కాంగ్రెస్ ‘కళలు’


హైదరాబాద్: తెలుగు లలిత కళా తోరణం..పాతికేళ్ల కిందట అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు నిర్మించిన ఈ ఆడిటోరియం తెలుగువారి సాంస్కృతిక సంపదకు ప్రతీక. తెలుగు కళాకారుల ఆశల హరివిల్లు. రాష్ట్రంలో కళా చైతన్యానికి ఇది వేదికగా నిలిచింది. అటువంటి లలిత కళా తోరణం పేరును మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘తెలుగు లలిత కళా తోరణం’ను ఇకపై ‘రాజీవ్ కళాతోరణం’గా మారుస్తున్నామని, దీని ఆధునికీకరణకు రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి దాత అని రాష్ట్ర ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. దీనిని ఇకపై రాజీవ్ కళా తోరణంగా పిలవాలని అందులో పేర్కొంది. ఈ జీవోపై తెలుగుదేశం పార్టీ మండిపడింది. ఇది బానిస మనస్తత్వానికి నిదర్శనమని, సుబ్బిరామిరెడ్డికి ప్రభుత్వం అమ్ముడుపోయిందని విమర్శించింది. తెలుగు పేరును తొలగించి రాజీవ్ పేరు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుందా? అని నిలదీసింది. ఇందుకు సుబ్బిరామిరెడ్డిని దాతగా పేర్కొంటూ జీవోను విడుదల చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తింది. డబ్బులు ఇస్తే సచివాలయం, అసెంబ్లీ పేర్లను కూడా మారుస్తారా? అని నిలదీసింది. ఆ జీవోను ఉపసంహరించుకోకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించింది. ప్రభుత్వ పథకాలకు రాజీవ్, ఇందిర పేర్లు పెట్టవద్దని ఇటీవల కేంద్ర కేబినెట్ సెక్రటరీ స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చారని, అయినా జ్ఞానం లేకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొందని దుయ్యబట్టారు. మళ్లీ కేంద్రంలో మంత్రి పదవి సంపాదించుకోవడానికో లేదా టీటీడీ అధ్యక్ష పదవిని పొందడానికే సుబ్బిరామిరెడ్డి ఈ ఎత్తు వేశారని ఆరోపించారు. వైఎస్ మాదిరిగా రోశయ్య కూడా ఏడాదికి రూ.20 వేల కోట్లు సంపాదించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారని, అందుకే ఇలాంటి వాళ్లను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. తెలుగు జాతి ఉనికిని దెబ్బతీసేలా తెలుగు లలిత కళా తోరణాన్ని రాజీవ్‌గాంధీ పేరిట మార్చడానికి ప్రభుత్వం పూనుకోవడం తెలుగు జాతిని సిగ్గుతో తలవంచుకునేలా చేయడమేనని తెలుగుదేశం పార్టీ మండిపడింది. తెలుగు జాతి గౌరవాన్ని భ్రష్టుపట్టించే కుటిల యత్నాల్లో భాగంగా జరుగుతోన్న ఈ ప్రయత్నం కాంగ్రెస్ బానిస మనస్తత్వానికి నిదర్శనమని ఆ పార్టీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పి.సాయిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: