త్రిముఖ పోటీ తప్పేలా లేదు!


ఒంటరి పోరుకు కాంగ్రెస్ సిద్ధం
అధికార, ప్రతిపక్షాలు యుద్ధానికి సన్నద్ధం
బీహార్‌ ఎన్నికల ముఖచిత్రం
పాట్నా, సెప్టెంబర్ 12 (ఫీచర్స్ ఇండియా): బీహార్‌ రాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో త్రిముఖ పోటీ తప్పేలా కనిపించడం లేదు. శాసనసభకు త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రధానంగా మూడు కూటముల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయాలని కాంగ్రెస్‌ నిర్ణయించడంతో ఈ పరిస్ధితి ఏర్పడినట్లు చెబుతున్నారు. కాగా జెడి(యు) నేతృత్వంలోని ఎన్‌డిఏ కూటమి, ఆర్‌జెడి-ఎల్‌జెపి కూటమిలు కూడా ఈ ఎన్నికల్లో పోటీచేయనుండటంతో ప్రధానంగా ఈ మూడు రాజకీయ వర్గాల మధ్య త్రిముఖ పోటీ ఏర్పడనున్నది. అయితే 1995 నుండి కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేయనప్పటికీ లాలూ ప్రసాద్‌ నేతృత్వంలోని ఆర్‌జెడితో పొత్తు పెట్టుకుని రెండు సార్లు అధికారాన్ని సొంతం చేసుకుంది. 1995లో అవిభాజ్య బీహార్‌లో కాంగ్రెస్‌కు, లాలు ప్రసాద్‌ నేతృత్వంలోని జనతాదళ్‌కు మధ్య పోటీ నెలకొంది. మొత్తం 324 స్ధానాల్లోనూ ఒకదానికి తప్ప అన్ని స్థానాలకు కాంగ్రెస్‌ పోటీ చేసి 29 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ఎన్నికలకు ముందు సమతా పార్టీని ఏర్పాటు చేశారు. బిజెపిని పరిగణనలోకి తీసుకోలేదు. ఆ తరువాత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ పార్టీ 324 స్థానాలకు పోటీ చేసింది. 23 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఈ విడత బిజెపి ఓట్లను చీల్చింది. దీంతో కాంగ్రెస్‌ రబ్రీదేవి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి 22 మంత్రి పదవులనుపొందింది. మిగిలిన ఒకే ఒక్క కాంగ్రెస్‌ ఎమ్మెల్యేను స్పీకర్‌ పదవి వరించింది. ఆ తరువాత 2005 ఫిబ్రవరిలోనూ, అక్టోబరు-నవంబరు మాసాల్లోనూ వెంటవెంటనే జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్‌జెడితో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుంది. 2005లో ఎన్డీయేకు కుమార్‌ నేతృత్వం వహించారు. ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ బీహార్‌లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తీసుకు వస్తామని, కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలోనే బీహార్‌ అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాష్ట్రంలోని ముస్లీం ఓటు బ్యాంకుపై కాంగ్రెస్‌ కన్ను వేసింది. కుమార్‌ లౌకికవాదంపై పలు ప్రశ్నలు లేవనెత్తింది. బిజెపితోనూ, గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతోనూ సంబంధాలు నెరుపుతూ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారని కాంగ్రెస్‌ ఆరోపించింది. బీహార్‌లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ ప్రచారం నిర్వహించలేదు. కాని పంజాబ్‌లో ఎన్డీయే నిర్వహించిన ఒక ఎన్నికల ర్యాలీ సందర్భంగా మోడీతో కుమార్‌ చేతులు కలిపారు. అంతేకాకుండా గుజరాత్‌ ఘర్షణల తరువాత వాజ్‌పేయి ప్రభుత్వంలో కుమార్‌ కేంద్ర మంత్రిగా కూడా కొనసాగారు. ఇంకా నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని ప్రభుత్వం చేపట్టిన మైనార్టీ సంబంధిత కార్యక్రమాలు, నిధుల వినియోగంపై పలు ప్రశ్నలు కూడా తలెత్తాయి. రాష్ట్ర వెనుకబాటు తనానికి కాంగ్రెస్‌ పార్టీనే కారణమని కుమార్‌పై అనేక ఆరోపణలు వచ్చాయి. దాదాపు 63 సంవత్సరాలుగా బీహార్‌ను కాంగ్రెస్‌ నిర్లక్ష్యం చేసింది. ఆ రాష్ట్ర ప్రజలకు ఏ విషయంలోనూ న్యాయం జరగలేదు. కాంగ్రెస్‌ 243 స్థానాలకు పోటీ చేసి ఎన్‌డిఏకి ప్రయోజనం చేకూర్చిందని లాలూ ప్రసాద్‌ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ అధికారులకు కత్తిమీద సాములాంటిదే. ప్రతి సారీ త్రిముఖ పోటీ ఉంటుందని భావిస్తున్నప్పటికీ చివరి నిమిషంలో పార్టీల మధ్య అవగాహన కుదిరి ఒకరికొకరు పరస్పరం సహకరించుకునే ధోరణిలో పోటీ అంత తీవ్రంగా ఉండేది కాదు. కానీ, ఈసారి మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తుండడంతో ఫలితం ఎలా ఉంటుందన్నదానిపై విశ్లేషకులు సైతం కచ్చితమైన అభిప్రాయాన్ని వెల్లడించలేకపోతున్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: