కిడ్నాప్‌కు గురైన చైతన్య హత్య


హైదరాబాద్: సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలో మూడు రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన విదేశీ మారకం బదిలీ సంస్థ ఉద్యోగి చైతన్య హత్యకు గురయ్యాడు. నల్గొండ జిల్లా బొమ్మల రామారం వద్ద చైతన్య మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ నెల 6వ తేదీన కిడ్నాప్‌కు గురైన చైతన్య అదే రోజు హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సోమాజీగూడలోని సెంట్రల్‌ ఫారిన్‌ ఎక్స్చేంజ్‌ సంస్థలో పనిచేసే చైతన్య 6వ తేదీ ఉదయం… రూ. 5 లక్షలతో ఇంటి నుంచి కార్యాలయానికి బయలుదేరాడు. చైతన్య తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. డబ్బుల కోసమే హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: