కాశ్మీర్ లో మళ్ళీ హింస


శ్రీనగర్: ఓవైపు రంజాన్ సంబరాలు జరుగుతుండగా.. మరోవైపు శ్రీనగర్‌లో అల్లరి మూకలు విరుచుకు పడ్డాయి. క్రైం బ్రాంచి కార్యాలయంతో పాటు మరికొన్ని ప్రభుత్వ కార్యాలయాలనూ తగులబెట్టారు. సయ్యద్ అలీ షా గిలానీ నేతృత్వంలోని హురియత్ కాన్ఫరెన్స్ చీలికవర్గంతో పాటు, అజ్ఞాతంలో ఉన్న వేర్పాటువాద నాయకుడు మస్రత్ ఆలమ్ భట్ నేతృత్వంలోని ముస్లింలీగ్ ఈ దాడులకు కారకులని, ఈద్ సంబరాలను భగ్నం చేయడానికే వారు కుట్రపన్నారని పోలీసులు ఆరోపించారు. వేర్పాటువాద నాయకులు లాల్‌చౌక్ వద్ద ఓ నిరసన ర్యాలీ నిర్వహిస్తుండగా కొందరు యువకులు పబ్లిక్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ సీఈ కార్యాలయంలోకి దూసుకెళ్లి, దానికి నిప్పుపెట్టారు. దాంతో ఆ పక్కనే ఉన్న క్రైం బ్రాంచి కార్యాలయానికి కూడా మంటలు అంటుకున్నాయి. భవనంలో చాలావరకు కలప ఉండటంతో అతి తక్కువ సమయంలోనే పరశురామ ప్రీతి అయిపోయింది.

నిరసనకారుల మీద కాల్పులు జరపొద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలుండటంతో, వాళ్లు పలుమార్లు గాల్లోకి కాల్పులు జరిపారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు డీజీపీ కుల్దీప్ ఖోడా నేతృత్వంలో సీనియర్ పోలీసు అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. హురియత్ నేత మీర్వాయిజ్ ఉమర్ ఫరూక్, జేకేఎల్ఎఫ్ చైర్మన్ మహ్మద్ యాసిన్‌మాలిక్, నిస్సార్ హుస్సేన్ రాథేర్ వంటి పలువురు నేతల ఆధ్వర్యంలో లాల్‌చౌక్ ర్యాలీ జరిగింది. వేర్పాటువాదులు పలు అభ్యంతరకరమైన జెండాలను క్లాక్‌టవర్ వద్ద ఎగరేశారు. అరగంట సేపు రాస్తారోకో చేయాలని మీర్వాయిజ్ పిలుపునిచ్చి.. అక్కడున్న గుంపును పట్టించుకోకుండా ఇంటికి వెళ్లిపోయారు. ఆ తర్వాతే ఈ సంఘటన జరిగింది. అంతకుముందు ఓ గుంపు పోలీసు బ్యారక్‌ను తగులబెట్టడంతో పాటు హజరత్‌బల్ దర్గా వెలుపల ఉన్న ఓ పోలీసు వాహనాన్ని కూడా తగులబెట్టారు. దీంతో..ఆందోళనకారులపై భద్రతాదళాలు కాల్పులు జరపాల్సి వచ్చింది. పవిత్ర రంజాన్ సంబరాలను అడ్డుకుని, లాల్‌చౌక్‌లో విధ్వంసం సృష్టించిన పాపం హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ మీర్వాయిజ్ ఉమర్ ఫారూఖ్‌దేనని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ధ్వజమెత్తారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: