శ్రీకృష్ణకు పోటీగా మరో కమిటీ


హైదరాబాద్: రాష్ట్రంలో పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీకి పోటీగా మరో కమిటీ తెర పైకి వచ్చింది. నూతన రాష్ట్రాల జాతీయ సమాఖ్య అధ్యక్షుడు, సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత అమర్‌ సింగ్‌ నేతృత్వంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటు అవసరాన్ని ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. తెలంగాణ, గూర్ఖాల్యాండ్‌, పూర్వాంచల్‌, బుందేల్‌ఖండ్‌ తదితర రాష్ట్రాల ఏర్పాటు అవసరంపై అధ్యయనం చేస్తామని రాష్ట్రంలో నేతృత్వం వహించనున్న న్యాయవాది నిరూప్‌ రెడ్డి తెలిపారు. తమ కమిటీకి జస్టిస్‌ శ్రీకృష్ణ కన్నా సీనియర్‌ అయిన సుప్రీంకోర్టు రీటైర్డ్‌ న్యాయమూర్తి నేతృత్వం వహిస్తారని, అయితే ఆయన పేరును వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాడు మాత్రమే ప్రకటిస్తామన్నారు. కమిటీ నేతృత్వంలో పని చేసే పీపుల్స్‌ ట్రిబ్యునల్‌లో ప్రముఖ జర్నలిస్టులు కులదీప్‌ నయ్యర్‌, కుష్వంత్‌ సింగ్‌, బీజీ వర్ఘీస్‌, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్‌ సుభాష్‌ కాశ్యప్‌, రచయిత్రి పుష్పా మైత్రేయి సభ్యుడుగా ఉంటారు. తెలంగాణ ప్రజల వాణి వినిపించేందుకే తమ కమిటీ పని చేస్తుందన్నారు. రాజకీయ పార్టీలన్నీ స్వప్రయోజనం కోసమే పని చేస్తున్నాయని, తమకు కృష్ణ కమిటీ మీద ఎలాంటి విశ్వాసం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని విడగొట్టటానికి ఇంత హంగామా అనవసరం అని, శ్రీకృష్ణ కమిటీ డిసెంబర్‌ 31న కేంద్రానికి నివేదిక సమర్పించిన మరుసటి రోజే తమ కమిటీకి ఎవరు నేతృత్వం వహించేదీ చెబుతామన్నారు. శ్రీకృష్ణ కమిటీ కోసం ఖరారైన విధి విధానాల్లో తెలంగాణ అంశమే లేదన్నారు. ఈనెల 22న అమర్‌ సింగ్‌, ఇతర కమిటీ సభ్యులు ఆదిలాబాద్‌ జిల్లాలో పర్యటించి ఆత్మహత్యలు చేసుకున్న వివరాలు సేకరిస్తారన్నారు. దీనితో పాటు ఇతర అంశాలన్నిటినీ ట్రిబ్యునల్‌ సభ్యులు డిసెంబర్‌లోగా అధ్యయనం చేసి జనవరిలో తమ కమిటీకి నేతృత్వం వహించే సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జికి నివేదిక రూపంలో సమర్పిస్తారని, ఆయన దాన్ని అధ్యయనం చేసి ఫిబ్రవరి ఒకటి లోగా తన నిర్ణయాన్ని తెలియజేస్తారని నిరూప్‌ రెడ్డి తెలిపారు. తమకు సంబంధించినంత వరకు డిసెంబర్‌ 31 ముఖ్యమైన దినం అని వ్యాఖ్యానించారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై తమకు ఆసక్తి కూడా లేదని నిరూప్‌ రెడ్డి తెలిపారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: