మంచితరుణం మించిన దొరుకదు!


తిరువనంతపురం: కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా? అక్టోబరు 10 ఆదివారం రాత్రి ప్రారంభించండి. మంచి సమయం ఇంతకన్నా మించిన దొరకదు. ఈ అసాధారణమైన అంకెల కలయిక చాలా పవిత్రమైనదని న్యూమరాలజిస్టులు (సంఖ్యాశాస్త్రజ్ఞులు) అంటున్నారు. 10-10-2010 చాలాచాలా మంచిదని వారు సెలవిస్తున్నారు. న్యూమరాలజిస్టు ఎన్‌.రవీంద్రన్‌ నాయర్‌ మాట్లాడుతూ ఈ సంఖ్య వర్ధమాన ప్రజాస్వామ్య దేశాలకు మంచిదని చెప్పారు. గురుగ్రహం శుభదృక్కులను ప్రసరిస్తోందన్నారు. ప్రభుత్వ యంత్రాంగాల మధ్య మెరుగైన సమన్వయం ఉంటుందని మహిళలకు మరిన్ని అధికారాలు సంక్రమిస్తాయని, యువతలో విద్యావంతులు అధికంగా ఉంటారని తెలిపారు. ఈ సంఖ్యల్లో 1 సూర్యునికి ప్రతీక అన్నారు. మనం కళకళలాడటానికి ఇది ముఖ్యం అని చెప్పారు. కాని జ్యోతిష్కులు మరో విధంగా చెబుతున్నారు. త్రిస్సూర్‌లోని జ్యోతిష్కుడు ఎ.ఎన్‌.చెట్టియార్‌ మాట్లాడుతూ 10-10-2010 లోని మొత్తం అంకెలను కూడినట్లయితే 5 వస్తుందని ఇది సానుకూలమైన అంకె అని అన్నారు.

కాగా బుధుడు ఇందుకు అధిపతి అని చెప్పారు. కాని బుధుడు ఇపుడు అంటే ప్రస్తుత సమయంలో బలహీనంగా ఉన్నాడన్నారు. అన్నిరకాల కమ్యూనికేషన్‌కు ఆయన మూలమన్నారు. మధ్యవర్తిత్వానికి కూడా కారకుడన్నారు. కాని చెడు ప్రభావంలో ఉన్నాడన్నారు. కొద్ది మాసాల వరకు ఇలాగే ఉంటుందన్నారు. దాంతో మన దేశానికి ముప్పు హెచ్చరికలు ఎదురవుతాయన్నారు. అయితే ఈ సంఖ్యవల్ల కొన్ని ప్రయోజనాలు, నష్టాలు కూడా ఉన్నాయన్నారు. చాలామంది పది నంబరు చాలా మంచిదని, సౌఖ్యదాయకమని, వ్యాపారాలకు మంచిదని చెబుతున్నారు. ఈ విశ్వాసాన్ని నగదుగా కూడా చేసుకున్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: