జిఎస్‌టి డెడ్‌లైన్‌ మిస్‌?


న్యూఢిల్లీ: ఎన్నాళ్ళనుండో అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న నూతన పరోక్ష పన్నుల వ్యవస్థ అయిన గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌(జిఎస్‌టి) షెడ్యూల్‌ తేదీ 2011 ఏప్రిల్‌ ఒకటవ తేది నుండి అమలయ్యేలా కనిపించడం లేదని ప్రభుత్వ ఉన్న తాధికారి ఒకరు తెలిపారు. గడువులోగా జిఎస్‌టి ప్రవేశపెట్టే పరిస్థితులు కనిపించడం లేదని రెవిన్యూ కార్యదర్శి సునీల్‌ మిత్రా పిటిఐతో అన్నారు. కేంద్రం పరిధిలోకి వచ్చే ఎక్సైజ్‌ సుంకం, సర్వీసు సుంకం, రాష్ట్రాల పరిధిలోకి వచ్చే వ్యాట్‌, స్థానిక పన్నులు, సెస్సులు, సర్‌ఛార్జీల స్థానే జిఎస్‌టి వస్తుందని భావిస్తున్నారు. అయితే కచ్చితంగా జిఎస్‌టి ఎప్పుడు అమల్లోకి వచ్చేది ఆయన చెప్పలేదు. జిఎస్‌టిపై రాజ్యాంగ సవరణ బిల్లు ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లో పెట్టేలా కనిపించడం లేదు. ఎందుకంటే దీనిపై ఏకాభిప్రాయం లేదు. ఆగస్టు 31తో పార్ల మెంట్‌ సమావేశాలు ముగుస్తాయి. దీనిపై ఒక అంగీకారానికి రాగలిగితే ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ బిల్లును పెట్టడానికి వీలవుతుందని అన్నారు. కాని ఇప్పుడు సాధ్యం కాదని చెప్పారు. బిజెపి పాలిత రాష్ట్రాలు, మరికొన్ని ఇతర రాష్ట్రాలు జిఎస్‌టిపై సవరించిన రాజ్యాంగ సవరణ బిల్లు ముసాయిదాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ అభిప్రాయాలు దీనిపై స్పష్టంగా చెప్పడానికి మరో నెల గడువు కావాలని కోరుతున్నాయి. ముసాయిదా బిల్లును ప్రస్తు సమావేశాల్లో ప్రవేశపెడితే, చర్చలు, పరిశీలనలు పూర్తయిన తర్వాత ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్‌ సమా వేశాల్లో దీనిపై ఓటింగ్‌ పెట్టవచ్చని మిత్ర అభిప్రాయపడ్డారు. గత వారం రాష్ట్రాల జిఎస్‌టి ప్యానెల్‌తో ఆయన సమావేశమ య్యారు. ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో బిల్లును పార్లమెంట్‌లో పెడితే మరోపక్క కేంద్రం, రాష్ట్రాల మధ్య చర్చలు కూడా సమాంతరంగా సాగుతుంటాయని ఆర్ధిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. కాగా సవరించిన ముసాయిదాకు బిజెపి పాలిత రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. జిఎస్‌టి వ్యవస్థలో మార్పులు ఎలా తీసుకువస్తారో సరైన వివరణ లేదని పేర్కొంటు న్నాయి. రాష్ట్రాల పన్నులకు సంబంధించి వీటో అధికారాలను కేంద్ర ఆర్ధిక మంత్రి వద్దనే వుంచుకోవడంతో రాష్ట్రాలు గతంలో ముసాయిదాను తిరస్కరించాయి. కేంద్ర ఆర్ధిక మంత్రి అను మతితో, మూడింట రెండు వంతుల రాష్ట్రాల మెజారిటీతో జిఎస్‌టి పై నిర్ణయాలు తీసుకునేందుకు జిఎస్‌టి కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని తొలి ముసాయిదా ప్రతిపాదించింది. అయితే ఏకాభి ప్రాయం వుంటేనే నిర్ణయం తీసుకోగలుగుతామని సవరించిన ముసాయిదా పేర్కొంది. ఏకాభిప్రాయం అంటే అర్ధమేంటో చెప్పాలని బిజెపి పాలిత రాష్ట్రాలు కోరుతున్నాయి. ఏకాభిప్రాయం అన్న పదం స్థానే అనుమతి అన్న పదం చేర్చాలని సూచించాయి. వివాదాల పరిష్కారాల యంర్రతాంగమనేది వుండాలని రెండు ముసాయి దాలు పేర్కొన్నాయి. రాష్ట్రాల ఆందోళనలను పరిష్కరించేందుకు మూడవ సవరించిన ముసాయిదా సిద్ధమవు తుందని ముఖర్జీ చెప్పారు. దీనిపై సెప్టెంబరు మొదటివారంలో రాష్ట్రాల ఆర్ధిక మంత్రులు సమావేశమవుతున్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: