మూతబడ్డ రంగురాళ్ల మెరుగు కేంద్రం


విశాఖపట్నం: గిరిజన నిరుద్యోగ యువతీ, యువకుల ఉపాధి కోసం విశాఖ ఏజెన్సీలోని అరకులోయలో ఏర్పాటుచేసిన రంగురాళ్లు మెరుగుపరచే శిక్షణా కేంద్రం మూతబడింది. చదువుకుని ఉద్యోగాల వేటలో పడి ఇళ్లల్లో ఖాళీగా ఉంటున్న నిరుద్యోగులకు రంగురాళ్లను మెరుగుపట్టడంలో శిక్షణనిచ్చి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలుగా ఈ కేంద్రాన్ని ట్రిమ్‌కో ఏర్పాటుచేసింది. గిరిజన యువతకు ఉపాధి కల్పించేందుకు ట్రిమ్‌కో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శిక్షణా కేంద్రం మూడు నెలలుగా మూతబడే దర్శమిస్తుంది. ప్రస్తుతం రంగురాళ్ల మెరుగు యూనిట్ తలుపులకు తాళాలు పడి తెరచుకోలేదు. అప్పటి శాసనసభ్యుడు డాక్టర్ కుంబా రవిబాబు, పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి ఎ.శరత్ హయాంలో ప్రారంభమైన కేంద్రంలో ఆరు నెలల పాటు ఒక్కొక్క బ్యాచ్‌కు శిక్షణనందించాలనే ఉద్దేశంతో మూడు బ్యాచ్‌లను ఎంపిక చేశారు. శిక్షణ పొందే యువతీ, యవకుల్లో ఒక్కొక్కరికీ నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల వంతున స్ట్ఫైండ్ చెల్లించి శిక్షణాకాలం అనంతరం ధృవపత్రాలను పంపిణీ చేయాలని నిర్ణయించి శిక్షణా తరగతులను ప్రారంభించారు. అయితే రెండు బ్యాచ్‌లకు శిక్షణా తరగతులు ముగిసినప్పటికీ నేటికీ శిక్షణాభ్యర్థులకు చెల్లించాల్సిన ప్రోత్సాహకాలను అందించలేదు. ఈ కేంద్రంలో శిక్షణ పూర్తిచేసిన ఒక్కరికి కూడా ఇంతవరకు ఎటువంటి ఉపాధి దొరకలేదు. దీంతో రంగురాళ్లు మెరుగుపరిచే శిక్షణా కార్యక్రమంపై నిరుద్యోగ యువత ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వం అట్టహాసంగా శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటుచేయడమే తప్ప పూర్తిస్థాయిలో నిరుద్యోగ గిరిజన యువతీ, యువకులకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోలేదన్న విమర్శలున్నాయి. దీంతో పాటు స్థానికంగా నిరుద్యోగ యువతీ, యువకులకు శిక్షణనందించే శిక్షకులు కూడా అందుబాటులో లేరని తెలిసింది. గతంలో శిక్షకులుగా పనిచేసిన వారి వల్ల ఆశించిన ఫలితాలు రాలేదని పాలకులు, అధికారులు భావిస్తూ శిక్షణా కేంద్రం మూతబడడమే శ్రేయస్కారమని అంటున్నట్టు తెలిసింది. ఈ శిక్షణా కేంద్రం సత్ఫలితాలు ఇవ్వకపోవడం వల్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో యూనిట్‌ను మూసివేసినట్టు తెలిసింది. గత మూడు నెలలుగా శిక్షణా కేంద్రం మూతబడి దర్శనమిస్తుండడం వల్ల శిక్షకులకు ఇక్కడ కేటాయించిన క్వార్టర్లను స్వాధీనపరుచుకొని అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులకు ఆ క్వార్టర్లను మంజూరు చేయాలని స్థానిక గిరిజనులు, గిరిజన నాయకులు, గిరిజన సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: