రాజకీయలబ్ధి కోసమే తపన


హైదరాబాద్: రాజకీయలబ్ధి కోసమే చంద్రబాబునాయుడు తెలంగాణ పర్యటన మొదలుపెట్టారని రాష్ట్రమంత్రిణి డికె అరుణ విమర్శించారు. ప్రజలకు ఇది తెలుసు కాబ ట్టే ఆయన కాన్వాయ్‌కు అడ్డుతగిలారన్నారు. తన 9 ఏళ్ల పాలనలో చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. పాలమూరు జిల్లాను దత్తత తీసుకుంటున్నట్లు తన హయాంలో బాబు ప్రకటించారని కాని తర్వాత జిల్లాకు ఒరిగింది ఏదీ లేదని ఆ జిల్లా పరిస్థితులలో మార్పురాలేదని చెప్పారు. రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని రైతులకు సక్రమంగానే అందుతున్నాయని కాని ఈ అంశాన్ని సాకుగా తీసుకుని ఆయన రైతులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవటంతో పాటు రాష్ట్రంలో పార్టీ పట్టు కోల్పోవటంతో అంతకు ప్రజాసమస్యలపై లేని శ్రద్ధ ఇపుడు కొత్తగా ఆయనకు పుట్టుకువచ్చిందన్నారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: