ఆ నలుగురికి షోకాజ్ జారీ!


హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కొండా సురేఖ (పరకాల), జి.శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి), చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు), ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి (రాజంపేట)లకు పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోగా రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో క్రమశిక్షణ చర్యలు తప్పవని లేఖలో హెచ్చరించారు. ఈ మేరకు ఆయా ఎమ్మెల్యేలకు విడివిడిగా షోకాజ్ నోటీసులు పంపడంతోపాటు వాటి ప్రతులను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్ మల్లు భట్టివిక్రమార్కకు అందజేశారు.
కడప ఎన్నికల ప్రచారానికి ఎంపీ సబ్బం
కడప ఉపఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, విజయమ్మలకు మద్దతుగా ప్రచారం చేసేందుకు ఎంపీ సబ్బం హరి శుక్రవారం బయలుదేరారు. ఇప్పటికే ఆయన జగన్‌కు మద్దతుగా ప్రచారానికి వెళ్లాల్సి ఉన్నా… ఎన్నికలు సమీపించేముందు వాతావరణాన్ని మరింత వేడెక్కించాలని ఆయన భావించారు. జగన్, విజయమ్మలకు ఫ్యాన్‌గుర్తు వచ్చిన శుభసందర్భంలో శుక్రవారం ఆయన కడపకు ప్రయాణమయ్యారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యేలు రవిబాబు, పూడి మంగపతిరావు, జీవీఎంసీ కార్పొరేటర్ రవిరాజు, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకుడు విళ్లా శ్రీనివాసరావు బయలుదేరారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: