గ్రీవెన్స్‌ సెల్‌లో సమస్యలను పరిష్కరించుకోండి


తిరుపతి: తిరుపతి డివిజన్‌ ప్రజల సౌకర్యార్థం తిరుపతిలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్‌ సెల్‌ ను ప్రజలందరూ వినియోగించుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని జిల్లా జూయింట్‌ కలెక్టర్‌ పద్యుమ్న కోరారు. స్థానిక ఆర్డీవొ కార్యలయంలో సోమవారం గ్రీవెన్స్‌డే జూయింట్‌ కలెక్టర్‌ ప్రద్యుమ్న అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన ఆయన మాట్లాడుతూ నేటి కార్యక్రమానికి 29 విజ్ఞప్తులు అందాయన్నారు. ఇందులో రెవిన్యూ, పౌర సరఫరాలు, జువెనైల్‌ శాఖలకు సంబంధించిన విజ్ఞప్తులు వున్నాయన్నారు. రెవిన్యూ శాఖకు సంబంధించి భూ సమస్యలపై విజ్ఞప్తులు అందాయన్నారు. వీటన్నంటిని అతి త్వరలో పరిష్కరిస్తామన్నారు. గత నెల ఆగస్టు 23 న జరిగిన గ్రీవెన్స్‌ డె లో వచ్చిన 23 విజ్ఞప్తులకు గాను 18 ని పరిష్కరించామన్నారు. మిగిలిన వాటిని త్వరలో పరిష్కరిస్తామన్నారు.

ఇప్పటి వరకు జిల్లా కేంద్రంలో గ్రీవెన్స్‌ సెల్‌ నిర్వహించడం ద్వారా దూర ప్రాంతాల వారు ఇబ్బందులకు గురవుతున్నారని, వారిఇబ్బందులను తొలగించాలన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని తిరుపతి లో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి నెల రెండవ, నాల్గవ సోమవారాల్లో ఆర్డీవొ కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమానికి తన అధ్యక్షతన జరుగుతుందని జూయింట్‌ కలెక్టర్‌ తెలిపారు. తిరుపతి డివిజన్‌ కు చెందిన అర్జీదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఆర్డీవొ ఎ.ప్రసాద్‌, తుడా విసి పెంచలరెడ్డి, శ్రీకాళహస్తి మున్సిపల్‌ కమీషనర్‌ అజయ్‌ కిషోర్‌, యం .పి.డి.వొ రాజశేఖరరెడ్డి, సహాయ పౌర సరఫరాల అధికారి శివశంకరరెడ్డి, ఏ.ఒ సుధాకర్‌ , అర్బన్‌ తహశిల్దార్‌ కనకనరసారెడ్డి, వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు ఎ.రమేష్‌, గిరిజన సాంఘిక సంక్షేమ, ఆర్‌డబ్లుయస్‌ , డివిజనల్‌ పంచాయితీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: