శాసిస్తున్న బహుళజాతీయులు!


ఈ రోజున, ప్రపంచ వ్యాపితంగా సార్వ భౌమదేశాల అధికారాన్ని ఒక్క వేర్పాటువాద రాజకీయపార్టీలో లేక టెర్రరిస్టు ముఠాలో మాత్రమే సవాలు చేయటంలేదు. అత్యంత శక్తివంతమైన బహుళజాతి కార్పొరేషన్లు, వాటి అహంకార పూరిత యాజమాన్యాలు దేశ సార్వభౌమాధికారానికి, స్థానిక చట్టాలకు సమానంగానే ప్రమాదం తెచ్చిపెడు తున్నాయి. ఇది చైనా, భారత్‌ వంటి అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశాలతో సహా ప్రపం చంలోని వివిధ భాగాలలో పదేపదే రుజువవు తున్నాయి. భారత్‌, సౌదీ అరేబియా ఎమిరేట్స్‌ జాతీయ ప్రభుత్వాలతో బ్లాక్‌బెర్రీ తాజా పోరాటం- జాతీయ భద్రతాసంస్థలకు సబ్‌స్క్రయిబర్ల కమ్యూ నికేషన్‌ సమాచారాన్ని తెలుసుకునేందుకు అనుమతి నిరాకరించడం ఇటువంటి అహంకారాన్ని ప్రద ర్శించడం తప్ప మరొకటి కాదు. ఇంతకుమందు గూగుల్‌, చైనాశక్తి సామర్థ్యాలను సవాలు చేసింది. బ్లాక్‌బెర్రీ, గూగుల్‌ రెండూ సార్వభౌమదేశాల భద్రతకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఎంతో సున్నితమైన భౌగోళిక చిత్రపటాలను (మ్యాప్‌), అంతర్జాతీయ సరిహద్దులను చిత్రించడంలో తుంటరితనాన్ని ప్రదర్శించింది. గూగుల్‌ యొక్క జిటాక్‌ స్కైప్‌కు చెందినవాయిస్‌ ఓవర్‌ ఇంటర్నెట్‌ ప్రోటోకల్‌(విఓఐపి)లు వీడియోకాల్స్‌, సేవలు అంది స్తుంటాయి. అవి జాతీయ, అంతర్జాతీయ భద్రతా సంస్థలకు ఆందోళనకరంగా పరిణమించాయి. టెర్ర రిస్టులను, అంతర్జాతీయ నేరస్థులను పట్టుకునేం దుకు సమాచారాన్ని, కమ్యూ నికేషన్లను మధ్యలోనే అవరోధం కలిగించేందుకు చేసే ప్రయత్నాలకు అవి అడ్డుతగులుతున్నాయి. ఈ కంపెనీలు అందించే ఎంపికచేయబడిన సాంకేతిక పరిష్కారాలుగా పిలువబడే వాటిని, కొన్ని అతిథ్య దేశాలకు ఒత్తిళ్ళలో సర్వీసులందించే వారు అసంతృప్తికరంగా ఉండ టమేగాక, అవిశ్వసనీయంగా వుంటున్నాయి. ఈ ప్రపంచ ఉన్నత సాంకేతిక కంపెనీలు తమ కార్యకలాపాల నిర్వహణలో ద్వంద్వప్రమా ణాలు పాటిస్తాయన్న విషయంలో ఎంతో పేరు మోసి వున్నాయి. ఒకటి తమ మాతృదేశానికి లేదా తమ కీలకమైన వ్యాపార మద్దతు అందించే దేశానికి (బ్లాక్‌ బెర్రీకి అమెరికా) రెండవది ప్రవర్థిత మార్కెట్ల విషయంలో గూగుల్‌కాని, బ్లాక్‌ బెర్రీగాని అమెరికా భద్రతా ఆందోళనలను కొట్టిపారేసే సాహసం చేయలేవు. ఉదాహరణకు, భారతదేశ చిత్రపటంలో కాశ్మీర్‌, అరుణాచలప్రదేశ్‌, టిబెట్‌ స్థానాలను గూగుల్‌ తారుమారుచేసే ప్రయత్నం చేయవచ్చు. అయితే అలాస్కా విషయంలో అటువంటి సాహసా నికి ఒడిగట్టదు. కోకాకోలా కంపెనీ, పర్యావరణ కాలుష్యం కలుగజేస్తున్నట్లు లేదా భూగర్భజలాలను హరించి వేస్తున్నట్లు చేసే అధికారిక ఆరోపణను సవాలుచేసే అమెరికా రాష్ట్ర ప్రభుత్వాన్ని గాని లేదా ఫెడరల్‌ ప్రభుత్వాన్ని కోర్టు కీడ్వలేదు. అయితే భారత ప్రభుత్వంతో లేదా కేరళ ప్రభుత్వానికి, పెర్రుముట్టి పంచాయతీ ప్రజలకు వ్యతిరేకంగా న్యాయవ్యవహా రాన్ని చేపట్టినప్పుడు, కంపెనీ వ్యవహారాల్లో అదే వైఖరి మనకు కనబడదు. అయితే అంతిమంగా ప్లాచిమడ బెవరేజ్‌ బాట్లింగ్‌ ప్లాంటును కోకోకంపెనీ మూసివేయాల్సివచ్చింది. అది వేరు విషయం. భారీ చమురు కంపెనీలైన రాయల్‌ డచ్‌హెల్‌, బ్రిటీష్‌ పెట్రోలియం, ఎక్సాన్‌ మోబిల్‌, వంటివి తమ మాతృ దేశాలకు వెలుపల నిర్వహించే వ్యాపారంలో ఆతిథ్య దేశాలను (ఏదేశంతో వ్యాపారం చేస్తున్నాయో ఆదేశాలను) జాతీయ భద్రత, ప్రజారోగ్యం, పర్యా వరణం వంటి కీలకాంశాలలో తరచూ అంధ కారంలో ఉంచుతూ ఉంటాయి. అత్యధిక ప్రపంచ దేశాలలో విడివిడిగా వాటి వార్షికాదాయం కంటే తమ ఆదాయం ఎక్కువని గొప్పగా చెప్పుకునే అనేక భారీ బహుళజాతి వ్యాపార కార్పొరేషను ఆయా దేశాల్లో కలుగజేసుకుంటూ వుంటాయని, తమ వ్యాపార ప్రయోజనాల కోసం ఆతిథ్య దేశాల విధానాలను ప్రభావితం చేస్తూ వుంటాయని అందరికీ తెలిసిన విషయమే. చారి త్రకంగా అదనంగా వచ్చే ఈ వాణిజ్య శక్తి తమను పోషించే శక్తివంతమైన దేశాల నుండి కావచ్చు లేదా తమ మాతృదేశాలు నుండి సంక్రమిస్తూ ఉండవచ్చు. 18వ శతాబ్దంలో ఈస్టిండియా కంపెనీకి అదనపు వాణిజ్యశక్తి బ్రిటిష్‌ ప్రభుత్వం నుండి వచ్చింది. ఈ కంపెనీ యంత్రసామాగ్రినీ, బ్రిటిష్‌ తుపాకులను ఏకకాలంలో తీసుకురాగలిగింది. 21వ శతాబ్ధంలో బ్లాక్‌ బెర్రీ, గూగుల్‌, కోకాకోలా వంటి కంపెనీల వాణిజ్య పలుకుబడికి అమెరికా దౌత్యబలం ద్వారా అందిన సాయమే కారణం. బి.పి. ఎక్సాన్‌-మెబిల్‌, షెల్‌, యూనీలీవర్‌, ఐబిఎం, మైక్రోసాఫ్ట్‌, జి.ఇ, సీమన్స్‌, రేథియాన్‌, ఆసియా ఎబి, మిత్సుబిషీ కార్పొరేషన్‌, చైనా పెట్రోలియం, ఇఎన్‌ఐ, రియోటింటో, యుబిఎస్‌ వంటి కంపెనీల దురహంకారానికి మూలాలు, వారు తమ మాతృదేశాల నుండి అంతర్జాతీయ వ్యాపారం కోసం వారు పొందే దౌత్యసంబంధాల మద్దతుకు ఆపాదించవచ్చు. ఉచ్ఛనీచాలు లేని మరికొన్ని వాణిజ్యప్రయోజనాలకు స్థానిక చర్యల వలన దెబ్బ తగులుతుందని భావిస్తే అటువంటి దేశాల ప్రభు త్వాలకు ఇబ్బందులు తెచ్చిపెట్టగలవు. అవసర మనుకుంటే ఆతిథ్య దేశాల ప్రభుత్వాలను పడ గొట్టగలవు. చీలీలో రాజకీయ కుట్ర నడపటంలో ఐటిటి పాత్ర, భోపాల్‌లో యూనియన్‌కార్బైడ్‌ హత్యో దంతం, ఆ తరువాత ప్రపంచ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ భారతదేశం నుండి అన్ని రకాల ‘మర్యాదలతో’ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల రెండింటి సహాయంతో అదృశ్యంకావడం 20వ శతాబ్దపు రాజకీయ, వాణిజ్య-జానపద చిత్రంలో భాగం. ఈ నేపథ్యంలో, ఆగస్టు 31లోగా జాతీయ భద్రతా సంస్థలకు సమాచారం పొందే అవకాశా నైన్నా కల్పించాలి లేదా నిషేధాన్నైనా ఎదుర్కోవాలని హెచ్చు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన టెలికాం సర్వీసు లందజేసే బ్లాక్‌ బెర్రీకి ప్రభుత్వం గట్టిగా చేసిన హెచ్చరికకు ప్రజలు హర్షామోదాలు తెలిపేందుకు, తమ మద్దతు తెలియజేసేందుకు అన్ని విధాలా అర్హత వుంది. భారత భద్రతా ఆందోళ నలను, ముఖ్యంగా, 26/11 ముంబయి మారణ కాండ తరువాత, అర్థంచేసుకోవాలని బ్లాక్‌ బెర్రీకి నచ్చచెప్పేందుకు గతంలో అవలంభించిన మెతక వైఖరి ఏమాత్రం పనిచేయలేదు. మిగతా విషయాల్లో స్నేహపూర్వకంగా ఉండే, ప్రపంచ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అలవాటున్న అమెరికా ప్రభుత్వం, బ్లాక్‌బెర్రీకి అండగావుంటూ ఆయాచిత సలహా యిస్తూ లేఖ పంపడం భారతప్రభుత్వాన్ని ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయింది. బ్లాక్‌ బెర్రీ యిప్ప టికే, దేశంలోని నయా సంపన్న వర్గాలు, హెచ్చు వ్యయం చేసే కార్పొరేట్‌ ఖాతాదారుల ఫ్యాషన్‌ మోజు తీర్చేదిగా తన స్థితిని పట్టిష్టం చేసుకొని వుంది. అయితే అది ఇప్పటికే ఒత్తిడికి గురౌతోంది. తన మెసెంజర్‌ సర్వీసును చట్టబద్ధంగా అడ్డు కోవడాన్ని (లాఫుల్‌ ఇంటర్‌సెప్షన్‌) అనుమతిం చేందుకు బ్లాక్‌ బెర్రీ అంగీకరించినట్లుగా వార్త లున్నాయి. అయితే ఈ కంపెనీ బ్లాక్‌ బెర్రీ ఎంటర్‌ప్రైజ్‌ సర్వీసు(బిఇఎస్‌)లో భారతదేశ చట్టాన్ని అమలుచేసే సంస్థలకు ప్రవేశం కల్పించేందుకు ఇప్పటికీ సుముఖంగా లేదు. ఇది కార్పొరేట్‌ ఇ-మెయిల్స్‌ అందజేస్తూ వుంటుంది. అయితే ప్రభుత్వ తుది హెచ్చరికతో బ్లాక్‌ బెర్రీ దారిలో కొచ్చే సూచనలున్నాయి. లేనిపక్షంలో అది భారీ మార్కెట్‌ను కోల్పోయే ప్రమాదం వుంది. బ్లాక్‌ బెర్రీ తన ఆంక్షాపూర్వక వ్యాపార ఆచరణతో భారత దేశంలో భారీ ఉన్నతస్థాయి వినియోగదారు పునాదిని నిర్మించుకున్నది. కేవలం 30 మాసాల్లో 10 లక్షల వినియోగదారులకు చేరువైంది. దురదృష్టవశాత్తు, ఆపరేటర్లకు 100 శాతం విదేశీ యాజమాన్యాన్ని అనుమతించే టెలికాం రంగ విచక్షణారహిత ప్రైవేటీకరణే భారతదేశానికి భద్రతా ప్రమాదం తెచ్చిపెడుతోంది. ఎవరివో తెలియని సంక్లిష్టమైన విదేశీ పెట్టుబడులను టెలికాం రంగం లోకి అనుమతించడం, రక్షణ రహస్యాలకు సంబం ధించిన టెలికాం యంత్ర పరికరాలను (హార్డ్‌వేర్‌), డేటా సర్వీసులను భారతదేశంతో శత్రుత్వంతో వుండే పొరుగుదేశాల నుండి చౌకగా దిగుమతి చేసు కోవడం, ప్రభుత్వరంగ టెలికం సర్వీసులను అంద జేసే సంస్థలను యంత్రపరికరాల తయారీ సంస్థ లను ఒక క్రమపద్ధతిలో నాశనం చేస్తూ రావడం, దేశరక్షణ అవసరాలకు ప్రాణప్రదమైన ఈ రంగంపై భద్రత నియంత్రణ కోల్పోయేందుకు దారితీసింది. ఇలా విదేశీ సంస్థలకు సైబర్‌స్పేస్‌పై టెలికమ్యూ నికేషన్‌ సేవలపై తన నియంత్రణను ఉద్దేశపూర్వ కంగా వదులుకున్న ప్రధానమైన రాజకీయ, ఆర్థిక శక్తి ప్రపంచంలో మరొకటిలేదు. జపాన్‌ ఎన్‌టిటి, జర్మనీ డీట్స్చి టెలికాం, బ్రీటీష్‌ టెలికాం,ఎటి అండ్‌ టి, ఫ్రాన్స్‌కు చెందిన ఆల్కెటెల్‌, టెలికాం ఇటాలియా బ్రెజిల్‌కు చెందిన టెలిబ్రాస్‌, చైనా టెలికాం, మలేషియా టెలికాం, సింగ్‌ టెల్‌ వంటివి టెలికాం సర్వీసుల వ్యాపారంలో ప్రపంచ ప్రసిద్దిచెం దిన బ్రాండ్లు. ఒక టెలికాం పవర్‌హౌస్‌గా ఆవిర్భవిం చేందుకు భారతదేశం ఏమాత్రం ప్రయత్నించలేదు. దీనికి భిన్నంగా, సాధారణ ప్రజానీకానికి తెలియనిది, ప్రభుత్వానికి మాత్రమే తెలిసిన కారణా లతో, భారతదేశం స్వదేశీ టెలికాం వ్యాపారంలో సైతం విదేశీ మదుపుదార్లకు, సరఫరాదార్లకు తన అగ్రస్థానాన్ని ధారాదత్తం చేసింది. అది 100 శాతం ప్రభుత్వ నియంత్రణ నుండి దాదాపు పూర్తిగా విదేశీ పరిశ్రమలపై ఆధారపడేంత వరకు వెళ్ళింది. అగ్రస్థానంలో వుండడానికి, 1980లలో టెలికమ్యూ నికేషన్‌ విభాగాన్ని (డిఓటి)ఏర్పాటు చేయడం, ఆ తరువాత టెలికాం సర్వీసులను కార్పొరేటీకరించడం (ఎంటిఎన్‌ఎల్‌, బిఎస్‌ఎన్‌ఎల్‌) విదేశీ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(విఎస్‌ఎన్‌ఎల్‌) ఇండియన్‌ టెలిఫోన్‌ ఇండిస్టీ(ఐటిఐ) ఏర్పాటుచేయడం వంటివి జరి గాయి. ఇప్పుడవి స్వతంత్ర భారతదేశ స్మృతి పథంలో లేని పారిశ్రామిక చరిత్రకు సంబంధించినవి. 1990 లలో ఆర్థిక సంస్కరణల అమలు క్రమంతో వాటి సృష్టికర్త అయిన ప్రభుత్వ మద్దతు, గౌరవం, గుర్తింపు కోల్పోయినవి. బ్లాక్‌ బెర్రీ గూగుల్‌, చైనీస్‌ హువావీ, జడ్‌టిఇ వంటి సంస్థలతో ఏ కారణం చేతనైనా సంఘర్షణలు ఉంటే, అవి పెరుగుతున్న భారతదేశ అసహనాన్ని సూచిస్తుంది. విజృంభిస్తున్న ఈ వ్యాపా రంలో ఒక ప్రముఖమైన పాత్ర పోషించేందుకు దృఢ సంకల్పం, సామర్ధ్యం కొరవడటమే దీనికి కారణం. ఏటా 30 శాతానికి పైగా వృద్ధి చెందుతున్న భారతదేశ స్వదేశీ టెలికాం వ్యాపారం, డిమాండ్‌ కరువైన ప్రపంచ పరికరాల సరఫరాదార్లకు , సర్వీసు నందించే వారికి ఇదొక సువర్ణావకాశం.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: