‘వేదాంత’కు పర్యావరణ అనుమతి రద్దు


న్యూఢిల్లీ: ఒరిస్సాలో దాదాపు 1.7 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల వ్యయంతో బ్రిటన్‌ నిర్మించ తలపెట్టిన బాక్సైట్‌ మైనింగ్‌ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతిని ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. అటవీ, పర్యావరణ చట్టాలను అతిక్రమించి ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ”పర్యావరణ పరిరక్షణ చట్టం, అటవీ హక్కుల వినియోగ చట్టాలను ఒరిస్సాప్రభుత్వం, వేదాంత బాక్సైట్‌ మైనింగ్‌ కంపెనీలు అతిక్రమించాయని” పర్యావరణ శాఖ మంత్రి జైరాం రమేష్‌ ఇక్కడ విలేకరులతోఅన్నారు. రాష్ట్రంలోని కల్హండి, రారుఘడ్‌, లాంజీఘర్‌ జిల్లాల్లోని నియమగిరి పర్వతాలపై నెలకొల్పనున్న ఒరిస్సా మైనింగ్‌ కార్పొరేషన్‌ (ఓఎంసి), స్టెర్లైట్‌ బాక్సైట్‌ మైనింగ్‌ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వలేదని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, వేదాంత మైనింగ్‌ ప్రాజెక్టులకు అటవీ, పర్యావరణ అనుమతిని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఫారెస్ట్‌ అడ్వయిజరీ కమిటీ (ఎఫ్‌ఎసి) చేసిన సిఫార్సులను ఆమోదిస్తూ ఆ ప్రాజెక్టులను తిరస్కరిం చడం జరిగిందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో దాదాపు రు.54,000 కోట్లతో కొరియాకు చెందిన ఉక్కు కంపెనీ పోస్కో నిర్మించ తలబెట్టిన ప్రాజె క్టుకు అనుమతి ఇచ్చేందుకు దీనిని వేదాంత ప్రాజెక్టుకు అనుమతిని తిరస్కరిం చారంటూ వచ్చిన ఆరోపణలను జైరాం రమేష్‌ కొట్టి పడేశారు. అటవీ సంబంధమైన చట్టాలను ఉల్లంఘించే విషయమై రెండూ సమానం కావనిఆయన చెప్పారు. ”వేదాంత ప్రాజెక్టు విషయంలో ఎటువంటి రాజకీయాలు జరగలేదని, చట్టబద్ధంగానే నిర్ణయం తీసుకోవడం జరిగింది.” అని ఆయన చెప్పారు. సక్సేనా కమిటీ నివేదిక, ఆడిటర్‌ జనరల్‌(ఎజి) నివేదిక, ఫారెస్ట్‌ అడ్వయిజరీ కమిటీ సిఫార్సులు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆయన చెప్పారు. ప్రాథమి కంగా తమ మంత్రిత్వ శాఖ 2007లో ప్రాజెక్టుకు అను మతి ఇచ్చినప్పటికీ అది సంపూర్ణమైంది కాదని ఆయన తెలిపారు. ”వేదాంత ప్రాజెక్టు పలు చట్టాల ఉల్లంఘ నలకు పాల్పడినట్లు” ఆయన తెలిపారు పెద్దఎత్తున పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిం చిన దృష్ట్యా ఒరిస్సాలోని లాంజిఘర్‌ వద్ద ఏడాదికి మిలియన్‌ టన్నుల అలూమినా శుద్ధి కర్మాగారానికి అనుమతిని ఎందుకు నిరాకరించకూడదో తెలియచేయా లంటూ షోకాజ్‌ నోటీసును కూడా వేదాంత ప్రాజెక్టుకు జారీ చేశామని ఆయన తెలిపారు. వేదాంత ప్రాజెక్టు అనుమతికి సంబంధించి ఫారెస్ట్‌ అడ్వయిజరీ కమిటీ తన నివేదికను సోమవారం పర్యావరణ శాఖ మంత్రి జైరాం రమేష్‌కు సమర్పించింది. గిరిజనుల విశ్వా సాలను కాలరాస్తూ పలు ఉల్లంఘనలకు పాల్పడిన దృష్ట్యా ఒరిస్సాలోని నియమగిరి పర్వతాల్లో ఉన్న మైనింగ్‌ ప్రాజెక్టును నిషేధించాలని సక్సేనా కమిటీ చేసిన సిఫార్సును కూడా ఫారెస్ట్‌ అడ్వయిజరీ కమిటీ ఆమోదించింది. 2008లో ఒరిస్సా మైనింగ్‌ కార్పొరేష న్‌కు ఇచ్చిన ప్రాధమిక అనుమతిలో కూడా పలు వుల్లంఘనలు ఉన్నాయని సక్సేనా నివేదిక పేర్కొంది. ఆ అనుమతిలోఅటవీ హక్కుల చట్టం నిబంధనలు పేర్కొనలేదని సక్సేనా నివేదిక తెలిపింది. గ్రామ సభ ఇచ్చిన అంగీకార పత్రం నకిలీది అని పేర్కొంటూ పెద్ద ఎత్తున ఉల్లం ఘనలకు పాల్పడినందుకు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వద్దని సక్సేనా నివేదిక పేర్కొంది. వేదాంత అలుమిన రిఫైనరీ పై కూడా చర్యలు తీసుకోవాలని కమిటీ సిఫార్సు చేసింది. దాదాపు 26 హెక్టార్ల అటవీ భూమిని చట్టవిరుద్దంగా ఆక్రమించిందని పేర్కొంది. ”అటవీ భూమిని ఉపయోగించ కూడదన్న నిబంధన మేరకే పర్యావరణ అనుమతిని ఇవ్వాల్సి ఉంటుందన్న వాస్తవాన్ని అది విస్మరించింది.” అని కమిటీ పేర్కొంది. ఒరిస్సా ప్రభుత్వం అటవీ హక్కుల చట్టాన్ని అతిక్రమిస్తే, వేదాంత పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని (ఇపిఎ)ను వుల్లంఘించిందని రమేష్‌ పేర్కొన్నారు. ”ఇపిఎతో సహా పలు ఉల్లంఘనలకు పాల్పడిన ప్రాజెక్టు సంబం ధీకులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాన్ని పరి శీలిస్తున్నాం.” అని ఆయన చెప్పారు. ఇదిలావుండగా, వేదాంత ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతిని నిరాకరించడంపై ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. తాను ఢిల్లీలో పర్యావరణ శాఖ మంత్రి జైరాం రమేష్‌ను కలిసినప్పుడు సూచనప్రాయంగానైనా ఈ నిర్ణయాన్ని చెప్పలేదని అన్నారు. ”వేదాంత మైనింగ్‌ ప్రాజెక్టుకు అనుమతిని నిరాక రించడంపై సోమవారం ఢిల్లీలో ఆయనను కలిసినప్పుడు నాకేమీ చెప్పలేదు.” అని అన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక రాజకీయ కారణాలు ఏమైనా వున్నాయా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు పట్నాయక్‌ సమాధానమిస్తూ ”ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు.” అని నేను భావిస్తున్నాను అన్నారు. ఒరిస్సాలో ఉపాధికల్పనకు ఈ పెట్టుబడులు ఉపయోగ పడటమే కాక ప్రభుత్వ ఆదాయాన్ని కూడా పెంచుతాయి.” అని ఆయన అన్నారు. కలహంది వంటి వెనుకబడిన జిల్లాలు ఇంతకుముందె న్నడూ ఇంత పెద్ద ప్రాజెక్టును చూసి ఉండవు.” అని ఆయన అన్నారు. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతిని తిరస్క రించడానికి గల కారణా లను ఒరిస్సా ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది అని ఆయన అన్నారు. అదే విధంగా వేదాంత ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి నిరాకరించడాన్ని దురదృష్టకరమైన అంశంగా ఒరిస్సా ప్రభుత్వం పేర్కొంది. ”వేదాంత బాక్సైట్‌ మైనింగ్‌ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతిని కేంద్ర ప్రభుత్వం నిరాకరించడం చాలా దురదృష్టకరమైన విషయం.” అని ఒరిస్సా పరిశ్రమలు, ఉక్కు, గనుల శాఖ మంత్రి రఘునాధ్‌ మహంతి విలేకరుల తో అన్నారు. చాలాకాలం క్రితం ప్రాథమికంగా అనుమ తిచ్చిన కేంద్రం ఒక్కసారిగా అకస్మాత్తుగా అనుమతిని నిరాకరించడం సరైన పద్దతి కాదని ఆయన అన్నారు. ఒకసారి ప్రాథమికంగా అనుమతి ఇచ్చిన తరువాత వేదాంత అల్యుమినియం లిమిటెడ్‌ తన ప్రాజెక్టు పనులలో పురోగతి సాధించిందని ఆయన చెప్పారు. దీని సామర్ధ్యాన్ని కూడా ఒక మిలియన్‌ టన్నుల నుండి ఆరు మిలియన్‌ టన్నులకుపెంచుకున్నదని అన్నారు.ఈ దశలో అనుమతిని రద్దు చేయడం తగిన పనికాదని ఆయన అన్నారు. కాగా సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి భక్త చరణ్‌ దాస్‌ కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతించారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: