రాష్ట్ర భౌగోళిక విభజనే, ప్రజల విభజన కాదు


హైదరాబాద్: రాష్ట్రాన్ని భౌగోళికంగా విభజించాలనే వాదన మాత్రమే వచ్చింది గానీ ప్రజలను కాదని కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. డిసెంబర్ 9వ తేదీన తెలంగాణపై ప్రభుత్వం చేసింది ప్రకటన మాత్రమేనని ఆయన అన్నారు. ఓ తెలుగు న్యూస్ చానెల్ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన సోమవారం రాత్రి మాట్లాడారు. సమైక్యవాదం ఉద్యమం కాదని, అంతర్లీన భావన మాత్రమేనని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక వల్ల ప్రజల్లో తప్పకుండా మార్పు వస్తుందని ఆయన ఆశించారు. భావోద్వేగాలను బట్టి నివేదిక ఇవ్వబోమని శ్రీకృష్ణ కమిటీ చాలా సార్లు స్పష్టం చేసిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో యువకుల ఆత్మహత్యలకు తానే కారణమన్న ఆరోపణను ఆయన ఖండించారు. నవంబర్ 29వ తేదీన మొదటి ఆత్మహత్య జరిగిందని, దానికి తాను ఎలా కారమవుతానని ఆయన అన్నారు.

కాంగ్రెసు నాయకుల మాటల్లో వ్యత్యాసం ఉన్నా అందరం సోనియా బాటలోనే నడుస్తామని ఆయన చెప్పారు. భావోద్వేగాలనే కాకుండా వాస్తవాలను, చరిత్రను కూడా అధ్యయనం చేయాలని తాను శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇచ్చినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నవంబర్ 1వ తేదీని విద్రోహంగా పాటించడం హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావును అవమానించడమేనని ఆయన అన్నారు. రాష్ట్రావతరణ కోసం బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నారని, అందుకు బూర్గులను కొనియాడాలని ఆయన అన్నారు. బతుకమ్మ ఒక ప్రాంతానికి చెందిన పండుగ కాదని, ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా నిర్వహించుకుంటారని, అటువంటి పండుగను ఒక ప్రాంతానికి పరిమితం చేయడం సరి కాదని ఆయన అన్నారు.

భూకంపం సృష్టిస్తామన్నవాళ్లు శాంతి మార్గంలో లక్ష్య సాధనకు కృషి చేయడానికి ముందుకు రావడం హర్షనీయమని ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును ఉద్దేశించి అన్నారు. కెసిఆర్ తో వ్యక్తిగత భేదాభిప్రాయాలు లేవని, కెసిఆర్, తవని అభిప్రాయాలు వేర్వేరని, తన అభిప్రాయాలను మాత్రమే కెసిఆర్ అభినందించారని ఆయన చెప్పారు. గద్దర్ ప్రజా ఫ్రంట్ గురించి ఇప్పుడు మాట్లాడితే అపోహలకు దారి తీస్తుందని ఆయన అన్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: