ప్రజా సమస్యలపై త్వరలో ప్రభుత్వ జివో జారీ


హైదరాబాద్: ప్రజా సమస్యల పరిష్కార వేదికను అన్ని జిల్లాలలో పఠిష్టంగా అమలు చేయుటకు నియమ నిబందనలతో ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయ్యనుందని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నటరాజన్‌ గుల్జార్‌ తెలిపారు . సోమవారం కలెక్టరేటు సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌ పలువురి నుండి అర్జీలను స్వీకరించి జిల్లా అదికారులకు తగిన చర్యల నిమిత్తం ఆదేశాలిచ్చారు . జిల్లా అదికారులు సమస్యల పరిష్కారం జాప్యం చేస్తున్నారని ఇక పై సహించేది లేదని అన్నారు . అధికారులు ఆవసరమైతే నిద్ర ఆహరాలు మాని సమస్యల పరిష్కారానికి సహకరించాలన్నారు . ఇంకా డిఇవో పరిదిలో 13, సిఅర్వో 3, బిసి సంక్షేమం-2, ధరఖాస్తులు పెండింగ్‌ లో ఉండగా తహసిల్దారుల వద్ద ఉన్న పెండింగ్‌ సమస్యలకు ఆర్‌ డి వో లు భాద్యత తీసుకోవాలన్నారు . ముఖ్య ప్రణాళికాదికారి సమన్వయంతో ఆందరు వచ్చే సోమవారంలోగా ధరఖాస్తులను పరిష్కరించి నిల్‌ రిపోర్టు ఇవ్వాలని, పరిష్కారం కాని సమస్యలకు తగిన కారణాలు చూపాలని ఆదేశించారు . ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అనేక మంది తమ సమస్యలను కలెక్టరుకు విన్నవించుకొన్నారు . జియగూడలోని పురానాపూల్‌ నుండి ఎం .ఎ .బాసిత్‌ మాజీ కార్పోరేటరు స్థానిక స్మశాన స్థలం 13 ఎకరాలు ఆక్రమించి కొందరు అక్రమ నిర్మాణాలు చేపడ్తున్నారని వాటిని నిలుపుదల చేసి స్మశాన స్థలంను పరిరక్షించాలని కోరారు .కలెక్టర్‌ స్పందిస్తూ వెంటనే వెళ్లి పరిశీలించి రేపటిలోగా నివేదిక ఇవ్వాలని ఆర్‌ డి వో ను ఆదేశించారు . కె .మోహన్‌ రెడ్డి అనే అతను 2000 సం .ములో డి ఎస్‌ సి లో 61 .62 శాతం మార్కులు సాదించి మెరిట్‌ లో ఉన్నప్పటికితనకు ఇప్పటివరకు ఎస్‌ జి టి టీచరుగా పోస్టింగ్‌ ఇవ్వలేదని తాను సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం సేకరించి పరిశీలస్తే నాన్‌ లోకల్స్‌ కు ఎక్కువ పోస్టులు ఇచ్చారని తెలిపారు . 610 జివో ప్రకారం ఉండాల్సీన కోటా కంటే వాళ్లు ఎక్కువ ఉన్నారని వారిని వారి జిల్లాలకు పంపించి తమకు పోస్టింగ్‌ ఇవ్వాలని కలెక్టర్‌ కు విన్నవించుకొనాగా, కలెక్టర్‌ స్పందిస్తూ రేపటిలోగా దీని పై నివేదిక ఇవ్వాలని డి ఇ వో ను ఆదేశించారు . కవాడి గూడకు చెందిన ధశరథ్‌ అనే వికలాంగుడు తాము 37 సం .ల నుండి ఉంటున్న స్థలంలో ఇల్లు కట్టించి ఇస్తామని ప్రభుత్వం టోకెన్‌ ఇచ్చి ఇంతవరకు ఇవ్వకుండ అనేక సార్లు తిరిగి వెళ్తున్నామని తమకు ఇల్లు మంజూరు చేయాలని కలెక్టర్‌ ను కోరారు . కలెక్టర్‌ హౌజింగ్‌ ఆదికారికి వెంటనే పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు . ఈ కార్యక్రమములో జాయింట్‌ కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌, ఆదనపు జెసి సత్యానందం, డిఆర్‌ వో మధన్‌ మోహన్‌ రావు, ఆర్‌ డి వో లు, జిల్లా అదికారులు తదితరులు పాల్గోన్నారు .

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: