‘కాశ్మీర్‌లో గవర్నర్‌ పాలన విధించాలి’


పాట్నా: జమ్మూ-కాశ్మీర్‌లో శాంతిని నెలకొల్పే నిమిత్తం ఆ రాష్ట్రంలో గవర్నర్‌ పాలన విధించాలని, నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు మద్దతును కాంగ్రెస్‌ ఉపసంహరించాలని పాంథర్స్‌ పార్టీ అధ్యక్షుడు భీమ్‌సింగ్‌ ఆదివారం సలహా ఇచ్చారు. పాట్నాలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఆ లోయలో శాంతిని తిరిగి నెలకొల్పేందుకు జమ్మూ-కాశ్మీర్‌లో గవర్నర్‌ పాలన విధించాలని, భారత్‌లో ఆ లోయ విలీనంపై వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లాపై కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. భారత్‌లో కాశ్మీర్‌ విలైనంపై ప్రశ్నలు లేవనెత్తే హక్కు అబ్దుల్లాకు ఎవరూ ఇవ్వలేదంటూ, కనీసం ఆరునెలలైనా ఆ లోయలో గవర్నర్‌ పాలన విధించాలన్నారు. సంపూర్ణ విప్లవంకోసం 1974లో పిలుపునిచ్చిన జయప్రకాశ్‌నారాయణ్‌ అజెండాను అమలు చేయాలన్న ఉద్దేశంతో బీహార్‌లో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ 50 స్థానాల్లో పోటీ చేస్తుందని సింగ్‌ ప్రకటించారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: