పోలీసులను విడుదల చేసిన మావోయిస్టులు


పాట్నా: బీహార్‌లో పోలీసుల అపహరణ ఉదంతానికి తెర పడింది. గత ఆదివారం అపహరించిన పోలీసులను మావోయిస్టులు విడుదల చేశారు. మావోయిస్టుల చెరలో ఉన్న ముగ్గురు పోలీసులను లఖిసరాయ్‌ అడవుల్లో గుర్తించినట్లు బీహార్‌ ప్రభుత్వం ప్రకటించింది. అపహరణకు గురైన నలుగురు పోలీసుల్లో లుకాస్‌ టేటే మావోయిస్టుల చేతిలో మరణించాడు. తమ 8మంది సహచరులను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ మావోయిస్టులు ఆగస్టు 29న నలుగురు పోలీసులను లఖిసరాయ్‌ ప్రాంతం నుంచి అపహరించారు. అయితే తమ చెరలోని పోలీసులను ఆదివారం విడుదల చేసినట్లు మావోయిస్టులు ప్రకటించారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ ఈ ఉదయం అపహరణకు గురైన వారిని బీహార్‌ పోలీసులు లఖిసరాయ్‌ అటవీ ప్రాంతంలో గుర్తించడంతో సంక్షోభం సమసిపోయింది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: