ఆ లాభాలు రక్తం కూడు: మారెప్ప


హైదరాబాద్: ‘రక్త చరిత్ర’ సినిమాపై వచ్చే లాభాలను తింటే రామ్‌గోపాల్ వర్మ రక్తపు కూడు తిన్నట్లేనని మాజీ మంత్రి మారెప్ప వ్యాఖ్యానించారు. ఆ చిత్రంలోని అంశాలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. రాయలసీమ ప్రజల మనోభావాలు దెబ్బతినే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాయలసీమలో ఫాక్షనిజం లేదని, సినిమా ద్వారా వర్మ పాత పుండును కెలుకుతున్నారని ఆయన అన్నారు. సమరసింహారెడ్డి సినిమానుంచే ఈ ట్రెండ్ మొదలైందని, అప్పుడు కూడా తాను ఆ సినిమాను విమర్శించానని చెప్పారు. తాను ‘రక్త చరిత్ర’ను చూడలేదని, ఆ చిత్రం తాలూకు ప్రోమోలను చూశానని మారెప్ప పేర్కొన్నారు. నరికేసిన ఫ్యాక్షన్ చెట్టుకు ‘రక్తచరిత్ర’ సినిమా ద్వారా నీళ్ళు పోసి చిగురింపజేస ప్రయత్నం చేస్తున్నాడని, ఫ్యాక్షన్ నాయకులను మళ్ళీ ప్రేరేపించేలా ఈ చిత్రం ఉందని వర్మపై ధ్వజమెత్తారు.

Leave a comment