నేటి నుంచి ‘సంస్మరణ’ యాత్ర


హైదరాబాద్‌: తెలంగాణ అమరవీరుల కుటుంబాలను పరామర్శించేందుకు భారతీయ జనతా పార్టీ ప్రత్యేక యాత్ర చేపట్టింది. ‘తెలంగాణ అమరవీరుల సంస్మరణ యాత్ర’ పేరుతో దక్షిణ తెలంగాణలోని నల్గొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో గురువారం నుంచి ఈ యాత్రను ప్రారంభంకానుంది. సెప్టెంబరు 5 వరకు ఇది కొనసాగుతుంది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా బలిదానాలు చేసిన వారి కుటుంబాలను పరామర్శించడంతో పాటు, ఉద్యమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే యోచనతో ఈ యాత్రను చేపడుతున్నట్లు పార్టీ ప్రకటించింది. నల్గొండ జిల్లాలోని పొడిచేడు గ్రామంలో అమరవీరుడు శ్రీకాంతాచారి నివాసం నుంచి ఈ యాత్రను ఆరంభిస్తున్నారు. యాత్రకు సంబంధించిన పోస్టరు, బ్యానర్లు, కరపత్రాలను బుధవారం ఇక్కడ పార్టీ కార్యాలయంలో భాజపా జాతీయ నాయకుడు బండారు దత్తాత్రేయ ఆవిష్కరించారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: