29న రాష్ట్ర మత్సకారుల సహకార సంఘ ఎన్నికలు


రంగారెడ్డి: రాష్ట్ర మత్సకారుల సహకార సంఘ పాలక వర్గానికి సెప్టెంబర్‌ 29న ఎన్నికల నిర్వహించనున్న దృష్ట్యా జిల్లాలోని 44 మత్సకారుల సొసైటీల సభ్యులు ఈ ప్రక్రియలో భాగస్వాములు అవ్వాల్సిందిగా రంగారెడ్డి జిల్లా మత్సశాఖ సహాయ సంచాలకులు రుహామా బెంజిమెన్‌ నేడొక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర స్థాయిలో 27 డైరెక్టర్ల పోస్టులకు ఎన్నికలు జరుగుతాయని, జిల్లాకు ఒకటి చొప్పున 23 జిల్లాలకు ప్రాతినిధ్యం ఉంటుందని ఆమె వెల్లడించారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాను తమ కార్యాలయంలో సెప్టెంబర్‌ 17న ప్రచురిస్తామని, నామినేషన్లు మాసబ్‌ట్యాంక్‌ లోని మత్స భవన్‌లో గల మేనేజింగ్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో ఈ నెల 18న దాఖలు చేయవచ్చని ఆమె తెలిపారు. నామినేషన్ల పరిశీలన సెప్టెంబర్‌ 20న జరుగుతుందని, నామినేషన్ల ఉపసంహరణ సెప్టెంబర్‌ 21 ఉదయం 11 గంటల నుండి మద్యాహ్నం 3 గంటల వరకు ఉంటుందని, అదే రోజు సాయంత్రం అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించడం జరుగుతుందని ఆమె తెలిపారు. సెప్టెంబర్‌ 29న తమ కార్యలయంలో ఉదయం 9 నుండి మద్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తామని, అక్టోబర్‌ 1 న మత్స భవన్‌లో ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారని ఆమె తెలిపారు. నామినేషన్ల పత్రాలను మాసబ్‌ట్యాంక్‌లోని మత్స భవన్‌లో లభ్యవవుతాయని ఆమె పేర్కొన్నారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: