భక్తిశ్రద్ధలతో దసరా పూజలు


కిటకిటలాడిన శక్తిపీఠాలు
భువనేశ్వర్: దసరా మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. శనివారం బరంపురంలోని వివిధ అమ్మవారి ఆలయాలు, శక్తిపీఠాలు,గంజాం జిల్లాలోని తరాతరిణి, మొహురికాళువ, సిద్ధ హరఛండి, సిద్ధ భైరవి తదితర ఆలయాల్లో ఉత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. నీలకంఠనగర్‌ హౌసింగు బోర్డులోని వేదమాత గాయత్రీదేవి ఆలయంలో దసరా ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద భవనంలో మహామేరు శ్రీచక్ర యంత్రరాజము, గాయత్రీమాత విగ్రహాలకు భక్తులు పంచామృతాభిషేకాలు జరిపారు. సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు.

అర్చకులు వనమాలి వేంకటరమణ, వేద పండితులు వనమాలి శివప్రసాద్‌, మావుడూరి చంద్రశేఖర శర్మలు కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగు బ్రాహ్మణ సేవా సంఘం ప్రముఖులు వీటిని పర్యవేక్షించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు అమ్మవారికి సమర్పించిన వివిధ రకాల చీరలను రూ.80 నుంచి రూ.వెయ్యి వరకూ విక్రయిస్తున్నామని, వచ్చిన ఆదాయాన్ని ఆలయం అభివృద్ధికి డిపాజిట్‌ చేస్తామని సంఘం కోశాధికారి సోమయాజులు శాంతమూర్తి తెలిపారు. డైమండ్‌ ట్యాంకు రోడ్డులో శ్రీ విరాట్‌ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామీజీ భక్తసమితి ఆధ్వర్యంలో శ్రీ కామాక్షిదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

అమ్మవారి సన్నిధిలో కుంకుమార్చనలు జరిపారు. మార్తాపేటలోని శ్రీ సిద్ధేశ్వరస్వామి కల్యాణ మండపం ఆవరణలోని శ్రీ రామలింగ చౌడేశ్వరి ఆలయంలో నవరాత్రి పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇక్కడ శరన్నవరాత్రుల్లో తొలిసారిగా అమ్మవారికి వివిధ రకాల అవతారాలతో అలంకరించేందుకు ఏర్పాట్లు జరిగిన సంగతి విదితమే. తొలిరోజు అమ్మవారిని రజిత ఆభరణాలతో అలంకరించారు. ఉత్సవాల సందర్భంగా కుంకుమ పూజలు, హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థానం అర్చకులు నేతేటి ఉమామహేశ్వర శర్మ వీటిని పర్యవేక్షించారు.

ఆయా పూజా కమిటీల నిర్వాహకులు కలశయాత్రలు చేపట్టారు. చెరువుల నుంచి పవిత్ర జలాలను తీసుకొచ్చి మండపాల్లో కలశస్థాపన జరిపారు. మహిషాసుర మర్ధని ముఖదర్శనం ఏర్పాటైంది. సర్వదేవతల ఆవాహనం, భగవతి, దుర్గాదేవిలకు షోడసోపచార పూజలు జరిపారు. తర్వాత చండీపాఠం, హోమం నిర్వహించారు. తొలిరోజు కొమ్మాపల్లి, పాతబస్టాండు, మయూరీ టవర్స్‌ కూడలి తదితర ప్రాంతాల్లో విగ్రహాల ముఖదర్శనం జరిగింది. నగరంలో 32కు పైగా పూజా వేదికలు ఏర్పాటవుతుండగా, కమిటీల నిర్వాహకులు పోటాపోటీగా మండపాల అలంకరణ, గుడ్డపెండాళ్లు, విద్యుద్దీపాలు తదితరాలు ఏర్పాటు చేస్తున్నారు.

పర్లాకిమిడిలో దసరా వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభ మయ్యాయి. తెలుగు మహిళలు మూడు ప్రాంతాలలో జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొమ్మిది రోజులపాటు టవున్‌హాల్‌, బాలసదన్‌, కన్యకాపరమేశ్వరి ఆలయంలో కుంకుమార్చనలు జరుగుతాయి. వనమాలి మాణిక్యశర్మ ఎస్‌.దుర్గారావు పంతులు నేతృత్వంలో టవున్‌హాల్‌లో పూజలు జరుగుతున్నాయి. శ్రీ మాతా ఛారిటబుల్‌ ట్రస్ట్‌ నేతృత్వంలో బాలసదన్‌లో లలితా త్రిపుర సుందరీదేవి సామూహిక కుంకుమార్చనలు ప్రారంభమయ్యాయి. కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద కూడా పూజలు జరుగుతున్నాయి. అన్ని ప్రధాన కూడళ్ల వద్ద పూజలు, ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాల అలంకరణతో పట్టణానికి శోభ వచ్చింది.

జంట నగరాల్లో శుక్రవారం నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. కటక్‌లో వెంకటేశ్వర కాశీ విశ్వేశ్వర ఆలయంలో దుర్గాదేవి విగ్రహం వద్ద పూజలు ప్రారంభమయ్యాయి. ఉదయం కలశ స్థాపన, దీపారాధన, సహస్రనామ పూజలు జరగ్గా, సాయంత్రం మళ్లీ సహస్రనామ పూజలు, మంగళ హారతి నిర్వహించారు. వందలాది భక్తులు తొలి పూజల్లో పాల్గొని దేవిని ఆరాధించారు. 17వ తేదీ వరకు నవరాత్రి వేడుకలు జరుగుతాయి. పూజల్లో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొనాలని ఆలయ కమిటీ కార్యదర్శి ఐ.వి.రాజు కోరారు. రాజధానిలో నవరాత్రి వేడుకలకు జనతా మైదానంలో భారీ ఏర్పాట్లు చేశారు. విగ్రహ ప్రతిష్ఠతో పాటు కళాకారులచే సైకత కళాఖండాలు రూపొందించారు. సాయంత్రం దాండియా నృత్యాలు నిర్వహించారు.

రాజరాజేశ్వరి సర్వమంగళ శక్తిపీఠం ఆధ్వర్యంలో నవ చండీ మహాయజ్ఞం నిర్వహించారు. ఉదయం బిందుసాగర్‌ ప్రాంతం నుంచి 108 కలశాలతో మహిళలు నీరు సేకరించి భాజా భజంత్రీలతో వూరేగిస్తూ రాష్ట్రభాష పరిషత్‌ ప్రాంతంలోని ఆలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం యజ్ఞం నిర్వహించారు. గుజరాత్‌ నుంచి వచ్చిన సాధువుల నేతృత్వంలో యజ్ఞం జరిపినట్లు నిర్వాహక సంస్థ అధ్యక్షుడు కృష్ణచంద్ర గోచాయత్‌ తెలిపారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: