హైదరాబాద్: హైకోర్టు సూచనలను పరిగణనలోకి తీసుకుని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్ పదవి నుండి కుసుమ కుమారిని శాశ్వతంగా తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి గురువారం గవర్నర్ నరసింహన్ ఆమోదంతో ఉన్నతవిద్య ముఖ్యకార్యదర్శి బిశ్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు. వర్సిటీ పాలకమండలి అనుమతి లేకుండా అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంలోనూ, ఇతర కార్యక్రమాల్లోనూ అక్రమాలకు పాల్పడ్డారని విసి కుసుమకుమారిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. దానిపై అప్పట్లో విద్యార్థిసంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. విసి పదవి నుండి కుసుమకుమారిని తొలగించాలని పట్టుబట్టాయి. చివరకు విద్యార్థిసంఘాల ఒత్తిడి మేరకు ప్రభుత్వం దిగివచ్చి ఆమెపై వచ్చిన ఆరోపణలను అనేక దఫాలుగా చర్చించింది. దానికోసం జస్టిస్ హనుమంతప్ప కమిటీని వేసింది. నివేదిక ఆధారంగా ఆరోపణలు నిజమని తేలడంతో ఆమెను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తన వివరణ తీసుకోకుండా అన్యాయంగా తొలగించారని ఆమె హైకోర్టును ఆశ్రయించింది. నెలరోజుల్లో ఎందుకు తొలగిస్తున్నారో తెలపాలని, ఆమె నుండి వివరణ తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటివరకు విసిగానే కొనసాగుతుందని, విధులకు దూరంగా ఉంటారని హైకోర్టు తెలిపింది.
Filed under: వార్తలు |
Leave a Reply