకు పైగా విద్యుత్ వాడుకునే రైతులందరు మీటర్ రీడింగ్ మేరకు బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉచిత విద్యుత్ పొందుతున్న రైతుల సర్ చార్జీలను పెంచిన ప్రభుత్వం తాజాగా మీటర్ల బిగింపునకు చర్యలు చేపట్టినట్లు ప్లానింగ్ కమిషన్‌కు స్పష్టం చేసింది. దీంతో ఒకటికి మించి విద్యుత్ కనెక్షన్లు ఉన్న రైతులు ఉచిత విద్యుత్‌కు దూరం కానున్నారు.

రూ.165 కోట్ల భారం
ఉచిత విద్యుత్ ఎత్తివేస్తే జిల్లా రైతాంగంపై ఏటా రూ.165 కోట్ల భారం పడనుంది. జిల్లాలో వ్యవసాయు కనెక్షన్లు 2,62,803 ఉండగా అందులో ఉచిత కనెక్షన్లు 2,35,497 ఉన్నాయి. వురోవైపు సెస్ కింద వ్యవసాయు ఉచిత కనెక్షన్లు 56,613 ఉన్నారుు. 2004 కంటే వుుందు వ్యవసాయు కనెక్షన్లు లక్షన్నర ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున బకారుు పడ్డారు. వెయైస్సార్ వుుఖ్యవుంత్రిగా ప్రవూణం చేయుగానే వ్యవసాయు రంగానికి విద్యుత్ బకారుులను రద్దు చేయుడంతో పాటు ఉచిత కరెంట్ ప్రకటించారు. అప్పటినుంచి 2010-11 ఆర్థిక సంవత్సరం వరకు వ్యవసాయు రంగానికి 37,512 కొత్త కనెక్షన్లు అందించారు. సెస్ పరిధిలో కూడా ఉచిత కనెక్షన్లు వర్తింపజేశారు. వురికొందరు రైతులు కొత్త కనెక్షన్ల కోసం ధరఖాస్తు చేసుకోగా తత్కాల్ పథకం కింద వుంజూరు చేశారు. గత ఆరేళ్ల నుంచి వ్యవసాయు రంగానికి ఉచిత విద్యుత్ సబ్సిడీని ప్రభుత్వం భరిస్తోంది.
వ్యవసాయుం కష్టమే…
జిల్లాలో వ్యవసాయుం అధికంగా బోర్లు, బావులపై ఆధారపడి సాగుతోంది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఆశిం చిన దిగుబడి రాక కనీసం విద్యుత్ బిల్లులు చెల్లించలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వ్యవసాయు రంగానికి సంబంధించిన విద్యుత్ బకారుులు పెద్ద ఎత్తున పేరుకుపోయూరుు. విద్యుత్ సిబ్బంది వ్యవసాయు కనెక్షన్లకు సంబందించిన కెపాసిటర్లు తొలగించి తీసుకెళ్లడంతో పాటు బకారుు వసూళ్ల కోసం ఒత్తిడి చేస్తుండటంతో రైతులకు కరెంట్ అంటే భయుం పట్టుకుంది. ఉచిత విద్యుత్ సరఫరా అనంతరం విద్యుత్ చార్జీల నుంచి రైతులు ఉపశవునం పొందారు. తాజాగా వ్యవసాయు కనెక్షన్లకు మీటర్లు బిగించాలని యోచించడం ఉచిత విద్యుత్‌ను రద్దు చేసే పరిస్థితి కనిపిస్తోంది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: