మౌళిక సదుపాయల కల్పనకు నిధులు మంజూరు


నెల్లూరు: జిల్లాలో మొదటి రెండు విడతలలో 124 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల నిర్మాణానికి మరియు మౌళిక సదుపాయల కల్పనకు 37 కోట్ల 50 లక్షల రూపాయలు నిథులు ప్రభుత్వం నుంచి త్వరలో విడుదల కానున్నాయని ఇప్పటికే, 64 పాఠశాలల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి 20 కోట్ల రూపాయలు మంజూరైనాయని జిల్లా పరిషత్‌ చైర్మెన్‌ కాకాణి గోవర్థన్‌ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ ఛాంబర్‌ లో విద్యాశాఖాధికారులతో ఉపాధ్యాయుల కౌన్సిలింగ్‌ రాష్ట్రీయ మాథ్యమిక శిక్షాఅభయాన్‌ పథకం క్రింద మొదటి విడత ఎంపికైన ఉన్నత పాఠశాలల నిర్మాణాల పురోగతిని ఛైర్మన్‌ సమీక్షించారు. అలాగే రెండవ విడత, మూడవవిడత ఎంపికకు పంపించాల్సిన స్కూళ్ల జాబితాను తయారుచేసి పంపడం, వాటికి ఏవిధంగా మార్గదర్శకాలు రూపొందించాలి తదితరాలపై అంశాలపై ఆయన అధికారుతో చర్చించారు. రెండు, మూడు విడతలలో జిల్లా స్థాయి నుంచి ఎంపిక చేసే పాఠశాలలో ప్రధానంగా ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలు, కనీస వసతులులేని పాఠశాలలు ఎంపిక చేసుకొని వాటి వివరాలు సేకరించడం జరిగిందన్నారు. సదరు 124 పాఠశాలల నిర్మాణానికి రాష్ట్రీయ మాథ్యమిక శిక్షాఅభయాన్‌ పథకం క్రింద ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. వీటికి సంబందించి మొదట విడత క్రింద మొత్తం రు 31 లక్షల 31 వేల రూపాయలు రు. 6 లక్షల వంతున స్కూలు మేనేజ్‌మెంట్‌ కమిటీలకు నిథులు విడుదల చేయడం జరిగిందన్నారు. ఆ పాఠశాలల నిర్మాణాలన్నింటికి ఆన్‌లైన్‌ టెండర్లు పిలవడం జరిగిందన్నారు. సదరు పనులు వెంటనే ప్రారంభించాలని విద్యాశాఖ మరియు వెల్‌ఫేర్‌ శాఖల ఇ.ఇ. శ్రీ నరసింహమూర్తి ని ఛైర్మన్‌ ఆదేశించారు. మొదటి విడత ఎంపిక కాబడిన పాఠశాలలో నాయుడుపేట బాలికల ఉన్నత పాఠశాల, నెల్లూరు మండలం బుజ బుజ నెల్లూరు ఉన్నత పాఠశాలలకు స్థలాలు లేవని ఇ.ఇ. తెలిపారు. అందువలన సదురు రెండు పాఠశాలలో నిర్మాణాలు చేపట్టడం లేదన్నారు. రాష్ట్రీయ మాథ్యమిక శిక్షాఅభయాన్‌ పథకం క్రింద రెండు, మూడు విడతలలో ఎంపిక చేసిన పాఠశాలల నిర్మాణాలకు సంబందించి స్థలాల వివరాలు సేకరించడం జరిగిందని సదరు ఉన్నత పాఠశాలల నిర్మాణాలకు సరిపడ స్థలాలు ఉన్నవని నిర్థారించిన స్కూల్స్‌ ను ఏంపికచేయడం జరిగిందని తెలిపారు. ఏవైనా లోపాలు ఉంటే వాటికి ప్రత్యామ్నాయంగా మంజూరుకు ప్రభుత్వాని కోరడం జరుగుతుందన్నారు. జిల్లాలో మిగిలిన అన్ని పాఠశాలలకు కూడా రాబోయే విడతలలో పూర్తిస్థాయి మౌళిక సదుపాయాలతో అభివృద్దిచేయడం జరుగుతుందని తెలిపారు. ఉపాధ్యాయులకు పదోన్నతికి సంబందించి అర్హు లైన వారి జాబితాను తయారుచేసి ఇవ్వాల్సిందిగా డిప్యూటి డి.ఇ.ఓ లను ఛైర్మన్‌ కోరారు. ఉపాద్యాయుల కౌన్సిలింగ్‌ పారదర్శకంగా ఎటువంటి లోపాలకు తావు లేకుండా, ఎటువంటి యిబ్బందులు తలెత్తకుండా కౌన్సిలింగ్‌ పూర్తిచేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలొ శాసన మండలి సభ్యులు విఠపు బాలసుబ్రమణ్యం, డిప్యూటి సి.ఇ.ఓ. యస్‌. ఆంజనేయరాజు, విద్యాశాఖ మరియు వెల్‌ఫేర్‌ శాఖల ఇ.ఇ. నరసింహమూర్తి, డిప్యూటి డి.ఇ.ఓ.లు ఐ. ప్రసన్నాంజనేయులు, వి.యస్‌. ప్రసాద్‌, బాష, తదితరులు పాల్గొన్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: