శ్రీకృష్ణదేవరాయలు రైతులకు, ప్రజలకు దగ్గర పాలన


తిరుపతి: శ్రీకృష్ణదేవరాయలు రైతులకు, ప్రజలకు దగ్గరగా పాలన సాగించి నేటి తరానికి ఆదర్శప్రాయులైనారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి గల్లా అరుణకుమారి అన్నారు. సోమవారం స్థానిక వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనేట్‌ హాలు నందు వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాచ్య పరిశోధనా సంస్థ మరియు ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయల చారిత్రక, సాహిత్య, సాంస్కృతిక వైభవం అన్న అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ రాయల వారు ప్రతినిత్యం ప్రజా సంక్షేమం, ప్రజలకవరసమైన పనులు చేయడంలో తరించే తత్వం కలిగిన వారన్నారు. నీటి యాజమాన్యం, నీటి ఎద్దడి, రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ఆదర్శప్రాయులైనారు. కళలను ఎల్లప్పుడూ తన మనసుకు దగ్గరగా, అష్టదిగ్గజాలను పూర్తిగా ప్రోత్సహించి, కవులకు సమున్నత స్థానం కల్పించిన మహాకళాపోషకుడన్నారు. రాయలు చేసిన మంచి పనులు ఇంతకాలానికి కూడా మరుగున పడకుండా, గుర్తుండేలావున్నాయన్నారు.

వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య యన్‌ ప్రభాకర రావు ప్రసంగిస్తూ రాయల జీవితంలో అడుగడుగునా లలితకళాపిపాసత్వం కనబడుతున్నదని, సంగీతం, సాహిత్యాలపై మక్కువ ఎక్కువేనన్నారు. భువన విజయం మండపం నిర్మించి పెద్దన, తిమ్మన, రామకృష్ణుడు వంటి కవులతో నిరంతరం సాహితీ సభలు నిర్వహించి తన ఆసక్తిని చాటుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజక్టు డైరెక్టర్‌ డా. మేడసాని మోహన్‌ గారు ఆముక్తమాల్యద ప్రబోధ సౌందర్యం అన్న అంశంపై ప్రసంగించారు. ద్రావిడ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య కడప రమణయ్య, ప్రాచ్య పరిశోధన సంస్థ డైరెక్టర్‌ (ఇన్‌ ఛార్జ్‌) ఆచార్య వేమూరి వెంకటరమణా రెడ్డి, సదస్సు సంచాలకులు ఆచార్య చిట్రాజు గోవిందరాజు, వేంకటేశ్వర విశ్వ విద్యాలయ రిజిస్ట్రార్‌ ఆచార్య జె. ప్రతాప రెడ్డి ప్రసంగించారు. ఈ సదస్సులో ఆంధ్ర ప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల నుండి విచ్చేసిన ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: