అన్నదాతలంటే అసులా?


హైదరాబాద్: ఎరువుల కోసం ఆందోళన చేస్తున్న రైతన్నలపై దాడి చేస్తే ఊరుకోబోమని ఖబడ్దార్‌ అని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హెచ్చరించారు. రైతు సమస్యలపై ఉద్యమంలో భాగంగా మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటన చేస్తున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరువులను సక్రమంగా సరఫరా చేయలేని ప్రభుత్వం రైతులపై దాడులకు తెగబడుతోందన్నారు. ఇది ఏమి న్యాయమని ఆయన ప్రశ్నించారు. ఇక తెలంగాణ రాష్ట్రం గురించి తమ అభిప్రాయాలు స్పష్టంగా చెప్పినా ప్రత్యర్ధి పార్టీలు తమపై దాడి చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వారి సిద్ధాంతాలు వారికున్నాయని తమ సిద్ధాంతాలు తమకున్నాయని తాము తమ సిద్ధాంతాల గురించి చెబుతుంటే దాడులు చేయటం ఏ రకమైన ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. తాము ప్రజాసమస్యలపై పోరాడుతుంటే అడ్డుకోవటం సమంజసమేనా అని ప్రశ్నించారు. ప్రజల సమస్యల కోసం తాము ఉద్యమిస్తుంటే దుష్టశక్తులు అడ్డుపడుతున్నాయన్నారు. టిడిపి ఎమ్మెల్యేలు తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం కోసం చేస్తున్న ఆందోళనను ఆయన ప్రస్తావించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తమ పార్టీ నేతలు పోరాడుతుంటే అడ్డుకుంటున్నారన్నారు. ఇక కాంగ్రెస్‌ను ప్రస్తావిస్తూ దివంగత వైఎస్సార్‌ లక్షకోట్ల రూపాయల వరకు తమ కుమారుడు జగన్‌కు దోచిపెట్టారని ఆరోపించారు. పేదలను ఆయన మోసం చేశారన్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: